BigTV English
Advertisement

Coffee powder: అరస్పూన్ కాఫీ పొడి ఉంటే చాలు.. ముఖంపై బ్లాక్ హెడ్స్ ను తొలగించుకోవచ్చు

Coffee powder: అరస్పూన్ కాఫీ పొడి ఉంటే చాలు.. ముఖంపై బ్లాక్ హెడ్స్ ను తొలగించుకోవచ్చు

కాలుష్యం వల్ల ఎక్కువగా బ్లాక్ హెడ్స్ ముఖంపై ఏర్పడతాయి. ముక్కు, గడ్డం, నుదుటిపైనే ఎక్కువగా ఇవి కనిపిస్తాయి. ఎన్నిసార్లు ఫేస్ వాష్‌లు చేసినా, స్క్రబ్ లతో రుద్దినా కూడా ఆ బ్లాక్ హెడ్స్ పోవు. వాటిని పోగొట్టాలంటే ప్రతి ఒక్కరు బ్యూటీ పార్లర్ కు వెళ్లి తొలగించుకుంటారు. దానికోసం డబ్బులు చెల్లించాలి. అలా డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే కాఫీ పొడితో బ్లాక్ హెడ్స్‌ను తగ్గించుకోవచ్చు.


ప్రతి ఇంట్లోనూ కాఫీ పొడి కచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మన దేశంలో టీకి, కాఫీకి అభిమానులు ఎక్కువ. టీ తాగే వారు కాఫీని కూడా ఇష్టపడతారు. కాబట్టి మీ ఇంట్లో ఉన్న కాఫీ పొడితోనే బ్లాక్ హెడ్స్‌ను తొలగించుకునే ప్రయత్నం చేయండి. కాఫీ పొడి ఎక్స్ ఫోలియేటింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది. మొండి బ్లాక్ హెడ్స్ ను వదిలించడానికి సహాయపడుతుంది. ఖరీదైన ఉత్పత్తుల కొనాల్సిన అవసరం లేకుండా కాఫీ పొడి తోనే మీరు మీ ముఖాన్ని శుభ్రపరచుకోవచ్చు.

కాఫీ పొడితో లాభాలు
కాఫీ పొడి చర్మానికి ఎన్ని రకాలుగా మేలు చేస్తుందో తెలుసా? దీనిలో ఎక్స్పోలియేటింగ్ పవర్ చాలా ఎక్కువ. ఈ కాఫీ పొడి ముతకగా ఉంటుంది. ముఖంపై రాసినప్పుడు మృత చర్మ కణాలను తొలగిస్తుంది. దీనివల్ల మూసుకుపోయిన రంధ్రాలు తెరుచుకుంటాయి. అలాగే కాఫీ పొడిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మంపై ఉన్న ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి సహాయపడతాయి. రక్తప్రసరణ కూడా మెరుగుపరుస్తాయి. కాఫీ పొడితో మసాజ్ చేయడం వల్ల చర్మం తిరిగి ప్రకాశవంతం అవుతుంది. బ్లాక్ హెడ్స్ ముఖంపై ఏర్పడడానికి ప్రధాన కారణాలలో ఒకటి. అదనంగా ఉత్పత్తి అవుతున్న నూనె దానిని తగ్గించేందుకు కూడా కాఫీ సహాయపడుతుంది.


కాఫీ స్క్రబ్ తయారీ
ముఖంపై ఉన్న బ్లాక్ హెడ్స్ తొలగించుకోవడానికి కాఫీతో ఇలా స్క్రబ్ తయారు చేయండి. ఇందుకోసం మీరు ఒక టేబుల్ స్పూన్ కాఫీ పొడిని తీసుకోండి. అందులో ఒక స్పూన్ తేనె వేయండి. రెండిటినీ కలిపి మందపాటి పేస్టులా చేయండి. దీన్ని ముఖానికి రాయండి. ముఖ్యంగా ముక్కు, గడ్డం వంటి ప్రాంతాల్లో రాయాలి. అక్కడే బ్లాక్ హెడ్స్ అధికంగా ఉంటాయి. ఆ తర్వాత వేళ్ళతోనే సున్నితంగా మర్దనా చేయండి. 10 నిమిషాల పాటు అలా మర్దనా చేసిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోండి. యాంటీ బ్యాక్టీరియా లక్షణాలను కలిగి ఉంటుంది. కాఫీతో కలిసినప్పుడు అది చర్మాన్ని పొడిబారకుండా, మూసుకుపోయిన రంధ్రాలను తెరిచేలా చేస్తుంది.

