BigTV English

Migraine Solution: వీటితో.. ఎంతటి తలనొప్పి అయినా క్షణాల్లోనే మాయం

Migraine Solution: వీటితో.. ఎంతటి తలనొప్పి అయినా క్షణాల్లోనే మాయం

Migraine Solution: మైగ్రేన్ చాలా బాధాకరమైన పరిస్థితి అని చెప్పొచ్చు. చల్లని వాతావరణంలో ఈ సమస్య మరింత పెరుగుతుంది. జలుబు వల్ల సైనస్,ముక్కు దిబ్బడ వంటి సమస్యలు కూడా మైగ్రేన్‌ను పెంచుతాయి. ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే మైగ్రేన్ నుండి ఉపశమనం పొందడంలో సహాయపడేందుకు హోం రెమెడీస్ చాలా బాగా ఉపయోగపడతాయి. ఇవి శీతాకాలంలో మైగ్రేన్ నుండి ఉపశమనం అందించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. మైగ్రేన్ ని తగ్గించే హోం రెమెడీస్ ఎలా తయారు చేసుకుని వాడాలనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


అల్లం టీ:
చలికాలంలో అల్లం టీ తాగడం వల్ల మైగ్రేన్ నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతే కాకుండా వేడి నీళ్లలో చిన్న అల్లం ముక్కలను వేసి మరిగించి టీలా చేసుకుని కూడా తాగవచ్చు. ఈ టీ మైగ్రేన్ నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. అంతే కాకుండా చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో కూడా చాలా బాగా ఉయోగపడుతుంది.

తులసి కషాయాలు:
చలి కాలంలో తులసి కషాయం తాగడం వల్ల మైగ్రేన్ నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. కషాయం చేయడానికి, మీరు కొన్ని తులసి ఆకులను ఉడికించి అందులో కాస్త తేనెతో పాటు నిమ్మరసం వేసి త్రాగవచ్చు. ఈ కషాయం మైగ్రేన్ నుండి ఉపశమనం కలిగిస్తుంది.అంతే కాకుండా రోగనిరోధక శక్తిని కూడా బలపరుస్తుంది.


ఆవిరి:
మైగ్రేన్ కొన్నిసార్లు ముక్కు దిబ్బడ వల్ల కూడా వస్తుంది. శీతాకాలంలో ఈ సమస్య పెరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో ఆవిరి తీసుకోవడం మంచి పరిష్కారం. ఆవిరి పట్టడం వల్ల ముక్కు క్లియర్ అవుతుంది. ఫలితంగా తలనొప్పి నుండి ఉపశమనం కూడా లభిస్తుంది.

 ఈ జాగ్రత్తలు అవసరం:

మైగ్రేన్‌తో బాధపడేవారికి ఈ నొప్పి రాకముందే కొన్ని సంకేతాలు కనిపించడం ప్రారంభిస్తాయి. మీరు అలాంటి లక్షణాలను గమనించిన వెంటనే అప్రమత్తంగా ఉండండి. అంతే కాకుండా మైగ్రేన్‌ను ప్రేరేపించే విషయాల నుండి దూరంగా ఉండండి. నిశ్శబ్ద ప్రదేశంలో ఉండండి. చీకటి, ప్రశాంతమైన గదిలో కొంత సమయం పాటు నిద్రించండి.

మైగ్రేన్‌తో బాధపడేవారు ఆహారం విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు, మీ ఆహారంలో సీజనల్ కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు మొదలైనవి చేర్చుకోండి. అదనపు నూనె, ఉప్పు, కారం, ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండండి.

మైగ్రేన్ విషయంలో రెగ్యులర్ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. మీరు తినే ఫుడ్‌ను అస్సలు మానేయకండి. అంతే కాకుండా కరెక్ట్ టైంకు తినండి. చాలా ఆలస్యంగా లేదా ఎప్పుడైతే అప్పు తినడం మానుకోండి. మీ శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోండి.

మైగ్రేన్ సమస్యను నివారించడానికి, తగినంత నిద్ర పొందడం చాలా ముఖ్యం. రోజు కనీసం 7 నుండి 8 గంటల నిద్రపోండి తద్వారా వాతావరణంలో మార్పు వచ్చినప్పటికీ మైగ్రేన్ నొప్పి రాకుండా ఉంటుంది.

Also Read: ఇలా చేస్తే.. జుట్టు వద్దన్నా పెరుగుతుంది

మైగ్రేన్‌తో బాధపడుతున్న వ్యక్తులు ఒత్తిడి నిర్వహణను నేర్చుకోవడం కూడా చాలా ముఖ్యం. దీని కోసం మీ దినచర్యలో ధ్యానం, యోగా, శ్వాసకు సంబంధించిన వ్యాయామాలను చేర్చండి. ప్రతిరోజు కొంత వ్యాయామం చేయండి.

మైగ్రేన్ సమస్య పెరిగితే మీ వైద్యుడిని సంప్రదించి సరైన మందులు తీసుకోవడం చాలా ముఖ్యం. దీని కోసం, నొప్పి ఎప్పుడు వచ్చింది, ఎంత సేపు, లక్షణాలు ఏమిటి వంటి ముఖ్యమైన విషయాలన్నింటినీ డాక్టర్‌తో పంచుకోండి.

Related News

Pneumonia causes: న్యుమోనియా రావడానికి అసలు కారణాలివే !

Pineapple Benefits: ఖాళీ కడుపుతో పైనాపిల్ తింటే.. ఇన్ని లాభాలా ?

Night Shift Workers: నైట్ షిప్ట్ చేస్తున్నారా ? ఈ టిప్స్ మీకోసమే !

Late Sleep: రాత్రి 11 తర్వాత నిద్రపోతున్నారా ? ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు !

Japanese Interval Walking: జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్.. ప్రయోజనాలు తెలిస్తే ఈ రోజు నుంచి మొదలెడతారు !

Momos side effects: మొమోస్ తింటున్నారా? అయితే ఈ నిజం తప్పక తెలుసుకోండి..

Big Stories

×