BigTV English

Aloe Vera Face Pack: అందంగా కనిపించాలా..? అయితే ఈ ఫేస్ ప్యాక్స్ మీ కోసమే !

Aloe Vera Face Pack: అందంగా కనిపించాలా..? అయితే ఈ ఫేస్ ప్యాక్స్ మీ కోసమే !

Aloe Vera Face Pack: అలోవెరాలో విటమిన్ ఏ, సి, ఇతో పాటు ఫోలిక్ యాసిడ్ ఉంటాయి. అలోవెరా అనేక ఔషధాలు గుణాలు కలిగిన మొక్క. ఇది ఆరోగ్య ప్రయోజనాలనే కాకుండా చర్మాన్ని అందంగా మెరిసేలా చేస్తుంది. రాత్రిపూట అలోవెరా జెల్‌ను ముఖానికి అప్లై చేయడం వల్ల అనేక లాభాలు ఉంటాయి. దీని ద్వారా ముఖాన్ని మెరిసేలా, యవ్వనంగా మార్చుకోవచ్చు.


అలోవెరా జెల్ వాడటం వల్ల ముఖంపై ఉండే మొటిమలు, మచ్చలు కూడా తొలగిపోతాయి. కలబంద ముఖంపై తరచుగా అప్లై చేయడం వల్ల డెడ్ స్కిన్ తొలగిపోతుంది. రాత్రిపూట అలోవెరా ముఖానికి రాయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

అలోవెరా జెల్ ప్రతి రోజు ముఖానికి మసాజ్ చేయడం వల్ల చర్మం మెరుస్తుంది. అంతేకాకుండా చర్మాన్ని బిగుతుగా ఉంచడంలో కూడా ఇది సహాయపడుతుంది. ముఖంపై ఉన్న మచ్చలు, మొటిమలను ఇది తొలగిస్తుంది. చర్మంలో కొల్లాజిన్‌ను పెంచడానికి దోహదం చేస్తుంది. అలోవెరా జెల్‌ను చాలా కాలంగా సౌందర్య ఉత్పత్తుల తయారీలో కూడా ఉపయోగిస్తున్నారు. ఫేస్ పై ఉన్నజిడ్డను శుభ్రం చేయడానికి అలోవెరా ఉపయోగపడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు గుణాలు పుష్కలంగా ఉంటాయి. దీని వల్ల చర్మం గాయాలు కూడా త్వరగా నయం అవుతాయి. కలబంద ముఖానికి అప్లై చేయడం వల్ల మీ ఫేస్ కాంతి వంతంగా మారుతుంది.


అలోవెరా ఫేస్ ప్యాక్స్..

1. అలోవేరా, రోజ్ వాటర్ ఫేస్ ప్యాక్స్
కావలసినవి:
అలోవెరా జెల్- 1 టేబుల్ స్పూన్.

రోజు వాటర్ – 1 టేబుల్ స్పూన్.

ఈ ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవడానికి ఒక టేబుల్ స్పూన్ అలోవెరా జెల్, ఒక బ ఒక టేబుల్ స్పూన్ రోజు వాటర్ ను ఒక బౌల్‌లోకి తీసుకుని మిక్స్ చేయాలి. ఆ తర్వాత దీన్ని ముఖానికి అప్లై చేసి 15 నుంచి 20 నిమిషాలు ఉంచి ఆ తర్వాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై ఉన్న మచ్చలు, మొటిమలు తొలగిపోతాయి. అంతే కాకుండా ముఖం తాజాగా, మెరుస్తూ ఉంటుంది.

2. కలబంద, తేనె ఫేస్ ప్యాక్స్
కావలసినవి:
అలోవెరా జెల్ – ఒక టేబుల్ స్పూన్
అరటిపండు గుజ్జు- 1/2 స్పూన్

తేనె – ఒక టేబుల్ స్పూన్

Also Read: ముఖంపై మచ్చలు తొలగించే ఫేస్ ప్యాక్ ఇదే !

ఒక బౌల్‌లో అలోవెరా జెల్, తేనెను వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత తీనిలో బాగ పండిన అరటిపండు గుజ్జును 1/2 స్పూన్ వేసుకుని మిశ్రమంలా తయారుచేసుకోవాలి. ఆ తర్వాత దీనిని ముఖంపై అప్లై చేసి 25 నుంచి 30 నిమిషాల తర్వాత కడిగేయాలి. చల్లని నీటితో ఈ ఫేస్ ప్యాక్‌ను శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచుగా చేయడం వల్ల ముఖంపై, మచ్చలు తొలగిపోతాయి. అంతే కాకుండా ముఖం తాజాగా ఉంటుంది. చర్మం పొడిబారి.. నిర్జీవంగా తయారైనప్పుడు అలోవెరాను వాడటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. చర్మాన్ని హైడ్రేటె‌డ్ ఉంచేందుకు అలోవెరా ఉపయోగపడుతుంది. చర్మంపై ఉన్న జిడ్డును కూడా తొలగిస్తుంది.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Big Stories

×