RCB VS MI: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో ( Indian Premier League 2025 Tournament )
భాగంగా… ఇవాళ మరో రసవత్తర పోరు జరిగింది. ముంబై వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ముంబై ఇండియన్స్ (Royal Challengers Bangalore vs Mumbai Indians ) జట్ల మధ్య బిగ్ ఫైట్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో రెండు జట్లు భారీ స్కోర్లు చేశాయి. కానీ చివరికి ముంబై ఇండియన్స్ జట్టుపై గ్రాండ్ విక్టరీ కొట్టింది బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్. ముంబై సొంత గడ్డపై…10 ఏళ్ళ తర్వాత బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ విజయం సాధించింది.
ఈ కీలక మ్యాచ్ లో ఏకంగా 12 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ జట్టు పైన విక్టరీ సాధించింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 221 పరుగులు చేసింది. అయితే ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో ముంబై బాగానే పోరాడింది. కానీ చివరికి.. 9 వికెట్లు నష్టపోయిన ముంబై ఇండియన్స్ 209 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 12 పరుగుల ఓటమి చవిచూసింది.
Also Read: Ashwin YouTube Channel: CSK లో ముసలం… నూర్ అహ్మద్ పరువు తీసిన అశ్విన్ యూట్యూబ్ ఛానల్
మరోసారి విఫలమైన రోహిత్ శర్మ, బుమ్రా
ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఇవాళ జరిగిన మ్యాచ్ లో ఇంపాక్ట్ ప్లేయర్ గా రోహిత్ శర్మ బరిలోకి వచ్చాడు. ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన రోహిత్ శర్మ కేవలం 17 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 9 బంతులు ఆడిన రోహిత్ శర్మ ఒక సిక్సర్ తో పాటు రెండు బౌండరీలు కొట్టి అవుట్ అయ్యాడు. ఇక అటు చాలా రోజుల తర్వాత… చాలా రోజుల తర్వాత జట్టులోకి వచ్చిన బుమ్రా కూడా ఇంతవరకు ఒక్క వికెట్ పడగొట్టలేదు. నాలుగు ఓవర్లు వేసిన బుమ్రా… ఒక వికెట్ పడగొట్టకుండా ఏకంగా 29 పరుగులు ఇచ్చాడు.
అద్భుతంగా ఆడిన ఆర్సిబి కెప్టెన్ రజత్ పటిదర్
ముంబై ఇండియన్స్ పైన అద్భుతంగా ఆడాడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ రజత్ పటిదర్. ఈ మ్యాచ్లో 32 బంతులు ఆడి ఏకంగా 64 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సిక్సర్లతో పాటు ఐదు బౌండరీలు బాదేశాడు. 200 స్ట్రైక్ రేటుతో దుమ్ము లేపాడు. అలాగే విరాట్ కోహ్లీ 67 పరుగులు చేయగా చివర్లో జితేష్ శర్మ 40 పరుగులు చేసి దుమ్ము లేపాడు. పడిక్కల్ 37 పరుగులు చేశాడు.
Also Read: Ashleigh Gardner-Monica Marriage: ఏంట్రా ఈ దారుణం.. మహిళల క్రికెటర్లు పెళ్లి చేసుకున్నారు
దుమ్ము లేపిన తెలుగు కుర్రాడు తిలక్ వర్మ
లక్నో సూపర్ జెంట్స్ వర్సెస్ ముంబై మ్యాచ్ లో జరిగిన అవమానానికి… ప్రతీకారం తీర్చుకున్నాడు తిలక్ వర్మ. ముంబై యాజమాన్యానికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చేలా… రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు పైన విరుచుకుపడ్డాడు తిలక్ వర్మ. సూర్య కుమార్ యాదవ్ లాంటి ప్లేయర్ ఆడ లేకపోయినా కూడా… మన తెలుగోడు ఆడి సత్తా చాటాడు. ఈ మ్యాచ్ లో తిలక్ 56 పరుగులు చేసాడు.
RCB seal a last-over nail-biting win at Wankhede! ❤️🔥
They end their long wait with a victory at Wankhede — their first in 10 years against the Mumbai Indians 👏🤩#IPL2025 #MIvRCB #RajatPatidar #Sportskeeda pic.twitter.com/cFAc00WzCe
— Sportskeeda (@Sportskeeda) April 7, 2025