BigTV English

Agent Movie: అఖిల్ ఏజెంట్ అందుకే ఫ్లాప్ అయింది.. కావాలనే చేశారా?

Agent Movie: అఖిల్ ఏజెంట్ అందుకే ఫ్లాప్ అయింది.. కావాలనే చేశారా?

Agent Movie: సినిమా ఇండస్ట్రీలో ప్రతివారం ఎన్నో కొత్త సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తూ ప్రేక్షకులను సందడి చేస్తూ ఉంటాయి. అయితే కొన్ని సినిమాలు ఊహించని విధంగా సక్సెస్ అందుకోగా, మరికొన్ని సినిమాలు కంటెంట్ అద్భుతంగా ఉన్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతూ ఉంటాయి. ఇలా ఎన్నో కంటెంట్ బలంగా ఉన్నప్పటికీ ప్రేక్షకుల ఆదరణ నోచుకోని సినిమాలు ఉన్నాయి. అలాంటి వాటిలో అఖిల్(Akhil) ఏజెంట్(Agent) సినిమా కూడా ఒకటి. సురేందర్ రెడ్డి(Surender Reddy) దర్శకత్వంలో అఖిల్ ఎంతో చాలెంజ్ గా తీసుకొని ఈ సినిమాలో నటించారు. ఇందులో అఖిల్ భారీ స్థాయిలో కష్టపడ్డారని యాక్షన్స్ సన్ని వేషాలను చూస్తేనే స్పష్టమవుతుంది.


కంటెంట్ పరంగా ఈ సినిమా అద్భుతంగా ఉన్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద మాత్రం నెగిటివ్ టాక్ సొంతం చేసుకొని నిర్మాతలకు కూడా నష్టాలను తీసుకువచ్చింది.. ఇక ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మించారు. ఇక ఇటీవల ఓటిటిలో విడుదలైన ఈ చిత్రం పరవాలేదు అనిపించుకుంది. ఇదిలా ఉండగా తాజాగా అఖిల్ ఏజెంట్ సినిమా సినిమాటోగ్రాఫర్ రసూల్ ఎల్లోరే (Rasool Ellore)ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయనకు ఏజెంట్ సినిమా గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.

నెగిటివ్ ప్రచారం..


రసూల్ సినిమాటోగ్రాఫర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. చిత్రం ,ఒకరికి ఒకరు, కిక్ వంటి ఎన్నో అద్భుతమైన సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. ఇక ఏజెంట్ సినిమాకు కూడా ఈయనే సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయనకు యాంకర్ ఏజెంట్ సినిమా గురించి ప్రశ్నలు వేశారు. ఇటీవల ఓటీటీలో విడుదలైన తర్వాత తాను సినిమా చూశానని, సినిమా చాలా బాగున్నప్పటికీ ఎందుకని సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చింది అంటూ ప్రశ్నించారు. అఖిల్ కూడా ఈ సినిమాలో చాలా కష్టపడ్డారని యాంకర్ తెలిపారు.

లెనిన్ పైనే అఖిల్ కెరియర్..

ఈ ప్రశ్నకు రసూల్ మాట్లాడుతూ ఏజెంట్ సినిమా చాలా అద్భుతంగా ఉంది. అఖిల్ కష్టపడటమే కాకుండా లుక్స్ పరంగా చాలా హ్యాండ్సమ్ గా కనిపించారు. కానీ ఈ సినిమా విడుదలకు ముందే కొంతమంది సినిమాపై నెగెటివిటీని పెద్ద ఎత్తున ప్రచారం చేశారని తెలిపారు. ఈ నెగిటివ్ ప్రచారం కారణంగానే సినిమాకు అలాంటి ఫలితం వచ్చిందని, ఏజెంట్ విషయంలో కావాలనే నెగటివ్ టాక్ క్రియేట్ చేశారు అంటూ రసూల్ ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక అఖిల్ విషయానికి వస్తే ఈయన ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 5 సినిమాలలో నటించారు కానీ ఇప్పటివరకు సరైన హిట్ మాత్రం దక్కలేదు. ఇక ఇటీవలే లెనిన్(Lenin) అనే సినిమాని కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా హిట్ అయితేనే అఖిల్ కు ఇండస్ట్రీలో కెరియర్ ఉంటుందని లేకపోతే తన కెరియర్ ఇబ్బందులలో పడే అవకాశాలు ఉన్నాయని చెప్పాలి. ఇక అఖిల్ కూడా ఈ సినిమాపై పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టారని ఎలాగైనా హిట్ కొట్టాలనే కస్తూనే సినిమా చేస్తున్నారని తెలుస్తోంది.

Also Read:  Vijay Devarakonda: విజయ్ దేవరకొండ సినిమాలకు బాయ్ కాట్ సెగ!

Related News

Manushi Chillar: సెలైన్ బాటిల్ తో కనిపించిన మానుషీ చిల్లర్.. ఏమైందంటూ ఫాన్స్ ఆందోళన!

ViswakSen : ఫిలింనగర్ లో వావన్ జ్యువెలరీని ప్రారంభించిన హీరో విశ్వక్ సేన్..

Star Hero: ఆ స్టార్ హీరో మూవీ సెట్ లో 120 మందికి అస్వస్థత!

Bollywood: 3 ఇడియట్స్ నటుడు కన్నుమూత.. కారణం ఏంటంటే?

Anasuya Bharadwaj : అనసూయ మళ్లీ దొరికిందిరోయ్..వీడియో హల్ చల్..

Honey Rose : హనీ రోజ్ నువ్వెక్కడ..? సినిమాలకు గుడ్ బై చెప్పేసిందా..?

Big Stories

×