Kannappa Prabhas : ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమాలలో మంచు ఫ్యామిలీ నిర్మిస్తున్న కన్నప్ప సినిమా ఒకటి. వాస్తవానికి ఈ సినిమాను అనౌన్స్ చేసినప్పుడు ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. ఎందుకంటే ఆల్మోస్ట్ మంచు ఫ్యామిలీ నుంచి వస్తున్న సినిమాలను చాలామంది చూడటం మానేశారు. ఇకపోతే కన్నప్ప సినిమా మీద కొద్దో గొప్పో అంచనాలు ఉన్నాయి. దానికి కారణం భారీ తారాగణం ఈ సినిమాలో నటించడం. అలానే ఆ సినిమా డైరెక్టర్ కూడా, ఇప్పటివరకు ఈ సినిమా నుంచి వచ్చిన కంటెంట్ కూడా కొంతమేరకు సినిమా మీద ఆసక్తిని కలిగించింది అని చెప్పాలి. అలానే సాంగ్స్ కూడా మంచి పేరును తీసుకొచ్చాయి.
ప్రభాస్ సీన్స్ మిస్
ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ క్రేజ్ అమాంతంగా పెరిగిపోయింది. ఇప్పుడు ప్రభాస్ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ అంతా ఎదురు చూడటం మొదలుపెట్టారు. ఇప్పటికే ప్రభాస్ కెరియర్లో రెండు వెయ్యికోట్లకు పైగా కలెక్ట్ చేసిన సినిమాలు ఉన్నాయి. అయితే కన్నప్ప సినిమాలో ప్రభాస్ రుద్ర అనే పాత్రలో కనిపిస్తున్నట్టు అధికారికంగానే ప్రకటించింది చిత్ర యూనిట్. దాదాపు ప్రభాస్ పాత్ర ఈ సినిమాలో 30 నిమిషాల వరకు ఉంటుంది అని ఇదివరకే తెలిపారు. ఈ సినిమా హార్డ్ డిస్క్ మిస్ అయిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ప్రభాస్ నటించిన సీన్స్ ఈ హార్డ్ డిస్క్ లో ఉన్నట్లు తెలుస్తుంది. ఇకపోతే ఒకవేళ ఈ మాటలే నిజమైనట్లయితే సినిమా మీద అంచనాలు సగం మందికి పోతాయి. ప్రభాస్ కోసమే ఈ సినిమా చూసే ఆడియన్స్ ఉన్నారు.
ప్రభాస్ డేట్స్ మళ్ళీ ఇస్తారా.?
ఒకవేళ ఈ పాన్ ఇండియా సినిమాకు సంబంధించిన హార్డ్ డిస్క్ నిజంగానే మిస్ అయినట్లయితే, ఇదివరకే షూట్ చేసిన సీన్స్ ఆల్టర్నేట్ గా వేరే దగ్గర లేకపోయినట్లయితే, ఈ చిత్ర యూనిట్ భారీ ఇబ్బందుల్లో ఉంది అని చెప్పాలి. ఎందుకంటే ఆ సీన్స్ మిస్ అయితే మళ్ళీ రీ షూట్ చేయవలసిన పరిస్థితి. ఇప్పుడు ప్రభాస్ ఉన్న పరిస్థితుల్లో మళ్ళీ ఈ సినిమా కోసం టైం ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. ఒకవైపు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్. మరోవైపు హను రాఘవపూడి దర్శకత్వంలో మరో సినిమా, అలానే మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ అనే సినిమాలతో కంప్లీట్ బిజీగా మారిపోయాడు ప్రభాస్. ప్రభాస్ సీన్స్ మిస్ అయితే చిత్ర యూనిట్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో కొద్ది రోజుల్లో తెలియనుంది.