BigTV English

Virat Kohli House: కోహ్లీ కొత్త ఇల్లు ఇదే..32 కోట్లతో రెడీ.. గృహ ప్రవేశం ఎప్పుడంటే ?

Virat Kohli House: కోహ్లీ కొత్త ఇల్లు ఇదే..32 కోట్లతో రెడీ.. గృహ ప్రవేశం ఎప్పుడంటే ?

Virat Kohli House:  టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ  ( Virat Kohli ) గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. టీమిండియా క్రికెటర్ గా ఎన్నో వేల పరుగులు చేసిన విరాట్ కోహ్లీ… సంపాదన కూడా విపరీతంగా ఆర్జించాడు. ఈ నేపథ్యంలోనే టీమిండియాలోనే అత్యంత ధనిక క్రికెటర్ గా కూడా విరాట్ కోహ్లీ అభివృద్ధి చెందడం జరిగింది. విరాట్ కోహ్లీ ( Virat Kohli ) క్రికెట్ తో పాటు వివిధ బిజినెస్ ల ద్వారా డబ్బులను ఆర్జిస్తున్నాడు. ఆయన భార్య బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ ( Anushka Sharma ) కూడా… పలు బిజినెస్ లో డబ్బులు.. సంపాదించడం జరుగుతుంది.


Also Read: Axar patel – Rahul: కె.ఎల్ రాహుల్ కి షాక్.. ఢిల్లీ కెప్టెన్ గా డేంజర్ ఆల్ రౌండర్?

విరాట్ కోహ్లీ అలాగే అనుష్క దంపతులకు పలు రెస్టారెంట్లు కూడా ఉన్నాయి. అయితే ఇలా వచ్చిన డబ్బులతో దేశవ్యాప్తంగా విల్లాలు కొనుగోలు చేసి… లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే తాజాగా… గృహప్రవేశం చేసేందుకు అనుష్క శర్మ ( Anushka Sharma ) అలాగే విరాట్ కోహ్లీ దంపతులు సిద్ధమవుతున్నారు. ఈ నెల చివర్లో… కొత్త ఇంట్లోకి కోహ్లీ దంపతులు వెళ్ళబోతున్నారట.


ఈ మేరకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక విరాట్ కోహ్లీ కి సంబంధించిన కొత్త ఇంటి నిర్మాణం అలాగే అక్కడ జరిగే గృహప్రవేశం డెకరేషన్… కు సంబంధించిన వీడియోలు అలాగే ఫోటోలు సోషల్ మీడియాలో రెండు రోజుల నుంచి వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అలీ బాగ్ లో ( Alibag ) కొత్త ఇంటిని నిర్మించుకున్నాడు విరాట్ కోహ్లీ. ఆలీబాగ్ లో ( Alibag )… 2022 సంవత్సరంలోనే ల్యాండ్ కొనుగోలు చేసిన విరాట్ కోహ్లీ… ఈ మధ్యకాలంలోనే ఇంటిని నిర్మించుకున్నాడు. ఈ ల్యాండ్ 2022లో కొనుగోలు చేసినప్పుడు 19 కోట్లు పెట్టాడట.

 

దాదాపు 8 ఎకరాల ల్యాండ్ ఒకే చోట కొనుగోలు చేసి… ఇంటి నిర్మాణం కోసం 13 కోట్లు ఖర్చు చేశాడట. కొత్తగా నిర్మించుకున్న విరాట్ కోహ్లీ విల్లాలో… విశాలవంతమైన గార్డెన్, ఇల్లు, సౌకర్యవంతమైన స్విమ్మింగ్ పూల్ కూడా ఉందట. వీటి నిర్మాణం కోసం 13 కోట్లు ఖర్చు చేశాడట విరాట్ కోహ్లీ. అంటే తన కొత్త ఇంటి నిర్మాణం కోసం మొత్తం 32 కోట్లు ఖర్చు చేశాడన్న మాట. అయితే ఈ నెల చివర్లో కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేయబోతున్నాడు విరాట్ కోహ్లీ. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు.. విరాట్ కోహ్లీ టీం చూసుకుంటుంది.

Also Read: Gambhir – Sarfaraz: డ్రెస్సింగ్ రూమ్ సీక్రెట్స్ లీక్.. సర్ఫరాజ్ కు గంభీర్ వార్నింగ్

ఛాంపియన్ ట్రోఫీ 2025 ప్రారంభాని కంటే ముందే… ఈ ఇంట్లోకి ప్రవేశించబోతున్నారట విరాట్ కోహ్లీ దంపతులు. అందుకే ఈ సారి లండన్ కు వెళ్లకుండా ఇండియాలోనే ఉన్నాడు విరాట్ కోహ్లీ. ప్రస్తుతం ముంబైలో ఉంటూ ఆలీబాగ్ విల్లా… పనులను దగ్గరుండి చూసుకుంటున్నాడట విరాట్ కోహ్లీ. అయితే తాజాగా విరాట్ కోహ్లీ కి సంబంధించిన ఇంటి గేటు… డెకరేషన్ వీడియో వైరల్ అయింది. అలాగే ఆయన కట్టుకున్న ప్రహరీ గోడ కూడా ఈ వీడియోలో కనిపించింది. ఈ వీడియో చూసిన విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.

Related News

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Big Stories

×