Curd For White Hair: ఇప్పుడున్న రోజుల్లో ప్రతి ఒక్కరిని వేధిస్తున్న సమస్య చిన్న వయసులోనెే తెల్లజుట్టు రావడం.. దీనికి అనేక కారణాలు కావచ్చు. బయట కాలుష్యం, సరైన పోషకాహారం తినకపోవడం, స్ట్రెస్, కెమికల్స్ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ వాడటం వల్ల.. జుట్టు తొందరగా నెరిసిపోతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వైట్ హెయిర్‌ని తొలగించేందుకు చాలా మంది రకరకాల హెన్నాలు, హెయిర్ డై, హెయిర్ కలర్స్ వంటివి ఉపయోగిస్తుంటారు. వీటివల్ల ఫలితం ఉంటుందో రాదో పక్కన పెడితే.. జుట్టుకు హాని కలిగే ప్రమాదం ఉంది.
ఇవి కెమికల్స్‌తో తయారుచేసినవి గనుక అనేక అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన ఇంట్లోనే దొరికే పదార్ధాలతో హెయిర్ మాస్క్‌లు తయారు చేసుకోవచ్చు. తెల్లజుట్టు నల్లగా మార్చేందుకు పెరుగు అద్భుతంగా పనిచేస్తుంది. పెరుగులో యాంటీ ఆక్సీడెంట్లు, మినరల్స్, విటమిన్స్ అధికంగా ఉంటాయి. ఇవి జుట్టు తెల్లగా మారకుండా సహాయపడతాయి. అంతేకాదు.. జుట్టు కూడా ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది కూడా. పెరుగులో కొన్ని పదార్ధాలను కలిపి హెయిర్‌కి అప్లై చేస్తే.. మంచి ఫలితం ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్ధాలు..
పెరుగు
ఉసిరిపొడి
మెంతులు
తయారు చేసుకునే విధానం..
ముందుగా మెంతులను రాత్రంతా నానబెట్టుకుని ఉంచాలి. మరుసటి రోజు మిక్సీజార్‌లో మెంతులను తీసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చిన్న బౌల్‌లో పెరుగు తీసుకుని అందులో మెంతుల పేస్ట్, రెండు టేబుల్ స్పూన్ ఉసిరి పొడి తీసుకుని బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని జుట్టు చివర్ల వరకు అప్లై చేసి. గంట తర్వాత కుంకుడి కాయలతో తలస్నానం చెయ్యండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే.. తెల్లజుట్టు అనేది క్రమంగా నల్లగా మారుతుంది. దీంతో పాటు జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.
తెల్లజుట్టును శాశ్వతంగా నివారించేందుకు మరొక చిట్కా ఉంది. ఇది కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్ధాలు
టీ పొడి
కాఫీ పొడి
కొబ్బరి నూనె
తయారు చేసుకునే విధానం..
ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి.. అందులో రెండు టేబుల్ స్పూన్ టీ పొడి తీసుకొని.. రెండు నిమిషాలు వేయించి పక్కన పెట్టుకోవాలి.. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్‌లోకి తీసుని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. చిన్న గిన్నె తీసుకొని అందులో మెత్తగా చేసుకున్న టీపొడి, రెండు టేబుల్ స్పూన్ కాఫీ పొడి, కొబ్బరి నూనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు అప్లై చేయండి. అరగంట తర్వాత తలస్నానం సాధారణ షాంపూతో తలస్నానం చెయ్యండి. ఇలా వారానికి ఒకసారి చేస్తే.. జీవితంలో తెల్లజుట్టు అనేది రాదు. టీ పొడి జుట్టుకు చాలా బాగా సహాయపడుతుంది. జుట్టు కుదుళ్లను బలంగా చేసి రాలకుండా అరికడుతుంది. ఈ హెయిర్ మాస్క్ తెల్లజుట్టును నివారించేందుకు అద్భుతంగా పని చేస్తుంది.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.