BigTV English

Hair Oils: ఉసిరి నూనె లేదా ఆముదం నూనె.. జుట్టును ఏది వేగంగా పెరిగేలా చేస్తుంది?

Hair Oils: ఉసిరి నూనె లేదా ఆముదం నూనె.. జుట్టును ఏది వేగంగా పెరిగేలా చేస్తుంది?

శీతాకాలంలో జుట్టును కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే పెళుసుగా మారి చివరలు చిట్లిపోతాయి. జుట్టు సంరక్షణలో ఉసిరి ఆయిల్, ఆముదం రెండూ అద్భుతంగా పనిచేస్తాయి. ఈ రెండు నూనెల్లో కూడా పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. సాంప్రదాయ జుట్టు సంరక్షణ పద్ధతుల్లో ఈ రెండింటినీ వినియోగిస్తూనే ఉన్నారు. అయితే ఉసిరి నూనె లేదా ఆముదం నూనె.. ఈ రెండింటిలో దేని వల్ల జుట్టు త్వరగా పెరుగుతుంది.


ఉసిరి నూనె
ఉసిరి నూనె భారతదేశానికి చెందిన ప్రత్యేకమైన నూనె. మనదేశంలో ఉండే ఉసిరికాయలతో దీన్ని తయారు చేస్తారు. ఆయుర్వేద వైద్యంలో దీన్ని అధికంగా వాడతారు. ఇది కేవలం జుట్టుకే కాదు మొత్తం ఆరోగ్యానికే మేలు చేస్తుంది. ఉసిరిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, టానిన్లు వివిధ రకాలైన ఆమ్లాలు ఉంటాయి. ఇవన్నీ జుట్టు పెరుగుదలకు దోహదం చేస్తాయి. జుట్టుకు బలాన్ని ఇస్తాయి. జుట్టుకు చర్మానికి అవసరమైన కొల్లాజెన్ ఉత్పత్తిలో ఉసిరిలో ఉండే విటమిన్ సి కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఉసిరి జుట్టుకు, చర్మానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ఉసిరి నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతాయి. జుట్టు కుదుళ్ళను దెబ్బతీయకుండా అడ్డుకుంటాయి. జుట్టు త్వరగా పెరిగేలా చేస్తాయి.

ఉసిరి నూనెలో సహజమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, యాంటీ మైక్రోబయల్ గుణాలు ఉన్నాయి. ఇవి చుండ్రును తొలగిస్తాయి. వెంట్రుకలు ఎదగడానికి కావాల్సిన పరిస్థితులను కల్పిస్తాయి. ఉసిరి నూనెను తలకు మసాజ్ చేస్తే ఆ ప్రాంతంలో రక్త ప్రవాహం చక్కగా ఉంటుంది. ఇది హెయిర్ ఫోలికల్స్ కు అవసరమైన పోషకాలను అందిస్తుంది. జుట్టు తెల్లబడే సమస్యను రాకుండా అడ్డుకుంటుంది. ఉసిరి నూనెలో కండిషనింగ్ లక్షణాలు కూడా ఉన్నాయి. ఇవి జుట్టును మృదువుగా మెరిసేలా చేస్తాయి.


ఆముదం నూనె
ఆముదం నూనె జుట్టు సంరక్షణకు ఎంతో మేలు చేస్తుంది. ఆముదంలో రిసినోలిక్ యాసిడ్, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ కూడా జుట్టు పెరుగుదలకు అవసరమైన పోషకాలు. ఆముదాన్ని నెత్తి మీద మసాజ్ చేసుకుంటే రక్తప్రసరణ సవ్యంగా జరుగుతుంది. దీనివల్ల జుట్టు పెరుగుదల మెరుగుపడుతుంది. ఒమేగా 6 కొవ్వు ఆమ్లాలను ఇది కలిగి ఉంటుంది. జుట్టు కుదుళ్లకు అవసరమైన పోషకాలను అందిస్తుంది. జుట్టు మందంగా, ఆరోగ్యంగా ఎదిగేలా చేస్తుంది.  ఆముదం నూనెలో కూడా యాంటీ మైక్రో బయల్ గుణాలు ఉంటాయి. ఇవి జుట్టుపై లేదా నెత్తిపై చేరే శిలీంధ్రాలు, బ్యాక్టీరియాతో పోరాడే శక్తిని అందిస్తాయి. జుట్టు సన్నబడకుండా, రాలకుండా అడ్డుకుంటాయి. ఆముదం నూనెను జుట్టుకు క్రమం తప్పకుండా ఉపయోగిస్తే నెల రోజుల్లోనే మీకు మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఆముదం నూనె వెంట్రుకల ఫోలికల్స్ లోపలికి చొచ్చుకుని వెళ్లి జుట్టును బలోపేతం చేస్తుంది. జుట్టు పలుచన అయ్యే సమస్యతో బాధపడేవారు ఆముదం నూనె కొన్ని రోజులు వాడి చూడండి. మీకు మంచి ఫలితాలు కనిపిస్తాయి.

ఉసిరి నూనె లేదా ఆముదం ఏది బెటర్?
ఉసిరి నూనె, ఆముదం… ఈ రెండూ కూడా జుట్టు పెరుగుదలకు ప్రయోజనకరమైనవే. ఈ రెండింటినీ వాడాల్సిన అవసరం ఉంది. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి జుట్టును బలోపేతం చేస్తాయి. ఆంగ్లంలో కూడా ఫ్యాటీ యాసిడ్లు, లినోలిక్ యాసిడ్ ఉంటుంది. ఇవి నెత్తి మీద రక్తప్రసరణ పెంచి లోతుగా పోషకాలను అందిస్తుంది.  జుట్టు మందంగా, ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. ఉసిరినూనె, ఆముదం నూనె… మీ వీలును బట్టి ఏది వాడినా మంచిదే. ఆముదం నుంచి  బలమైన వాసన వస్తుంది. కాబట్టి ఆఫీసులకు, స్కూళ్లకు వెళ్లేవారు ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే ఆముదం నూనెను వినియోగించాలి. ఉసిరి నుంచి ఎలాంటి వాసన రాదు కాబట్టి దీని తరచూ వాడడం ఉత్తమం.

Related News

Non-vegetarian food: ముక్క లేనిదే ముద్ద దిగడం లేదా ? అయితే జాగ్రత్త !

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Big Stories

×