BigTV English

Balakrishna: బజరంగీ భాయిజాన్ లో సల్మాన్ తో ఉండే చిన్న పాప గుర్తుందా? ఇప్పుడు బాలయ్య సినిమాలో ఛాన్స్

Balakrishna: బజరంగీ భాయిజాన్ లో సల్మాన్ తో ఉండే చిన్న పాప గుర్తుందా? ఇప్పుడు బాలయ్య సినిమాలో ఛాన్స్

Balakrishna: నందమూరి బాలకృష్ణ (Balakrishna) ప్రస్తుతం బోయపాటి శ్రీను (Boyapati Sreenu)దర్శకత్వంలో అఖండ 2 (Akhanda 2)సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్ వచ్చిన అఖండ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడంతో ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ చిత్రంగా అఖండ2 సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమా దసరా పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది. ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న నేపథ్యంలో బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా భాగమవుతున్నారు. ఈ సినిమా నుంచి ఇటీవల విడుదల చేసిన టీజర్ సినిమాపై మంచి అంచనాలను పెంచేస్తుంది.


బాలయ్య సినిమాలో బజరంగీ భాయిజాన్ చిన్నారి..

ఇకపోతే తాజాగా ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ (Salman Khan)హీరోగా నటించిన బజరంగీ భాయిజాన్(Bajrangi Bhaijaan) చైల్డ్ ఆర్టిస్ట్ కూడా భాగం కాబోతున్నారని తెలుస్తోంది. తాజాగా ఈమెకు వెల్కమ్ చెబుతూ చిత్ర బృందం అధికారిక పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్ చూసిన వారందరూ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. సల్మాన్ ఖాన్ నటించిన ఈ సినిమాలో హర్షాలీ మల్హోత్రా (Harshaali Malhotra ) మున్ని అనే పాత్రలో నటించారు. ఇలా ఈ పాత్ర ద్వారా అప్పట్లో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్న హర్షాలీ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే బాలయ్య అఖండ 2 లో ఛాన్స్ దక్కించుకున్నారు. అఖండ 2 లో ఈమె జనని (Janani)పాత్రలో కనిపించబోతున్నట్లు టీం వెల్లడించారు.


బాలనటిగా హర్షాలీ మల్హోత్ర..

ఇక హర్షాలీ విషయానికి వస్తే.. ముంబైకి చెందిన ఈమె బాల నటిగానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి తన నటనతో మెప్పించారు. 2015 వ సంవత్సరంలో విడుదలైన బజరంగీ భాయిజాన్ సినిమా ద్వారా హర్షాలీ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు . ఈ సినిమాలో తన నటన ద్వారా ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసిన హర్షాలీ ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు. ఇలా చైల్డ్ ఆర్టిస్ట్ గా సక్సెస్ అందుకున్న ఈమె ఇప్పుడు కూడా సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారని స్పష్టమవుతుంది త్వరలోనే తెలుగు ప్రేక్షకుల ముందుకు అఖండ 2సినిమా ద్వారా రాబోతున్నారు.

ఇక అఖండ సినిమా విషయానికి వస్తే బోయపాటి శ్రీను బాలకృష్ణ కాంబోలో 2001వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాకు కొనసాగింపుగా ఆఖండ 2 ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమా సెప్టెంబర్ 25వ తేదీ విడుదల కాబోతోంది. ఇక ఈ సినిమాలో ఆది పినిశెట్టి విలన్ పాత్రలో నటించగా బాలయ్యకు జోడిగా నటి సంయుక్త మీనన్ సందడి చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఇక ఇటీవల కాలంలో బాలయ్య ఎంతో వైవిధ్యమైన కథలను ఎంపిక చేసుకుంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఇక చివరిగా డాకు మహారాజ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టారు.

Also Read: Shirish Reddy: దయచేసి నన్ను క్షమించండి.. మరో వీడియో వదిలిన శిరీష్ రెడ్డి! 

Related News

Nandamuri Padmaja : ముగిసిన పద్మజా అంత్యక్రియలు.. వదినకు కొడుకులా మారిన బాలయ్య!

Nara Rohith: నేను ‘వార్‌ 2’ సినిమా చూడలేదు.. నారా రోహిత్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Mahesh Babu: ఛారిటీ కోసం ప్రతి ఏడాది మహేష్ ఎన్ని కోట్లు డొనేట్ చేస్తారో తెలుసా?

Nara Rohith: నా ఇంటి పేరే నాకు సమస్య… నారా రోహిత్ సంచలన వ్యాఖ్యలు!

Naga Chaitanya: దేవర డైరెక్టర్‌తో కాదు కానీ.. దేవర నిర్మాతలతో నాగచైతన్య మూవీ ?

HHVM Losses: వీరమల్లు నష్టాలు… బయ్యర్లపై పడిన భారమెంతంటే!

Big Stories

×