E-Paper
Advertisement

ఫైబర్ పుష్కలంగా ఉండే స్పెషల్ ఉప్మా.. చలికాలంలో సూపర్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌

ఫైబర్ పుష్కలంగా ఉండే స్పెషల్ ఉప్మా.. చలికాలంలో సూపర్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌
Advertisement

Pearl Millet Upma| ప్రతిరోజూ ఉదయం పోహా, ఇడ్లీ, రవ్వ ఉప్మా తింటూ బోర్ కొడుతోందా? అయితే ఈసారి మీ బ్రేక్‌ఫాస్ట్‌లో చిన్న మార్పు చేయండి. సాధారణ రవ్వతో కాకుండా పోషకాలు పుష్కలంగా ఉండే సజ్జలతో రుచికరమైన ఉప్మా తయారుచేసుకోండి. ముఖ్యంగా చలికాలంలో ఉదయాన్నే వేడివేడి సజ్జల ఉప్మా తింటే కడుపు నిండటంతో పాటు మంచి రుచిని ఆస్వాదించవచ్చు. ఇందులో మీకు నచ్చిన కూరగాయలు కూడా వేసుకోవచ్చు. మరి ఈ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌ ఇంట్లోనే ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం.

సజ్జల ఉప్మా తయారీకి కావాల్సిన పదార్థాలు

ఈ ఉప్మా తయారుచేయడానికి కింద పేర్కొన్న పదార్థాలు సిద్ధం చేసుకోవాలి.
ఒక కప్పు సజ్జల రవ్వ లేదా దంచిన సజ్జలు
ఒక ఉల్లిపాయ (సన్నగా తరగాలి)
ఒక టమాటా (ముక్కలుగా కోయాలి)
ఒక చిన్న క్యారెట్
అర కప్పు పచ్చి బఠానీలు
ఒక పచ్చిమిర్చి
అర టీస్పూన్ ఆవాలు
అర టీస్పూన్ జీలకర్ర
6 నుంచి 7 కరివేపాకులు
చిటికెడు ఇంగువ
అర టీస్పూన్ పసుపు
తగినంత ఉప్పు
1 నుంచి 2 టేబుల్ స్పూన్ల నూనె లేదా నెయ్యి
3 కప్పుల నీళ్లు
కొద్దిగా కొత్తిమీర

సజ్జలతో రుచికరమైన ఉప్మా ఇలా తయారుచేయండి

ముందుగా సజ్జలను సిద్ధం చేసుకోవాలి

Advertisement

ముందుగా సజ్జలను శుభ్రం చేసి బాగా కడగాలి. ఒకవేళ పొట్టు తీసిన సజ్జలను ఉపయోగిస్తే కొన్ని గంటలు నానబెట్టుకోవాలి. తర్వాత నీటిని వంపేసి సజ్జలను కొద్దిగా దంచుకోవాలి. లేదంటే మార్కెట్లో దొరికే సజ్జల రవ్వ ఉపయోగించవచ్చు.

పోపు సిద్ధం చేసుకోవాలి

స్టవ్‌పై కడాయి పెట్టి నూనె లేదా నెయ్యి వేయాలి. అది వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అవి చిటపటలాడిన తర్వాత ఇంగువ, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేయించాలి.

ఇప్పుడు కూరగాయలు వేయించాలి

Advertisement

తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. తర్వాత క్యారెట్, బఠానీలు, టమాటా ముక్కలు వేయాలి. వీటిలో పసుపు, ఉప్పు వేసి కాసేపు ఉడికించాలి.

Also Read: చాణక్య నీతి.. నిజమైన స్నేహితులు ఎవరో, నటించే వారు ఎవరో ఇలా తెలుసుకోండి

సజ్జలు వేసి బాగా ఉడికించాలి

ఇప్పుడు సజ్జల రవ్వ కడాయిలో వేసి రెండు లేదా మూడు నిమిషాలు వేయించాలి. తర్వాత మూడు కప్పుల నీళ్లు పోసి బాగా కలపాలి. మూతపెట్టి తక్కువ మంటపై ఉడికించాలి. మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి. సజ్జలు మెత్తగా ఉడికి నీరు ఇంకిపోయే వరకు ఉంచాలి.

Also Read:  చలికాలంలో ఏదో పోగొట్టుకున్నట్లు, డిప్రెషన్ లక్షణాలు కనిపిస్తున్నాయా? మళ్లీ యాక్టివ్‌గా ఉండేందుకు టిప్స్

చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేయండి

సజ్జలు పూర్తిగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. కొద్దిగా కొత్తిమీర వేసి కలపాలి. అంతే.. వేడివేడి సజ్జల ఉప్మా సిద్ధమైపోతుంది.

సజ్జల ఉప్మాను ఇలా సర్వ్ చేస్తే రుచి అదిరిపోతుంది

తయారుచేసిన ఉప్మా వేడివేడిగా ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా లేదా సాయంత్రం అల్పాహారం తీసుకోవచ్చు. దీనికి కొబ్బరి చట్నీ, పచ్చి చట్నీ లేదా పెరుగు మంచి కాంబినేషన్‌. కొద్దిగా పుల్లటి రుచి కావాలనుకుంటే పైన నిమ్మరసం కూడా పిండుకోండి. చలికాలంలో కుటుంబ సభ్యులందరికీ ఈ రుచికరమైన బ్రేక్‌ఫాస్ట్‌ తయారుచేసి పెట్టండి.

Related News

భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చినప్పుడు ఈ పని చేస్తే సరి.. బంధం మరింత బలపడుతుంది

పాకెట్ మనీ అస్సలు ఖర్చు పెట్టరు.. ఈ తేదీల్లో జన్మించిన పిల్లలు పుట్టకతోనే ‘ఫైనాన్షియల్ జీనియస్’sr

మీ కళ్లు చిన్నవిగా కనిపిస్తున్నాయా? పెద్దవిగా కనిపించేందుకు 3 ఫర్ఫెక్ట్ ఐలైనర్ ట్రిక్స్

చలికాలంలో జీర్ణ సమస్యలు వేధిస్తున్నాయా? ఉదయాన్నే టీ తాగే ముందు ఈ స్పైసీ డ్రింక్ తాగండి చాలు

భార్యాభర్తల మధ్య చిచ్చుపెట్టిన ఏఐ.. విడాకుల వరకు వెళ్లిన గొడవ

నెయ్యి లేకుండా మైసూర్ పాక్! ఇంట్లోనే స్వీట్ షాప్ టేస్ట్‌

లెమన్ ఫిష్ రెసిపీ..తక్కువ మసాలాలతో అద్భుతమైన రుచి!

Big Stories

Advertisement
×