35-Chinna Katha Kaadu Official Trailer: మలయాళ బ్యూటీ నివేదా థామస్, విశ్వదేవ్ ఆర్, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘35 చిన్న కథ కాదు’. ఈ సినిమాకు నందకిశోర్ ఇమాని దర్శకత్వం వహిస్తుండగా.. రానా, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ ఆకట్టుకున్నాయి. తాజాగా, ఈ సినిమాట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
ఈ ట్రైలర్‌ను టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున చేతులమీదుగా విడుదల చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. ఇందులో నివేదా తల్లి పాత్ర పోషించారు. నివేదా తల్లి పాత్రలో హుందాగా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. మ్యాథ్స్ రాని కుమారుడు భవిష్యత్తును తీర్చిదిదే తల్లిగా అద్భుతంగా నటించారు.
ఇందులో ఓడిపోవడం అనే మైనస్ నుంచి గెలవడం అనే ప్లస్ వైపు అడుగులు వేస్తుంటే..అందరికీ ఎదురయ్యే మజిలీ సున్నా. దానిని దాటాలి అని నివేదా థామస్ చెప్పే డైలాగ్స్ మనసుని హత్తుకుంటుంది. విద్యా వ్యవస్థ గురించి గొప్పగా, భార్యభర్తల అనుబంధం, టీచర్, స్టూడెంట్స్ ఇలా బంధాల గురించి అద్భుతంగా చూపించారు.
Also Read: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. చిరంజీవి కీలక విజ్ఞప్తి
వాస్తవానికి ఆగస్టు 15న విడుదల కావాల్సిన ఈ సినిమా పలు కారణాలతో వాయిదా పడింది. తాజాగా, ఈ సినిమాను సెప్టెంబర్ 6న విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషనల్ కార్యక్రమాలను జెట్ స్పీడ్ లో చేస్తున్నారు.