Meena Sagar: చాలామంది సీనియర్ హీరోయిన్లు ఈమధ్య కాలంలో రీఎంట్రీ ఇస్తూ సక్సెస్‌ఫుల్‌గా సెకండ్ ఇన్నింగ్స్‌లో దూసుకుపోతున్న వారిలో మీనా ఒకరు. ఒకప్పుడు హీరోయిన్‌గా దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించిన మీనా.. ఇప్పుడు తల్లి పాత్రలతో మెప్పిస్తోంది. తెలుగు మాత్రమే కాదు.. తమిళ, మలయాళంలో కూడా ఇప్పటికీ మీనా బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లతో బిజీ అయిపోయింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మీనా.. తన కెరీర్ మొదట్లో స్టార్ హీరోలతో కలిసి నటించిన రోజులను గుర్తుచేసుకుంది. ముఖ్యంగా బాలకృష్ణ, మోహన్ బాబుతో తన అనుబంధం ఎలా ఉండేదో బయటపెట్టింది. ముఖ్యంగా మోహన్ బాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
బాలయ్య మాట్లాడించేవారు
వెంకటేశ్‌తో నటించడం వల్లే తనకు తెలుగులో స్టార్‌డమ్ వచ్చిందని స్టేట్‌మెంట్ ఇచ్చింది మీనా. ‘‘వెంకటేశ్‌తో నాకు మంచి ర్యాపో ఉంది. నేను మొదట్లో చాలా సైలెంట్‌గా ఉండేదాన్ని. అప్పటికే వాళ్లంతా సూపర్ స్టార్స్. ఎవ్వరితో అయినా ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు. బాలయ్య కాస్త డిఫరెంట్. ఆయన ఎప్పుడూ మాట్లాడుతూనే ఉండేవారు. నేను మాట్లాడకపోయినా ఆయన మాట్లాడించేవారు. మిగతావారు నేను సైలెంట్‌గా ఉంటే వాళ్లు కూడా సైలెంట్‌గా ఉండేవాళ్లు. మెల్లగా వాళ్లతో, వారి ఫ్యామిలీస్‌తో కూడా ఫ్రెండ్ అయ్యాను. అందరికంటే మోహన్ బాబు చాలా డిఫరెంట్. ఆయన బెదిరించేవారు’’ అంటూ అందరు సీనియర్ హీరోలతో ఉన్న ర్యాపో గురించి మాట్లాడింది మీనా.
మోహన్ బాబు డిఫరెంట్
‘‘మోహన్ బాబుతో అల్లరి మొగుడు చేసేటప్పుడు నేను చాలా చిన్నదాన్ని. ఆయన ఊరికే నన్ను ఆటపట్టించేవారు. ఆయన నా మీద జోకులు వేస్తున్నారు అని తెలుసుకునేంత తెలివి కూడా అప్పుడు లేదు. అప్పుడే తెలుగు నేర్చుకుంటున్నాను. పూర్తిగా రాదు. కొన్ని నేను అర్థం చేసుకోలేకపోయేదాన్ని. నా గురించి మాట్లాడుతున్నారని కూడా నాకు తర్వాత తెలిసేది. మోహన్ బాబు సెట్‌లోకి చాలా హడావిడిగా వస్తారు. అందరిలో రారా, పోరా అని పిలుస్తారు. మిగతా హీరోలతో పోలిస్తే ఆయన చాలా డిఫరెంట్. అలా ఎవ్వరూ ఉండరు. మొదట్లో చాలా భయపడేదాన్ని. విష్ణు, లక్ష్మితో కూర్చొని ఆటలు ఆడుకునేదాన్ని. బయటికి ఎలా ఉన్నా మోహన్ బాబు చాలా మంచివారు’’ అని మోహన్ బాబుతో ఉన్న ఫ్రెండ్‌షిప్ గురించి చెప్పుకొచ్చింది మీనా.
Also Read: మద్యానికి బానిసైన స్టార్ హీరో.. షూటింగ్స్ కూడా క్యాన్సిల్ చేసుకొని..
చాలా చిన్నదాన్ని
‘‘నేను చాలా ప్రొఫెషనల్‌గా ఉంటాను. ఈ అమ్మాయి తప్పు అని ఎవరూ ఎక్కడా చెప్పలేదు. అందరితో సీరియస్‌గా ఉండే మోహన్ బాబు కూడా నాతో అలాగే ఉండేవారు. నా ప్రొఫెషనలిజం చూసి భయపడేవారు’’ అని బయటపెట్టింది మీనా. తనకు ఎక్కువగా అల్లరి పాత్రలో చేయడమే ఇష్టమని చెప్పుకొచ్చింది. ఇక ఇండస్ట్రీలో తనకు వచ్చిన ప్రపోజల్స్ గురించి మాట్లాడుతూ ‘‘నేను అప్పట్లో అందరికంటే వయసులో చాలా చిన్నదాన్ని. అప్పట్లో నాకు రొమాన్స్ అంటే ఏంటి, లవ్ అంటే ఏంటి అని కూడా తెలియదు’’ అని తెలిపింది మీనా (Meena). మొత్తానికి ఇప్పటికీ స్టార్ హీరోలతో నటిస్తూ బిజీ లైఫ్ గడిపేస్తోంది ఈ సీనియర్ నటి.