E-Paper
Advertisement

అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్‌ వల్ల పేగు క్యాన్సర్ రిస్క్ తీవ్రం.. డాక్టర్ ఏం చెప్పారంటే

అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్‌ వల్ల పేగు క్యాన్సర్ రిస్క్ తీవ్రం.. డాక్టర్ ఏం చెప్పారంటే
Advertisement

Ultra Processed Food Cancer Risk| ఈ రోజుల్లో సమయం తక్కువగా ఉండటంతో చాలామంది ప్యాకేజ్డ్, రెడీ టు ఈట్ ఫుడ్స్‌పై ఆధారపడుతున్నారు. రుచికరంగా ఉండడం కారణంగా ఇవి రోజువారీ ఆహారంలో భాగమవుతున్నాయి. అయితే, ఇలాంటి అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్‌ తరచుగా తినడం ఆరోగ్యంపై ప్రభావం చూపించవచ్చు. కొన్ని పరిశోధనలు వీటి అధిక వినియోగాన్ని కొలొరెక్టల్ క్యాన్సర్ (ప్రేగు క్యాన్సర్) రిస్క్‌తో సంబంధం ఉన్నట్లు సూచిస్తున్నాయి.

అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే ఏంటి?

అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్‌లో అదనపు చక్కెర, ఉప్పు, ప్రిజర్వేటివ్స్, రిఫైన్డ్ పదార్థాలు, కొవ్వులు వంటి వాటిని ఎక్కువగా ఉపయోగిస్తారు. రుచి, రంగు, టెక్స్చర్, నిల్వ కాలాన్ని పెంచేందుకు వీటిని ఎక్కువగా ప్రాసెస్ చేస్తారు. వీటిలో సహజ ఆహారాలతో పోలిస్తే ఫైబర్ తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆంకాలజిస్ట్ డాక్టర్ వర్తికా విశ్వాని కొన్ని ప్రాసెస్డ్ ఫుడ్స్ తినడం తగ్గించాలని చేయాలని సూచించారు. అయితే, ప్రతి ప్యాకేజ్డ్ ఫుడ్‌ పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదని కూడా ఆమె పేర్కొన్నారు.

ప్రాసెస్డ్ చీజ్ స్లైసులు, చీజ్ స్ప్రెడ్స్‌ తగ్గించండి

Advertisement

ప్రాసెస్డ్ చీజ్ స్లైసులు, స్ప్రెడ్స్‌లో ఉప్పు, కొవ్వులు, వివిధ యాడిటివ్స్ ఎక్కువగా ఉండవచ్చు. వీటికి బదులుగా సాధారణ పనీర్‌ ఎంచుకోండి.

ఫ్లేవర్డ్ ఇన్‌స్టంట్ ఓట్స్‌కు బదులుగా సాధారణ ఓట్స్

ఫ్లేవర్డ్ ఇన్‌స్టంట్ ఓట్స్‌లో అదనపు చక్కెర, ప్రిజర్వేటివ్స్ ఉండవచ్చు. సాధారణ రోల్డ్ ఓట్స్ లేదా స్టీల్ కట్ ఓట్స్ తక్కువగా ప్రాసెస్ చేసిన ఎంపికలు. వీటికి పండ్లు, నట్స్ లేదా సీడ్స్ కలిపితే రుచి పెరుగుతుంది.

ఫ్లేవర్డ్ పీనట్ బటర్‌లో అదనపు పదార్థాలను గమనించాలి

Advertisement

కొన్ని ఫ్లేవర్డ్ పీనట్ బటర్ ఉత్పత్తుల్లో చక్కెర, అదనపు నూనెలు ఉంటాయి. వీటికి బదులుగా కేవలం పీనట్స్‌తో తయారైన పీనట్ బటర్‌ను ఎంచుకోవడం మంచిది.

