BigTV English

New Corona Cases AP: మూడో కేసు.. ఏపీలో కరోనా కలకలం

New Corona Cases AP: మూడో కేసు.. ఏపీలో కరోనా కలకలం

New Corona Cases AP: ఏలూరులో కోవిడ్ కలకలం రేపుతోంది. శాంతినగర్‌లో నివాసం ఉంటున్న రిటైర్డ్ దంపతులుకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవలే విజయవాడ మణిపాల్ హాస్పిటల్‌లో ఆపరేషన్ చేయించుకున్నారు రిటైర్డ్ ఉద్యోగి సత్యనారాయణ. తల్లిదండ్రులను చూసేందుకు విదేశాల నుంచి ఇంటికి వచ్చారు ఇద్దరు కూతుళ్లు. అయితే పేరెంట్స్‌కి మళ్లీ అనారోగ్యం రావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లగా కరోనా అని నిర్దారించారు వైద్యులు. పాజిటివ్ అని తేలడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. అయితే వైద్యాధికారులు మాత్రం ఏలూరులో ఎటువంటి కరోనా లేదంటున్నారు.


దేశంలో మరోసారి కరోనా మహమ్మారి కలవరం సృష్టిస్తోంది. కొత్త కేసులు నమోదు అవుతుండటంతో మళ్లీ టెన్షన్ పెడుతోంది. ఒక్క కేరళలో 430 కేసులతో టాప్ ప్లేస్ లో ఉంది. ఇక ఇప్పటి వరకు ఏడుగురు చనిపోయారు. ఏ రాష్ట్రంలో ఎన్ని కేసులు వచ్చాయో.. కరోనా లెక్కేందో ఓ లుక్కేద్దాం.

యావత్‌ ప్రపంచాన్ని భయపెట్టిన కరోనా ఇప్పుడు మళ్లీ తన పంజా విసురుతోంది. దేశంలో కొత్తగా నమోదౌతున్న కేసులు కలకలం రేపుతున్నాయి. గత వారం రోజులుగా కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్‌, తమిళనాడు, కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వెయ్యికి పైగా కరోనా కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. గత వారం వ్యవధిలో 752 కొత్త కేసులు నమోదైనట్లు వెల్లడించింది. గతవారం అత్యధికంగా కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీలో అత్యధిక సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.


కేరళలో కొత్తగా 335 మందికి వైరస్‌ సోకింది. ఆ రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 430కి చేరుకున్నాయి. మహారాష్ట్రలో 153, ఢిల్లీలో 99 కొత్త కేసులు నమోదయ్యాయి. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన డేటా ప్రకారం, మహారాష్ట్రలో 209 యాక్టివ్ కేసులు, ఢిల్లీలో 104 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. గుజరాత్‌లో 83, కర్ణాటకలో 47, ఉత్తరప్రదేశ్‌లో 15, పశ్చిమ బెంగాల్‌లో 11, రాజస్థాన్‌లో 11, ఏపీలో 4, తమిళనాడులో 3, తెలంగాణలో 1, మధ్యప్రదేశ్‌లో 2, హర్యానాలో 9, ఛత్తీస్‌గఢ్‌లో ఒక కేసు నమోదైంది.

ఇప్పటి వరకు కరోనాతో ఏడుగురు చనిపోయారు. మహారాష్ట్రలో నలుగురు, కేరళలో ఇద్దరు, కర్ణాటకలో ఒకరు వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. అండమాన్ నికోబార్, అరుణాచల్ ప్రదేశ్, అసోం, బీహార్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్ రాష్ట్రాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. గతంలో దేశవ్యాప్తంగా కరోనా టీకాలు వేయటం వల్లే ఇప్పుడు కేసుల సంఖ్య తక్కువగా ఉందని.. అనారోగ్యంతో ఉన్న వాళ్లపైనే ఇప్పుడు వైరస్‌ ప్రభావం చూపిస్తోందని తెలిపింది. మిగతా వాళ్లపై పెద్దగా ప్రభావం చూపించటం లేదని.. జనం భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని వైద్య శాఖ స్పష్టం చేస్తోంది.

Also Read: పాలతో రోజూ ఇలా చేస్తే.. అందమైన మెరిసే చర్మం మీ సొంతం

తెలుగు రాష్ట్రాల్లోనూ మళ్లీ కరోనా కలవరం మొదలైంది. తెలంగాణలో తొలి కరోనా కేసు నమోదైంది. కూకట్‌పల్లిలో ఓ డాక్టర్‌కు కరోనా పాజిటివ్‌ అని తేలింది. బాధితుడిలో జలుబు, దగ్గు, జ్వరం లాంటి లక్షణాలు గుర్తించారు. అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం.. గాంధీ ఆస్పత్రిలో 25 పడకల వార్డును సిద్ధం చేసింది. ఏపీని కూడా కరోనా కేసులు టెన్షన్‌ పెడుతున్నాయి. విశాఖలో 2 కరోనా కేసులు, కడపలో రెండు కేసులు నమోదవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. అలెర్ట్‌ అయిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు.. విశాఖ జీజీహెచ్‌లో కరోనా ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు.

 

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×