Abhishek Bachchan: బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan). హీరోగా పలు సినిమాలలో నటిస్తున్నారు కానీ తండ్రి స్థాయిలో గుర్తింపు లభించలేదు. ఇకపోతే మాజీ విశ్వసుందరి, ప్రముఖ సీనియర్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యారాయ్(Aishwarya Rai) ను అభిషేక్ వివాహం చేసుకున్న తర్వాత ఈయన ఇమేజ్ కూడా భారీగా పెరిగిపోయిందని అభిమానులు కూడా కామెంట్లు చేస్తూ ఉంటారు. ఇదిలా ఉండగా.. బాలీవుడ్ లో ఎంతో క్యూట్ గా ఉంటూ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన ఈ జంటపై.. గత రెండు మూడు సంవత్సరాలుగా విడాకుల వార్త ఒక్కసారిగా భగ్గుమన్న విషయం తెలిసిందే.
ఐశ్వర్య – అభిషేక్ మధ్య విడాకులా?
ముఖ్యంగా ఐశ్వర్యరాయ్.. అభిషేక్ తల్లి జయాబచ్చన్ (Jaya Bachchan) తో కలవడం లేదని, ఈ క్రమంలోనే అటు భర్తకి ఇటు అత్తవారింటికి కూడా దూరం కావాలని కోరుకుంటోందని వార్తలు వినిపించాయి. అంతేకాదు ఐశ్వర్యరాయ్ తన చిన్ననాటి స్నేహితుడితో చనువుగా ఉండడం వల్లే.. అభిషేక్ బచ్చన్ ఆమెను దూరం పెట్టాడు అంటూ కూడా కొంతమంది కామెంట్లు చేశారు. పైగా డివోర్స్ న్యూస్ కి ఒకప్పుడు అభిషేక్ బచ్చన్ లైక్ చేయడం కూడా ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి అని వార్తలు సృష్టించారు. దీనికి తోడు ఒకసారి ఎయిర్పోర్ట్లో ఐశ్వర్యరాయ్ తన కూతురు ఆరాధ్యతో కలిసి ముంబై ఎయిర్పోర్టులో ఒంటరిగా కనిపించడంతో.. వీరిని ఎందుకు అభిషేక్ రిసీవ్ చేసుకోవడానికి రాలేదు అంటూ కూడా కామెంట్లు చేశారు. అంతేకాదండోయ్ అంబానీ పెళ్లిలో కూడా ఐశ్వర్య – అభిషేక్ ఎడమొహం పెడ మొహం గానే కనిపించడం విడాకుల వార్తలకు మరింత ఆజ్యం పోసింది.
విడాకుల రూమర్స్ కి చెక్ పెట్టిన ఐశ్వర్య – అభిషేక్..
ఇలా పలు కామెంట్లు వస్తున్న వేళ వీరిద్దరూ పలు పెళ్లి వేడుకలలో కనిపించి అందరిని ఆశ్చర్యపరిచారు. తాము విడిపోలేదని, కలిసే ఉన్నామని తెలిపారు. దీనికి తోడు ఇటీవల కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో కూడా ఐశ్వర్యరాయ్ నుదిటిన పెద్ద సింధూరం బొట్టును ధరించి విడాకుల వార్తలకు చెక్ పెట్టింది. ఇక అంతా సద్దుమణిగింది అనుకునే లోపే తాజాగా అభిషేక్ బచ్చన్ ఇంస్టాగ్రామ్ లో పెట్టిన ఇంట్రెస్టింగ్ పోస్ట్ అందరిలో మళ్లీ అనుమానాలు రేకెత్తించేలా ఉంది.
ఒంటరిగా ఉండాలని ఉంది – అభిషేక్ బచ్చన్
ఆయన తన ఇంస్టాగ్రామ్ పోస్ట్ లో..” నేను కొన్ని రోజులు అన్నింటికీ దూరంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ జన సమూహానికి దూరంగా ఉంటూ నన్ను నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను. నాకెంతో ఇష్టమైన వారి కోసం ఉన్నదంతా ఇచ్చేసాను. ఇప్పుడు నాకోసం కూడా సమయం కేటాయించుకోవాలి అనిపిస్తోంది. ఇక నన్ను నేను తెలుసుకోవడానికి కాస్త సమయం కావాలి. అందుకే కొంతకాలం ఒంటరిగా ఉండాలని కోరుకుంటున్నాను” అంటూ ఒక పోస్ట్ షేర్ చేశారు. ప్రస్తుతం ఇది వైరల్ గా మారుతోంది. ఇది చూసిన కొంతమంది యాంటీ ఫ్యాన్స్ ఎప్పటిలాగే ఐశ్వర్య- అభిషేక్ మధ్య వివాదం ముదిరింది.. అందుకే ఒంటరిగా ఉండాలని కోరుకుంటున్నాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
also read: Ananthika Sanil Kumar: వామ్మో అనంతికకి ఇంత చిన్న చెల్లెలు ఉందా.. మరో రష్మిక కానుందా?