BigTV English

Sukumar: సుకుమార్ నెక్ట్స్ ప్రాజెక్ట్ లో కోలీవుడ్ అగ్ర హీరోలు… ఈ సారి పుష్పకు మించి ప్లాన్?

Sukumar: సుకుమార్ నెక్ట్స్ ప్రాజెక్ట్ లో కోలీవుడ్ అగ్ర హీరోలు… ఈ సారి పుష్పకు మించి ప్లాన్?

Sukumar : ‘పుష్ప’ (Pushpa) సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ గా మంచి ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు లెక్కల మాస్టర్ సుకుమార్ (Sukumar). ఇక ‘పుష్ప 2’ (Pushpa 2) సినిమాతో ఆయన క్రేజ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది. ఏకంగా రూ. 1871 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టి ఈ సినిమాతో చరిత్ర సృష్టించారు. ఇంకా ‘పుష్ప’ సిరీస్ కంప్లీట్ కాలేదన్న సంగతి తెలిసిందే. ఈ ఫ్రాంచైజీలో పార్ట్ 3 కూడా రాబోతుందని ఇప్పటికే హింట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుకుమార్ కోలీవుడ్ కి గుడ్ న్యూస్ చెప్పారు. ఇద్దరు కోలీవుడ్ స్టార్స్ తో సినిమా తీయాలనుకుంటున్నట్టు ఆయన చెప్పిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.


స్టార్ బ్రదర్స్ తో సుకుమార్ మాస్టర్ ప్లాన్

‘పుష్ప’ సిరీస్ లో ఇంకా మూడవ భాగం రావాల్సి ఉంది. కానీ ఇప్పట్లో ఈ మూవీ పట్టాలెక్కే సూచనలేమీ కనిపించట్లేదు. ఎందుకంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు అట్లీ సినిమాతో బిజీ కాబోతున్నారు. ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక మైథలాజికల్ మూవీ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాతే అల్లు అర్జున్ ‘పుష్ప 3’ స్టార్ట్ చేసే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతుంది.


ఇక మరోవైపు దర్శకుడు సుకుమార్ కూడా ఇతర సినిమాలతో బిజీ కాబోతున్నారు. అందులోనూ రామ చరణ్ తో మరోసారి సుకుమార్ సినిమా తీయబోతున్నారు అన్న వార్త సంచలనగా మారింది. ‘రంగస్థలం’ తర్వాత వీరిద్దరూ చేయబోతున్న నెక్స్ట్ మూవీ ఇదే కావడంతో అప్పుడే అంచనాలు కూడా మొదలయ్యాయి. అయితే అటు అల్లు అర్జున్ అట్లీ, త్రివిక్రమ్ సినిమాలు, ఇటు సుకుమార్ రామ్ చరణ్ తో మూవీని పూర్తి చేసేదాకా ‘పుష్ప 3’ హోల్డ్ లోనే ఉంటుంది.

తాజాగా చెన్నైలో జరిగిన ఈవెంట్లో డైరెక్టర్ సుకుమార్ కోలీవుడ్ కిక్కిచ్చే న్యూస్ చెప్పారు. “పుష్ప లాంటి ఊర మాస్ సబ్జెక్టుతో తమిళంలో ఒక సినిమా చేయాలనుకుంటే ఏ హీరోతో చేస్తారు?” అనే ప్రశ్నకి సుకుమార్ స్పందిస్తూ… ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా కార్తీ (Karthi) తో చేయడానికి రెడీగా ఉన్నట్టు చెప్పారు. తనకు కార్తీ ఎక్స్ప్రెషన్స్ అంటే ఇష్టమని కితాబు కూడా ఇచ్చారు. అంతేనా ఆయన అన్న సూర్య (Suriya) తన ఫేవరెట్ యాక్టర్ అని కూడా సుకుమార్ చెప్పడం విశేషం.

‘పుష్ప 3’లో తమిళ విలన్ ?

ఇద్దరు అన్నదమ్ములతో కలిసి సినిమా చేసే ఛాన్స్ వస్తే అస్సలు వదులుకోనని సుకుమార్ చెప్పడంతో తమిళ తంబీలు ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇక సోషల్ మీడియాలో ఆ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ‘పుష్ప 3’లో కార్తీని విలన్ గా పెడతారు అంటూ ఓ గాసిప్ మొదలైంది. ఇక ఈ గాసిప్స్ పక్కన పెడితే అసలు తమిళ హీరోలతో సుకుమార్ కాంబినేషన్లో మూవీ ఎప్పుడు సెట్ అవుతుందనేది ఆసక్తికరంగా మారింది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×