BigTV English

Moisturisers Injections: మాయిశ్చరైజర్ ఇంజెక్షన్లు చర్మానికి మంచివేనా..?

Moisturisers Injections: మాయిశ్చరైజర్ ఇంజెక్షన్లు చర్మానికి మంచివేనా..?

Moisturisers Injections: చర్మాన్ని మృదువుగా, యవ్వనంగా ఉంచడానికి అన్నింటినీ ప్రయత్నిస్తుంటారు. క్రీములు, సీరమ్‌లు, నూనెలు వంటి అనేక ఉత్పత్తులు వాడుతుంటారు. అంతేకాదు ప్రస్తుతం ఉన్న కాలంలో ఇంజెక్టబుల్ మాయిశ్చరైజర్‌లు, కాస్మెటిక్ ట్రీట్‌మెంట్‌ల ట్రెండ్‌ నడుస్తోంది. చర్మాన్ని లోపలి నుండి హైడ్రేట్ చేయడానికి ఇవి ఓ మార్గాన్ని అందిస్తాయి. ఇంజెక్ట్ చేయగల మాయిశ్చరైజర్‌లు లేదా స్కిన్ బూస్టర్‌లు లోతైన చర్మ హైడ్రేషన్‌ను అందించే సూక్ష్మ ఇంజెక్షన్లు అంటారు. ఫిల్లర్ల మాదిరిగా కాకుండా, అవి ముఖం ఆకారాన్ని లేదా వాల్యూమ్‌ను మార్చడానికి తోడ్పడతాయి. అంతేకాదు ముఖ చర్మం మొత్తం ఆకృతి, స్థితిస్థాపకత తేమ స్థాయిలను మెరుగుపరచడానికి ఉపయోగపతాయి.


ఈ చికిత్సల్లో హైలురోనిక్ యాసిడ్ వంటి పదార్ధాలను ఉపయోగిస్తారు. ఇవి సహజంగా శరీరంలో అద్భుతమైన మార్పును తీసుకువస్తాయి. వివిధ రకాల ఇంజెక్ట్ చేయగల మాయిశ్చరైజర్‌లలో, ప్రతి ఒక్కటి దాని స్వంత ప్రత్యేకమైన సూత్రీకరణ, విభిన్న చర్మ సమస్యలు, లక్ష్యాలను తీర్చగల ప్రయోజనాలను కలిగి ఉంటాయి. ముఖ్యంగా ప్రొఫిలో కేవలం మాయిశ్చరైజర్ కంటే ఎక్కువగా నిలుస్తుంది. ఇది చర్మంలో కొల్లాజెన్, ఎలాస్టిన్ హైలురోనిక్ యాసిడ్ ఉత్పత్తిని ప్రేరేపించే బయో-రీమోడలింగ్ చికిత్స.

హైలురోనిక్ యాసిడ్ జెల్ మాగ్నెట్ లా పనిచేస్తుంది. దీంతో చర్మంలోని తేమను నిలుపేందుకు ప్రోత్సాహపడుతుంది. ఇది ఆరు నెలల వరకు ఉండే మృదువైన, ప్రకాశవంతమైన చర్మాన్ని అందిస్తుంది. అలసిపోయిన, పొడి, ముడతలు పడిన చర్మాన్ని సమర్థవంతంగా రిఫ్రెష్ చేస్తుంది. విస్కోడెర్మ్ హైడ్రోబూస్టర్ హైలురోనిక్ యాసిడ్‌, జువెడెర్మ్ వోలైట్‌తో సహా అనేక రకాల ఉత్పత్తులను అందిస్తుంది. ఇందులో ప్రొఫిలోతో పోలిస్తే తక్కువ స్థాయి హైలురోనిక్ యాసిడ్ ఉంటుంది. అయితే ఈ యాసిడ్ తో వేసే మాయిశ్చరైజర్ ఇంజెక్షన్లు చాలా వరకు అందరికీ మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. కొంత మంది చర్మానికి ఇవి అస్సలు పడవని చెబుతున్నారు.


Tags

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×