RC 17: సుకుమార్ (Sukumar )దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) హీరోగా నటించిన రంగస్థలం (Rangastalam )సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ తెరపైకి రాబోతోంది అంటూ వార్తలు వచ్చినప్పటి నుంచే అంచనాలు తారస్థాయికి చేరుకున్నాయి. అయితే ఇప్పుడు ఎట్టకేలకు ఆర్‌సీ17 పూజా కార్యక్రమాలు మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)చేతుల మీదుగా చాలా ఘనంగా జరగడం గమనార్హం.
హైదరాబాద్ లో అత్యంత వైభవంగా నిర్వహించిన ఈ చిత్ర ప్రారంభోత్సవ పూజా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి తొలి క్లాప్ కొట్టారు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ పథకాలపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తుండగా టీ – సిరీస్ సంస్థ సమర్పిస్తోంది. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నట్లు సినీవర్గాలలో ప్రచారం జోరుగా సాగుతోంది. మొత్తానికి అయితే ఈ ప్రాజెక్ట్ పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైన నేపథ్యంలో రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభించి ,కంటిన్యూస్గా పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల పూర్తి వివరాలను త్వరలోనే మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు.
also read:మాది ఆరేళ్ల ప్రేమ.. బ్రేకప్ జరగడానికి కారణం అదే – బిగ్ బాస్ షాలిని!
ఇదిలా ఉండగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఘనంగా ప్రారంభం కావడంతో.. ఒకరోజు ముందుగా అనగా అక్టోబర్ 31న ఈ చిత్ర దర్శకుడు సుకుమార్ భార్య తబిత సుకుమార్ (Thabitha Sukumar) తన ఇంస్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా ఒక ఎమోషనల్ అండ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పంచుకున్నారు. ఈ ప్రాజెక్టు డైరెక్టర్ సుకుమార్ భార్యగా తనకు ఆసక్తితో పాటు గర్వాన్ని కూడా ఇస్తుంది అని ఆమె పేర్కొన్నారు. ఈ సినిమా స్క్రిప్ట్ కోసం సుకుమార్ పడ్డ కష్టం, ప్యాషన్ , కౌంట్ లెస్ అవర్స్ , రైటింగ్ వర్క్ నా కల్లారా చూసాను. అది ఇప్పుడు ఇలా మెటీరియలైజ్ అవ్వడం చాలా స్పెషల్ గా అనిపిస్తోంది. ఆడియన్స్ ఎంతో ఇష్టపడుతున్న ఈ క్రేజీ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతుండడంతో అంచనాల పారామీటర్స్ కూడా స్కై రేంజ్ లో ఉన్నాయి. ఈ ఎపిక్ జర్నీ సిల్వర్ స్క్రీన్ పై ఎలా అన్ఫోల్డ్ అవుతుందో చూడడానికి నేను కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అంటూ ఆమె వెల్లడించింది.
మొత్తానికైతే దర్శకుడు సుకుమార్ ఈ సరికొత్త లార్జెర్ దాన్ లైఫ్ కాన్సెప్ట్ రైటింగ్ కోసం పెట్టిన ఎఫర్ట్స్ ని ఆయన భార్య తబితా సుకుమార్ ప్రత్యేకంగా హైలెట్ చేయడంతో మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ రచ్చ లేపుతున్నారు. కచ్చితంగా ఈ సినిమా ఇండియన్ సినిమా హిస్టరీలోనే మరో మైలురాయిగా నిలిచిపోతుంది అంటూ ట్రేడ్ పండితులు కూడా విశ్లేషిస్తున్నారు.
The journey of #RC17 begins with the MEGA CLAP ❤️
Megastar @KChiruTweets garu sounded the clapboard and blessed the entire team of #RC17 ✨#YouCanImagine #RC2Sukku#SRC
Mega Power Star @AlwaysRamCharan Master Storyteller @aryasukku @MythriOfficial @SukumarWritings… pic.twitter.com/oNKJYwniit
— Mythri Movie Makers (@MythriOfficial) November 1, 2026