కాఫీ పెరుగు ఫేస్ మాస్క్
కాఫీ పెరుగుతో కూడా ఫేస్ మాస్క్ వేసుకోవచ్చు. జిడ్డు చర్మం కలవారికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. దీనికోసం మీరు ఒక స్పూను కాఫీ పొడిని తీసుకోండి. అందులో ఒక స్పూన్ పెరుగును వేసి మెత్తటి పేస్టులా చేసుకోండి. దీన్ని ముఖానికి అప్లై చేసి బాగా స్క్రబ్ చేయండి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది చనిపోయిన మృత చర్మ కణాలను తొలగిస్తుంది. బ్లాక్ హెడ్స్ ను వదులు చేసి బయటకు పోయేలా చేస్తుంది. కాఫీతో కలిపి పెరుగును వాడడం వల్ల చర్మ రంధ్రాలు లోతుగా శుభ్రపడతాయి. చర్మం ఉరుదువుగా మారుతుంది.

కాఫీ కొబ్బరి నూనె స్క్రబ్
ఈ స్కబ్ తయారు చేయడానికి మీరు ఒక స్పూను కాఫీ పొడిని, ఒక స్పూన్ కొబ్బరి నూనెను తీసుకోవాలి. ఈ రెండిటినీ కలిపి మెత్తటి పేస్టులా చేయాలి. దీన్ని బ్లాక్ హెడ్స్ ఉన్న ప్రాంతాల్లోనే అప్లై చేయాలి. రెండు నుంచి మూడు నిమిషాల పాటు బాగా మసాజ్ చేయాలి. తర్వాత శుభ్రం చేసుకోవాలి. అంతే కొబ్బరి నూనె, కాఫీ కలిపి మీ ముఖంపై ఉన్న బ్లాక్ హెడ్స్ ను సున్నితంగానే తొలగిస్తాయి.

పైన చెప్పిన పద్ధతుల్లో మీరు బ్లాక్ హెడ్స్ ను సులువుగా తొలగించుకోవచ్చు. బ్యూటీ పార్లర్ కు వెళ్లాల్సిన అవసరం లేదు.

Related News

Dates Benefits: ఖర్జూరాన్ని ఇలా తీసుకున్నారంటే.. వందల రోగాలు మటుమాయం!

Tea for Kids: పిల్లలకు టీ ఇవ్వడం ప్రమాదకరమా? ఏ వయసు నుంచి టీ ఇవ్వాలి?

Lifestyle Tips: రోజును ఉల్లాసంగా ప్రారంభించడానికి 7 మార్గాలు..

Fat Rich Fruits : ఫ్యాట్ ఎక్కువగా ఉండే.. ఫ్రూట్స్ ఏవో తెలుసా ?

Soaked Almonds: డైలీ 5 నానబెట్టిన బాదంలను 30 రోజులు తింటే.. ఈ సమస్యలన్నీ దూరం !

Money Plant: ఇంటి అందానికి మాత్రమే కాదండోయ్.. ఈ ప్లాంట్ వెనుకున్న అసలు కారణాలు ఇవే!

Squats Benefits: రోజూ 30 గుంజీలు తీయాల్సిందే.. ఎందుకో తెలిస్తే ఆపకుండా చేసేస్తారు!

Moringa Oil Benefits: సౌందర్య పోషణలో మునగ నూనె.. అందాన్ని రెట్టింపు చేయడంలో తోడ్పాటు!

Big Stories

×