Long Hair: ఈ రోజుల్లో జుట్టు రాలడం అనేది సాధారణ సమస్యగా మారిపోయింది. కానీ ఈ సమస్య పెరిగితే మాత్రంమీ ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. తప్పుడు ఆహారపు అలవాట్లు, నిద్రలేమి, ఒత్తిడి, హార్మోన్ల మార్పులు, కాలుష్యం, వయస్సు పెరగడం వంటివి జుట్టు రాలడానికి కారణాలు. ఇలాంటి సమయంలో మీరు అమ్మమ్మల కాలం నాటి హోం రెమెడీస్ ప్రయత్నించవచ్చు.
బట్టతల ఉన్న వారికి తిరిగి జుట్టు పెరగడం కష్టమే అయినప్పటికీ మీరు ఈ హోం రెమెడీసం వాడటం వల్ల మాత్రం మంచి ఫలితం ఉంటుంది. ఇలా చేయడం వల్ల మీ జుట్టు బలంగా తయారవుతుంది. అంతే కాకుండా రాలకుండా కూడా ఉంటుంది. మరి ఎలాంటి హోం రెమెడీస్ జుట్టు పొడవుగా మారేలా చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
మెంతి గింజల వాడకం:
మెంతి గింజలలో ప్రోటీన్, ఐరన్ , కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టుకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. మెంతి గింజలు జుట్టుకు బలాన్ని పెంచడంలో సహాయపడతాయి. అంతే కాకుండా ఇవి బట్టతల నుండి బయటపడటానికి.. 3 చెంచాల మెంతులను రాత్రంతా నానబెట్టండి. తరువాత దానిని పేస్ట్ లా చేసి జుట్టు మూలాలపై అప్లై చేయండి. ఈ పేస్ట్‌ను దాదాపు 1 గంట పాటు అలాగే ఉంచి ఆ తర్వాత సాధారణ నీటితో తలస్నానం చేయండి.
ఉల్లిపాయ రసం:
జుట్టు పొడవును పెంచడానికి, అంతే కాకుండా వాటిని బలోపేతం చేయడానికి మీరు ఉల్లిపాయ రసాన్ని కూడా ఉపయోగించవచ్చు. జుట్టు రాలడానికి ఇది చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది. దీని కోసం.. మీరు ఒక పెద్ద ఉల్లిపాయను తురిమి దాని రసాన్ని తీయాలి. తర్వాత ఈ రసంలో కాస్త నిమ్మరసం కలిపి పేస్ట్ తయారు చేయండి. ఈ పేస్ట్‌ను జుట్టు కుదుళ్లకు అప్లై చేసి దాదాపు 1 గంట పాటు అలాగే ఉంచండి. తర్వాత షాంపూతో తలస్నానం చేయండి. ఇలా చేయడం ద్వారా జుట్టు రాలడం చాలా వరకు తగ్గుతుంది.
ఉసిరి హెయిర్ మాస్క్:
ఉసిరి శతాబ్దాలుగా జుట్టు పెరుగుదల కోసం ఉపయోగిస్తున్నారు. ఇది జుట్టుకు లోతుల నుండి పోషణను అందిస్తుంది. అంతే కాకుండా బలంగా తయారు చేస్తుంది. ఉసిరి హెయిర్ మాస్క్ తయారు చేయడానికి.. రెండు చెంచాల ఆమ్లా పౌడర్ , మూడు చెంచాల కొబ్బరి నూనె తీసుకోండి. దీన్ని ఒక పాన్ లో వేసి కాస్త వేడి చేసి.. జుట్టుకు సున్నితంగా చేతులతో అప్లై చేయండి. ఈ మాస్క్‌ను రాత్రంతా అలాగే ఉంచి తర్వాత తలస్నానం చేయండి.
కరివేపాకు:
కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు , అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇవి జుట్టును బలోపేతం చేయడానికి సహాయపడతాయి. అంతే కాకుండా తెల్ల జుట్టును నల్లగా మార్చడంలో కూడా కరివేపాకు బాగా ఉపయోగపడుతుంది. బట్టతల సమస్య నుండి బయటపడటానికి.. ఒక పాన్ లో 15-20 కరివేపాకు , అర కప్పు కొబ్బరి నూనె వేయండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మరిగించి, చల్లబడిన తర్వా, దానిని ఒక కంటైనర్‌లోకి తీసుకోండి. ఈ నూనెతో వారానికి ఒకటి లేదా రెండుసార్లు మసాజ్ చేయండి. జుట్టుపై ఈ నూనెను దాదాపు 30 నిమిషాల పాటు ఉంచి తర్వాత వాష్ చేయండి.
Also Read: ముఖం తెల్లగా మెరిసిపోవాలా ? అయితే ఇలా చేయండి !
గుడ్డు హెయిర్ మాస్క్:
మీ జుట్టు యొక్క మెరుపును పెంచడానికి , అంతే కాకుండా జుట్టు రాలడం వంటి సమస్యను తగించడానికి ఎగ్ హెయిర్ మాస్క్ ను ఉపయోగించవచ్చు. ఎగ్‌లో అధిక మొత్తంలో ప్రోటీన్ ఉంటుంది. ఇది జుట్టుకు బలాన్ని అందిస్తుంది. ఈ హెయిర్ మాస్క్ తయారు చేయడానికి.. ఒక ఎగ్‌ను కొట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దానికి ఒక నిమ్మకాయ యొక్క రసం వేసి కలపండి. దీన్ని బాగా కలిపి జుట్టుకు అప్లై చేయండి. తర్వాత దీనిని 1 గంట పాటు అలాగే ఉంచి తలస్నానం చేయండి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అంతే కాకుండా జుట్టు రాలకుండా ఉండటానికి ఈ హెయిర్ మాస్క్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది.