Instant Facial: ప్రతి అమ్మాయి కూడా ముఖం కాంతివంతంగా, ఆరోగ్యంగా మెరిసే చర్మంతో ఉండాలని ఆశిస్తూ ఉంటారు. కానీ ప్రస్తుత రోజుల్లో చాలా మంది అనేక చర్మ సమస్యలతో బాధపడతున్నారు. దీనికి ప్రధాన కారణం జీవనశైలి, పొల్యూషన్, స్ట్రెస్, తగిన ఆహారం లేకపోవడం వంటివి చర్మంపై ప్రభావం చూపుతూ ఉంటాయి. తద్వారా ముఖంపై మొటిమలు, మచ్చలు రావడం, ఫేస్‌లో డల్ నెస్ వంటి సమస్యలను కలిగిస్తుంటాయి. ఈ సమస్యలు కాన్ఫిడెన్స్‌ను తగ్గించడమే కాకుండా, అందాన్ని తగ్గించేస్తాయి. ఇందుకోసం చాలా మంది బ్యూటీ పార్లర్ చుట్టూ తిరిగి.. వేలకు వేలు ఖర్చు చేసి రకరకాల ఫేసియల్స్ చేపిస్తుంటారు.
వాటివల్ల ఫలితం ఉంటుందో లేదో పక్కన పెడితే.. చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. చర్మ సంరక్షణ కోసం ఖరీదైన క్రీములు కాకుండా, ఇంటిలో ఉన్న సహజ పదార్థాలతోనే ట్రై చేయండి. క్రమం తప్పకుండా ఉపయోగిస్తే మొటిమలు, మచ్చలు తగ్గి.. ముఖం ప్రకాశవంతంగా తయారవుతుంది. మరి ఆలస్యం చెయ్యకుండా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
స్టెప్-1
ముందుగా కీరదోస ముక్కలను మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి.. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి.. అరగంట తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా రెగ్యులర్‌గా చేయడం ద్వారా చర్మానికి చల్లదనాన్ని ఇచ్చి.. తాజాగా మెరిసేలా చేయడంలో సహాయపడుతుంది.
స్టెప్-2
బాగా పండిన అరటిపండు గుజ్జు, ఓట్స్ కలిపి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పెట్టుకుని.. 10-15 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా చేయడం ద్వారా ముఖంపై జిడ్డు తొలగిపోయి కాంతివంతంగా మెరిసేలా చేయడంలో సహాయపడుతుంది.
స్టెప్-3
మందుగా చిన్న గిన్నె తీసుకుని.. అందులో రెండు టేబుల్ స్పూన్ బొప్పాయి గుజ్జు, తేనె కలిపి ముఖానికి పెట్టుకుని.. అరగంట తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా చేయడం ద్వారా ముఖం కాంతివంతంగా, తాజాగా మెరుస్తుంది.
స్టెప్-4
కీరదోస జ్యూస్, రైస్ వాటర్ కలిపి ముఖానికి పెట్టుకోండి. అరగంట తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ముఖం మెరిసేలా చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది.
Also Read: అందం కోసం ఇంజెక్షన్లు.. సెలెబ్రిటీల బ్యూటీ ట్రీట్‌మెంట్ ప్రమాదకరమా?
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.