BigTV English

Glowing Skin Tips: పాలతో రోజూ ఇలా చేస్తే.. అందమైన మెరిసే చర్మం మీ సొంతం

Glowing Skin Tips: పాలతో రోజూ ఇలా చేస్తే.. అందమైన మెరిసే చర్మం మీ సొంతం

Glowing Skin Tips: మీకు అందమైన ముఖం కావాలా? మీ స్కిన్ ఎప్పుడు మిల మిల మెరిసిపోవాలా? అయితే పాలతో ప్రతిరోజు ఇలా చేయండి. చక్కని పట్టులాంటి చర్మం మీ సొంతం అవుతుంది. సాధారణంగా పాలు మన ఆరోగ్యానికి ఎంత మంచిదో.. చర్మ సౌందర్యానికి కూడా అంతే మంచిది. పాలలో ఉండే విటమిన్ ఎ, విటమిన్ డి, బి6, బీ12, కాల్షియం, లాక్టిక్ యాసిడ్ వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి. ఇవి చర్మం ఆరోగ్యంగా ఉంచడంతో పాటు.. నిత్యం తాజాగా ఉండేలా చేస్తాయి. పాలు మన చర్మ సౌందర్యానికి చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చు. అటువంటి పాలను ప్రతిరోజు ముఖానికి రాసుకోవడం వల్ల ముఖం మీద ఉండే మురికితో పాటు, మృత కణాలు తొలగిపోయి.. చర్మం చాలా ప్రకాశవంతంగా తయారు అవుతుందని.. సౌందర్య నిపుణులు చెబుతున్నారు. ఇంకెందుకు లేట్ పాలతో ఫేస్ ప్యాక్‌లు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.


పచ్చిపాలు, కోడిగుడ్డు ఫేస్ ప్యాక్
ముందుగా చిన్న గిన్నె తీసుకుని.. అందులో పచ్చిపాలు మూడు టేబుల్ స్పూన్లు, గుడ్డులోని తెల్లసొన తీసుకుని వాటిని బాగా మిక్స్ చేసి.. ముఖానికి పెట్టుకోండి. ఆ తర్వాత 10 నిమిషాల పాటు మసాజ్ చేసి, గోరువెచ్చటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి మూడు సార్లు చేస్తే.. ముఖంపై మురికి, అదనపు నూనెలు తొలగిపోయి ..చాలా అందంగా కనిపిస్తారు. ముఖం ఎప్పుడు తాజాగా కనిపిస్తుంది.

పాలు, ఓట్స్ ఫేస్ ప్యాక్
ఒక కప్పు పచ్చిపాలు తీసుకుని.. అందులో రెండు టేబుల్ స్పూన్ ఓట్స్ కలపాలి. వీటిని మిక్సీ జార్‌లోకి తీసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోండి. తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి పెట్టుకుని 15 నిమిషాల తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మీ చర్మం కాంతివంతంగా, మెరిసేలా చేస్తుంది. అంతేకాదు స్కిన్ చాలా సాఫ్ట్‌గా తయారు అవుతుంది.


పచ్చిపాలు, అరటిపండు ఫేస్ ప్యాక్
చిన్న గిన్నె తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ పచ్చి పాలు, అరటి పండు గుజ్జు వేసి బాగా మెత్తగా పేస్ట్ లాగా చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి అరగంట తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే.. ముఖంపై మచ్చలు, మొటిమలు తొలగిపోయి కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది.

పాలు, తేనె ఫేస్ ప్యాక్
చిన్న గిన్నె తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ పచ్చిపాలు, రెండు టేబుల్ స్పూన్ తేనె కలిపి ముఖానికి పెట్టుకొని.. 20 నిమిషాల పాటు మసాజ్ చేయండి. ఇలా ప్రతిరోజు రోజు చేస్తే ముఖంపై ఉన్న దుమ్ము, ధూళి తొలగిపోయి కాంతివంతంగా మెరుస్తుంది.

Also Read: ఈ చిన్న చిట్కాను రాత్రి పడుకునే ముందు ట్రై చేయండి.. మెరిసే చర్మం మీ సొంతం

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Hair Care Tips: వర్షంలో జుట్టు తడిస్తే..… వెంటనే ఇలా చేయండి?

Paneer Effects: దే…వుడా.. పన్నీరు తింటే ప్రమాదమా?

Hair Growth Tips: ఈ టిప్స్ పాటిస్తే.. వారం రోజుల్లోనే ఒత్తైన జుట్టు !

Gut Health: గట్ హెల్త్ కోసం.. ఎలాంటి ఆహారం తినాలి ?

Cucumber Benefits: దోసకాయ తింటే.. నమ్మలేనన్ని లాభాలు !

Mint Leaves: తులసి ఆకులు నేరుగా తింటే ప్రమాదమా? ఏమవుతుంది?

Big Stories

×