BigTV English

Amazon House: అమెజాన్ లో ఏకంగా ఇంటినే ఆర్డర్ పెట్టిన ఘనుడు.. వెంటనే డెలివరీ!

Amazon House: అమెజాన్ లో ఏకంగా ఇంటినే ఆర్డర్ పెట్టిన ఘనుడు.. వెంటనే డెలివరీ!

Foldable House: సాధారణంగా అమెజాన్ లో ఏం కొనుగోలు చేస్తారంటే? వెంటనే ఎలక్ట్రానిక్ వస్తువులు, కిచన్ వేర్, బుక్స్, డ్రెస్సులు సహా పలు వస్తువులు కొనుగోలు చెయ్యొచ్చు అని చెప్తారు. కానీ, అమెరికాకు చెందిన ఓ వ్యక్తి అమెజాన్ లో అందరూ ఆశ్చర్యపోయే ఆర్డర్ చేశాడు. ఆయన ఆర్డర్ చేసిన కొద్ది గంటల్లోనే పార్సిల్ డెలివరీ కావడంతో సంతోషంలో మునిగిపోయాడు. ఇంతకీ ఆయన ఏం ఆర్డర్ చేశాడు? ఏం డెలివరీ అయ్యింది? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..


అమెజాన్ లో ఇంటిని ఆర్డర్ చేసిన టిక్ టాక్ యూజర్

తాజాగా అమెరికాలోని లాస్ ఎంజిల్స్ కు చెందిన టిక్‌ టాక్ యూజర్ జెఫ్రీ బ్రయంట్.. తరచుగా రకరకాల ప్రాంతాలకు వెళ్తుంటాడు. ఆయన వెళ్లిన చోట్లా అద్దె ఇళ్లలో ఉండాలంటే చాలా కష్టంగా ఫీలవుతున్నాడు. అందుకే, ఓ ఫోల్డబుల్ ఇంటిని కొనుగోలు చేయాలి అనుకున్నాడు. వెంటనే అమెజాన్ లో సెర్చ్ చేశాడు. ఆయన కోరుకున్న లక్షణాలతో కూడిన ఓ ఇంటిని గుర్తించాడు. దాన్ని ఆర్డర్ చేశాడు. కొద్ది గంటల్లోనే ఇల్లు డెలివరీ అయ్యింది. ఈ ఇంటిని చూపిస్తూ ఓ వీడియోను టిక్ టాక్ లో షేర్ చేశాడు.”నేను ఇప్పుడే అమెజాన్ నుంచి ఇల్లు కొన్నాను” అంటూ వీడియోను పంచుకున్నాడు. ఈ వీడియో క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.  నెటిజన్లు రకరకాలుగా స్పందించారు.


ఇంతకీ ఈ ఇంటి ధర ఎంతో తెలుసా?

జెఫ్రీ కొనుగోలు చేసిన ఇల్లు నెటిజన్లు బాగా ఆకట్టుకుంది. ఈ వీడియో చూపించిన ఇంట్లో ఓ వంట గది, లివింగ్ రూమ్, బెడ్‌రూమ్, యు ప్రీ ఇన్‌ స్టాల్ చేసిన ఫిక్చర్లతో బాత్రూమ్ ఉన్నాయి. ఈ ఇల్లు 16.5  బై 20 అడుగుల కొలతలను కలిగి ఉంది. దీని ధర $26,000 (భారత కరెన్సీలో సుమారు రూ.21.5 లక్షలు) పలికినట్లు వెల్లడించాడు. ఈ కాంపాక్ట్ ఇళ్లు అందరినీ భలే ఆకట్టుకుంటుంది. చిన్న ఇల్లు కొనాలనే జెఫ్రీ నిర్ణయం అమెజాన్ ద్వారా సాకారం అయ్యింది. ఎప్పటికప్పుడు ప్రాంతాలు మారే వారికి, నిరాశ్రయులైన వ్యక్తుల కోసం AirBnBగా మార్చడానికి  ఈ ఇల్లు పనికి వస్తుందని జెఫ్రీ వెల్లడించాడు. ఒకవేళ ఎవరికైనా చిన్నఇల్లును కొనుగోలు చేయాలనే కోరిక ఉంటే వెళ్లి అమెజాన్ లో కొనుగోలు చెయ్యొచ్చన్నాడు.

నెటిజన్లు ఏం అంటున్నారంటే?

ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. పలువురు సోషల్ మీడియా వినియోగదారులు ఫోల్డబుల్ ఇంటిని కొనడానికి ఆసక్తి చూపినట్లు కామెంట్స్ పెట్టారు. పలువురు ఈ ఇంటి గురించి ఆరా తీసే ప్రయత్నం చేశారు. “ఉచిత హోమ్ డెలివరీ ఉందా?” అని ఓ వినియోగదారు అడిగారు. “డ్రైనేజీ వ్యవస్థ ఎలా సరిపోతుంది? వ్యర్థ జలాలు ఎక్కడికి వెళ్తాయి” అని మరొక వ్యక్తి అడిగారు. “ఆ ఇంటిని తరలించడం,  అనుమతులు, యుటిలిటీ ఫిక్సేషన్లు (విద్యుత్, గ్యాస్, నీరు, మురుగునీటి), ల్యాండ్‌ స్కేపింగ్ ఖర్చు కలుపుకుని మొత్తం ఎంత అవుతుంది? అని మరో వ్యక్తి ప్రశ్నించాడు. మొత్తంగా ఈ ఫోల్డబుల్ ఇల్లుపై జోరుగా చర్చ నడుతోంది.

Read Also: ఆమె మెట్రో రైలు ప్రమాదంలో చనిపోయింది.. కానీ, ఆమె ఫోన్ నుంచి కొడుకు, చెల్లికి కాల్స్.. అదెలా?

Related News

Bird wedding festival: ఇక్కడ యువకులకు పెళ్లి నిల్.. పక్షులకు మాత్రం గ్యారెంటీ.. ఈ వెరైటీ కల్చర్ ఎందుకంటే?

Viral Video: ట్రాఫిక్ పెరిగిందని.. బాహుబలిలా బైకును భుజంపై పెట్టుకుని నడిచిన వాహనదారుడు, వీడియో వైరల్

Watch Video: రైల్లో కూలర్ ఏసుకుని పడుకుంటే, ఆహా ఐడియా అదిరింది భయ్యా!

Ganesh Chaturthi festival: చేతికి వంద.. ప్లేట్ నిండా భోజనం.. అన్నదానం ఇలా కూడా చేస్తారా బ్రో?

Viral News: స్కూల్‌ పై దావా వేసిన దొంగ.. నెలకు లక్షన్నర జీతం చెల్లిస్తున్న యాజమాన్యం!

Viral video: కబడ్డీ ఆడుతుండగా భారీ శబ్దంతో పిడుగు.. యువకులు పరుగో పరుగు.. వీడియో ఫుల్ వైరల్

Big Stories

×