ఫ్లేవర్డ్ పెరుగులో చక్కెర ఎక్కువ

ఫ్లేవర్డ్ యోగర్ట్‌లో అదనపు చక్కెర, కృత్రిమ ఫ్లేవర్స్ ఉండవచ్చు. సాధారణ పెరుగు లేదా దహీని పండ్లతో కలిపి తీసుకోవచ్చు.

త్రీ ఇన్ వన్ కాఫీ మిక్స్‌ 

త్రీ ఇన్ వన్ కాఫీ మిక్స్‌లలో చక్కెర, నాన్ డెయిరీ క్రీమర్ ఎక్కువగా ఉండవచ్చు. సాధారణ కాఫీ తీసుకుంటే చక్కెర, క్రీమర్ పరిమాణాన్ని మనమే కంట్రోల్ చేయవచ్చు.

ఫ్లేవర్డ్ మిల్క్‌కు బదులుగా సాధారణ పాలు

ఫ్లేవర్డ్ మిల్క్‌లో అదనపు చక్కెర, స్టెబిలైజింగ్ పదార్థాలు ఉంటాయి. అందుకే వాటికి బదులు సాధారణ పాలు మంచి ఎంపిక.

Also Read: నవరాత్రుల్లో ఇక బ్రేక్‌ఫాస్ట్ టెన్షన్‌కు చెక్ .. ఉపవాసం చేసేవారికి 7 ఈజీ రెసిపీలు

రెడీ టు ఈట్ పరాఠాలు, ప్రాసెస్డ్ వెజ్జీస్

ప్యాకేజ్డ్ పరాఠాల్లో ప్రిజర్వేటివ్స్, ఇండస్ట్రియల్ ఆయిల్స్, టెక్స్చర్ పెంచే పదార్థాలు ఉండవచ్చు. తాజా కూరగాయలను ఎంచుకోవడం మంచిది. సింపుల్ ఫ్రోజెన్ వెజిటబుల్స్ కూడా సౌకర్యవంతమైన ఎంపిక కావచ్చు.

Also Read: చాణక్య నీతి.. మీ జీవితం ఇతరుల చేతిలో కీలుబొమ్మగా మారిందా? ఈ తప్పుడు అలవాట్లే కారణం

పోషకాహార ఫుల్ డైట్‌ తీసుకోవాలి

కూరగాయలు, పండ్లు, సంపూర్ణ ధాన్యాలు, పప్పులు, నట్స్, సీడ్స్‌ను ఆహారంలో చేర్చుకోవడం మంచిది. ప్రతి ప్యాకేజ్డ్ ఫుడ్‌ను భయపడాల్సిన అవసరం లేదు. అయితే, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్‌ను ఎంత తరచుగా తింటున్నామో గమనించాలి.

పేగు క్యాన్సర్ ఏ ఆహారాలు తినడం వల్ల కలుగుతుందో అనే అంశంపై ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నాయి. వ్యక్తిగత ఆరోగ్య అవసరాల కోసం వైద్య నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Related News

టీనేజ్ పిల్లలకు తల్లిదండ్రులు చెప్పే మంచి మాటలు ఎందుకు నచ్చవు? అసలు కారణం ఇదే

వెజిటేరియన్ కబాబ్స్.. పండుగవేళ శాఖాహారులకు టేస్టీ రెసిపీ.. ఇంట్లోనే ఇలా చేయండి

నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోయేలా చికెన్ మలయ్ కబాబ్ రెసిపీ.. పెనంపైనే సింపుల్‌గా!

ఈ ఒక్క కర్రీ ఉంటే చాలు.. ఎన్ని రోటీలైనా క్షణాల్లో ఖాళీ అయిపోవాల్సిందే!

నోరూరించే పంజాబీ భేండీ మసాలా..రోటీ,చపాతీకి ఫర్పెక్ట్ కాంబినేషన్

చేపలు లేవు.. అయినా ఈ రెసిపీ పేరు బొమ్మిడాల చారు.. రాయలసీమ సీక్రెట్ రెసిపీ ఇదే!

పక్కా తెలంగాణ స్టైల్ బగారా రైస్..ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే అద్భుతమైన రుచి

Big Stories

Advertisement
×