ముంబైలోని వర్లి అనే ప్రాంతంలో రిషభ్ పటేల్ అనే వ్యక్తి జీవిస్తున్నాడు. ఎప్పటినుంచో వాళ్ళ ఇంట్లో ఒక కుక్కను పెంచుతున్నారు. ఆ కుక్క ఒకసారి ఇంటి నుంచి బయటకు వచ్చి పొరుగు ఇంట్లోకి వెళ్ళింది. అక్కడ ఉన్న లిఫ్ట్ లోకి వెళ్ళింది. లిఫ్ట్‌లో ఉన్నవారు భయంతో అరిస్తే వారిని కరిచింది. దీంతో వారు కుక్కని పెంచుతున్న రిషభ్ పటేల్ పై కేసు పెట్టారు. ఎందుకంటే ఆ పెంపుడు కుక్కని నిర్లక్ష్యంగా బయటికి వదిలేసింది యజమానే.. కాబట్టి కుక్కకి ఎలాంటి శిక్ష లేకపోయినా యజమానికి మాత్రం గట్టిగానే శిక్ష వేశారు జడ్జిగారు.
కుక్క కరిస్తే ఇదే శిక్ష
భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 291వ ప్రకారం ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా లేదా నిర్లక్ష్యంగా తన పెంపుడు కుక్క ద్వారా వేరే వారికి గాయం లేదా ప్రమాదం కలిగిస్తే అతనికి ఆరు నెలల జైలు శిక్ష లేదా ఐదు వేల జరిమానా పడుతుంది. ఒక్కోసారి రెండు కూడా విధిస్తారు. అలాగే ఆ కుక్కలకు టీకాలు వేయించకపోతే కేసు తీవ్రత మరింతగా పెరిగే అవకాశం ఉంది. గతంలో అంటే ఐపిసి సెక్షన్లు ఉన్నప్పుడు జరిమానా వెయ్యి రూపాయలు ఉండేది. అలాగే చాలా తక్కువ శిక్షతోనే బయటపడేవారు. కానీ భారత న్యాయ సంహిత అమల్లోకి వచ్చాక శిక్షలు కాస్త తీవ్రంగా మారాయి. కాబట్టి మీరు పెంపుడు కుక్కల విషయంలో నిర్లక్ష్యం వహించకూడదు. అవి ఎవరినైనా కరచినా కూడా దానికి పూర్తిగా బాధ్యులు మీరే.
గతంలో కూడా ఇలాంటి కేసులు ఎన్నో కోర్టు వరకు చేరుకున్నాయి. ఆ సమయంలో భారతీయ కోర్టులు కఠినంగా వ్యవహరించాయి. పెంపుడు జంతువులు యజమానులకు చాలాసార్లు దోషులుగా నిర్ధారించి వారికి శిక్షణ వేశారు. న్యాయనిపుణులు చెబుతున్న ప్రకారం మీరు పెంచుకుంటున్న పెంపుడు కుక్క కాస్త దూకుడుగా ఉంటే దానికి ఎల్లప్పుడూ నోటికీ పట్టి వేసి ఉంచడం మంచిది. అలాగే పెంపుడు కుక్కలకు టీకాలు కూడా వేయించాలి. అలాగే పెంపుడు జంతువులకు సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ మార్గదర్శకాలు కూడా కొన్ని ఉన్నాయి. వాటిని పాటించడం ద్వారానే వాటిని కుక్కలను పెంచితే మీకు ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి.