BigTV English

Horoscope  Today March 19th: ఆ రాశి ఉద్యోగులకు ప్రమోషన్లు – స్థిరాస్తిలో ఆర్థిక పురోగతి

Horoscope  Today March 19th: ఆ రాశి ఉద్యోగులకు ప్రమోషన్లు – స్థిరాస్తిలో ఆర్థిక పురోగతి

Horoscope Today : గ్రహాల సంచారం ప్రకారం రాశిఫలాలను అంచనా వేస్తారు. మార్చి 19న ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.


మేషం: ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగస్తులు ట్రాన్స్‌ ఫర్‌ అయ్యే  సూచనలున్నవి. ఆప్తులతో మాట పట్టింపులుంటాయి. నూతన రుణ ప్రయత్నాలు ఫలించవు. వ్యాపారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు.

వృషభం: స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆర్థిక పురోగతి కలుగుతుంది. పాత రుణాలు తీర్చగలుగుతారు. అప్రయత్నంగా కొన్ని పనులు పూర్తవుతాయి. ఉద్యోగస్తులు అధికారుల అనుగ్రహంతో ఉన్నత పదవులు పొందుతారు. కీలక వ్యవహారాలలో స్వంత ఆలోచనలు కలసివస్తాయి.


మిధునం: ఉద్యోగమున పని ఒత్తిడి ఉన్నప్పటికీ పనులు పూర్తి చేసి అధికారుల ప్రశంసలు అందుకుంటారు. వృత్తి, వ్యాపారములలో నూతన ప్రణాళికలతో ముందుకు సాగుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధు మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.

కర్కాటకం: ఇంట్లో సంతాన శుభాకార్య విషయమై ప్రస్తావన వస్తుంది. విలువైన వస్తు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆదాయం ఆశించిన విధంగా ఉంటుంది. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగంలో సహోద్యోగులతో సహాయ సహకారాలు అందుతాయి.

సింహం: దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన పనులలో అధిక కష్టంతో అల్ప ఫలితం పొందుతారు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు వలన మానసిక ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులుంటాయి. వ్యాపారాలలో ఊహించని సమస్యలు కలుగుతాయి.

కన్య: నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వ్యాపారాల ప్రారంభానికి శ్రీకారం చుడతారు. సన్నిహితుల సహాయంతో కొన్ని పనులు పూర్తి అవుతాయి. ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి.

తుల: చేపట్టిన పనులలో ఆటంకాలు తొలగుతాయి. వృత్తి, వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతగా ఉంటుంది. సన్నిహితులతో  ఇంట్లో ఆనందంగా గడుపుతారు. ఆదాయం పెరుగుతుంది. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

వృశ్చికం: అధికారులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగంలో దైవ సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు మందగిస్తాయి వృధా ఖర్చులు పెరుగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలలో అకారణ వివాదాలు కలుగుతాయి.

ధనస్సు: ఆకస్మిక ప్రయాణాల వలన శారీరక శ్రమ పెరుగుతుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. సన్నిహితుల ప్రవర్తన కొంత ఆశ్చర్య పరుస్తుంది. మాతృ వర్గ బంధువుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. జీవిత భాగస్వామితో పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

మకరం: వృత్తి ఉద్యోగమున అధికారులు గుర్తింపు పెరుగుతుంది. చిన్ననాటి మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. వ్యాపార విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. ఇంట్లో  శుభకార్యములు నిర్వహిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో స్వంత నిర్ణయాలు కలసివస్తాయి.

కుంభం: బంధు మిత్రులతో మాటపట్టింపులు పెరుగుతాయి. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. చేపట్టిన పనులలో స్వల్ప అవాంతరాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. రుణదాతల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి.

మీనం: నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. సన్నిహితుల నుంచి కొన్ని ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. వృత్తి వ్యాపారాలలో నూతన ఆలోచనలు అమలు చేస్తారు. ఆర్థిక పురోగతి కలుగుతుంది. పాత మిత్రులతో విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి.

 

ALSO READ: Donga Mallanna Temple: దేవుడినే దొంగను చేసిన భక్తులు –  ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?

 

Related News

Today Movies in TV : సోమవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. వీటిని మిస్ చెయ్యొద్దు…

Sravanthi Chokkarapu: తెల్లారితే పెళ్లి.. రాత్రికి రాత్రే ఆపని చేసిన  స్రవంతి..బయటపడ్డ నిజాలు!

Intinti Ramayanam Today Episode: భరత్, ప్రణతిలను విడగొట్టిన పల్లవి.. పోలీస్ స్టేషన్ పార్వతి.. నిజం బయటపడిందా?

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు గుడ్ న్యూస్.. బాలును ఇరికించేసిన కల్పన..

Illu Illalu Pillalu Today Episode: భర్తను కాపాడిన భాగ్యం.. నర్మదకు మొదలైన అనుమానం.. శ్రీవల్లి సేఫ్..

Today Movies in TV : ఆదివారం టీవీలల్లోకి రాబోతున్న సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Big Stories

×