BigTV English

Shami – Hasin Jahan : రూ.4 లక్షల భరణం సరిపోదు… ఆస్తులు మొత్తం ఇవ్వాల్సిందే…షమీ భార్య సంచలనం!

Shami – Hasin Jahan : రూ.4 లక్షల భరణం సరిపోదు… ఆస్తులు మొత్తం ఇవ్వాల్సిందే…షమీ భార్య సంచలనం!

 Shami – Hasin Jahan :  టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీ విడాకుల కేసులో కోల్ కతా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే భరణం కింద నెలకు రూ.4లక్షలు చెల్లించాలని ఆదేశించింది. షమీ నుంచి విడిగా ఉంటున్న భార్య హాసిన్ జహాన్ కి భరణం కింద నెలకు రూ.1.5 లక్షలు.. అలాగే వీరి కుమార్తె ఐరా నిర్వహణ ఖర్చు నిమిత్తం నెలకు రూ.2.5లక్షల చొప్పున చెల్లించాలని పేర్కొంది. 2018 నుంచి ఇద్దరికీ నెలకు నాలుగు లక్షల చొప్పున చెల్లించాలని షమీని కోల్ కతా హైకోర్టు ఆదేశించింది. తాజాగా కోల్ కతా హైకోర్టు తీర్పు పై షమీ భార్య హసీన్ జహాన్ స్పందించారు. కోల్ కతా హైకోర్టు తీర్పు ప్రకారం.. తమకు రూ.4లక్షల భరణం సరిపోదని ఆమె పేర్కొంది. భర్త ఆదాయాన్ని భట్టే భరణం ఉంటుందని.. దీని ప్రకారమే తాను రూ.10 లక్షలు డిమాండ్ చేశాను. అది కూడా దాదాపు ఎనిమిదేళ్ల కిందట అని చెప్పుకొచ్చింది.


Also Read :  Watch Video : హీరో రామ్ చరణ్ ను నమ్ముకొని క్లీన్ బౌల్డ్ అయిన క్రికెటర్.. వీడియో చూస్తే నవ్వుకోవాల్సిందే

రూ.4లక్షల భరణం సరిపోదు: షమీ భార్య 


అయితే ఇప్పుడు ద్రవ్యోల్భణం కూడా పెరిగింది. అందుకే కోర్టు తీర్పునిచ్చినా రూ.4లక్షల భరణం చాలా చిన్న మొత్తం అని.. దీనిపై మరోసారి కోర్టును ఆశ్రయిస్తానని వెల్లడించారు హసీన్ జహాన్. షమీ పై అతని భార్య హసీన్ జహాన్ గతంలో సంచలన ఆరోపణలు చేసింది. అతడు స్త్రీలోలుడని, ఫిక్సింగ్ కి కూడా పాల్పడ్డాడంటూ ఆరోపించిన హసీన్. తనపై గృహహింసకు కూడా పాల్పడ్డాడంటూ గతంలో ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ తరుణంలోనే వీరు దాదాపు ఎనిమిది సంవత్సరాల నుంచి విడిగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో కుమార్తెను తన వద్దనే ఉంచుకున్న హసీన్.. భరణం కింద తనకు రూ.10లక్సలు చెల్లించేలా షమీని ఆదేశించాలంటూ కోర్టుకు వెళ్లింది. ఆమెకు రూ.1.3 లక్షలు మాత్రమే చెల్లించేలా దిగవ కోర్టు తీర్పునిచ్చింది. దీంతో హసీన్ జహాన్ హైకోర్టును ఆశ్రయించగా.. తాజాగా రూ.4లక్షలు చెల్లించేలా తీర్పును వెల్లడించింది. 

అప్పటి నుంచే వీరికి విభేదాలు.. 

వాస్తవానికి ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్ కతా నైట్ రైడర్స్ చీర్ లీడర్ గా ఉన్న సమయంలో హసీన్ జహాన్ కి షమీతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం పెళ్లి వరకు దారి తీసింది. వీరిద్దరూ 2014లో పెళ్లి చేసుకోగా.. మరుసటి ఏడాదే కుమార్తె జన్మించింది. ఇక 2018 నుంచి విభేదాలు తలెత్తాయి. వీరి మధ్య తలెత్తిన విభేదాలు తారాస్థాయి కి చేరడంతో షమీ-హసీన్ జహాన్ విడిగా ఉంటున్నారు. ప్రస్తుతం షమీ సన్ రైజర్స్ హైదరాబాద్  తరపున ఆడుతున్నాడు. 34 ఏళ్ల ఈ రైటార్మ్ పేసర్ ఫిట్ నెస్ లేమి కారణంగా ఇంగ్లాండ్ టెస్ట్ కి దూరంగా ఉన్నాడు. ఇటీవలజరిగిన ఇంగ్లాండ్ తో వన్డేల్లో తిరిగి మైదానంలోకి అడుగుపెట్టాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఆడాడు. ఏడు మ్యాచ్ ల్లో కలిపి 11 వికెట్లు తీశాడు.

Related News

Fakhar Zaman catch : టీమిండియా తొండాట‌…ఐసీసీకి పాకిస్థాన్ ఫిర్యాదు

Abhishek Sharma: అభిషేక్ శ‌ర్మకు గ్రౌండ్ లోనే ప్ర‌పోజ్‌..ఫ్లయింగ్ కిస్సులు ఇచ్చి మ‌రీ !

IND VS PAK: మ‌రోసారి టీమిండియా వ‌ర్సెస్ పాక్ మ్యాచ్‌..చ‌చ్చిన పామును మ‌ళ్లీ చంప‌డ‌మే

AK-47 Celebration: ధోని చేస్తే క‌రెక్ట్‌.. మేం చేస్తే త‌ప్పా…!

Haris Rauf: రఫేల్ కూల్చేశామంటూ హ‌రీస్ ర‌ఫ్ సెలబ్రేషన్..ఆడుకున్న ఫ్యాన్స్‌

Ind Vs Pak: చ‌ల్ పోరా పో….షాహిన్ అఫ్రీదిని బండ బూతులు తిట్టిన అభిషేక్‌…సిక్స్ కొట్టి మ‌రీ

IND VS PAK: అభిషేక్‌ దుమ్ములేపాడు… సూప‌ర్ 4 లోనూ టీమిండియా విజ‌యం.. షేక్ హ్యాండ్ మళ్ళీ లేదు

IND Vs PAK : Ak 47 గ‌న్స్ పేల్చుతూ పాకిస్థాన్ సెల‌బ్రేష‌న్స్‌.. టీమిండియా టార్గెట్ ఎంతంటే

Big Stories

×