Curd Rice Benefits: అమ్మమ్మల ఆరోగ్య రహాస్యం చద్ధన్నం అని అంటారు. ఇది కేవలం పులిసిన అన్నం మాత్రమే.. కాదు దీనిలో విటమిన్ B12, అనేక పోషకాలును కలిగి ఉంటుంది.. మరియు జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఇది శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది మరియు బ్లడ్ షుగర్ లెవల్స్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది.
చద్దన్నం అంటే..
చద్దన్నం అంటే రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని చద్దన్నం అంటారు. ప్రస్తుత కాలంలో చద్దన్నం తింటారా అంటే ఏదో వింత జంతువును చూసినట్టు చూస్తారు. పల్లే టూర్‌లో ఉండే వాళ్లు మాత్రమే తింటారు అంటారు. కానీ ఇందులో ఉండే పోషకాలు మరేందులోను ఉండవు అంటున్నారు వైద్యులు. ఇది ఆహారం వృథా కాకుండా చూసుకోవడానికి కాదు, ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.
మంచి బ్యాక్టిరియా..
అన్నంలో అత్యంత ఎక్కువ ప్రయోజనకరమైన బ్యాక్టీరియా లభిస్తుంది. కానీ నేటి కాలంలో అన్నం తింటే రోగాలు, ఆనారోగ్య సమస్యలు వస్తాయని అన్నం తినడం మానేస్తున్నారు. పెరుగన్నం క్రమం తప్పకుండా తినడం వల్ల రోగాల బారిన పడే ప్రమాదం తగ్గుతుంది. శరీరంలోని చెడు బ్యాక్టీరియాతో పోరాడి మంచి బ్యాక్టీరియాను పెంచుతుందని అంటున్నారు.
బరువును అదుపులో ఉంచుతుంది.. ముఖం కాంతివంతంగా చేస్తుంది
బరువు తగ్గాలి అనుకున్న వారు చద్దన్నం తింటే చాలా మంచిది. ఇందులో తాజాగా వండిన ఆహారం కంటే తక్కువ క్యాలరీలు ఉంటాయి. పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ జీవక్రియను ప్రభావితం చేస్తుంది. ఇది మీ బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. అలాగే ఇతర చర్మ సమస్యలను దూరం చేయడంలోను సహాయపడుతుంది. క్రమం తప్పకుండా దీనిని తినడం వల్ల మీ ముఖం కాంతివంతంగా మారుతుంది.
Also Read: కొలెస్ట్రాల్ పెరిగితే.. పాదాల్లో కనిపించే లక్షణాలు ఇవే !
పొట్ట సమస్యలు మాయం..
ఉదయం వేళ పెరుగన్నం తినడం వల్ల పొట్ట సమస్యలు తగ్గుతాయి. అంతేకాకుండా డయాబెటిస్, అజీర్ణం వంటి సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కలిగించడానికి కూడా సహాయపడుతుంది. పెరుగులో ఉండే క్యాల్షియం ఎముకలను దృఢంగా మార్చుతుంది. గుండె సంబంధిత వ్యాధులను నివారిస్తుంది.
తయారి విధానం
రాత్రిపూట మిగిలిన అన్నంలో అది మునిగే వరకు పాలు పోసి బాగా కలిపి అందులో కొంచెం తోడు వేసి ఉంచాలి. ఉదయాన్నే అందులో రుచికి సరి పడ ఉప్పు వేసి.. కొంచెం ఉల్లిపాయ, పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకోవాలి. ఇలా ప్రతిరోజూ అల్పాహారంలో చద్దన్నం తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రోజంతా ఉత్సాహంగా ఉండగలుగుతారని చేప్తున్నారు.