Anantapur: శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం యర్రమంచి పంచాయితీ పరిధిలో ఉన్నా ఈ కియా(KIA) పరిశ్రమలో పెద్ద ఎత్తున కారు ఇంజిన్లు మాయమయ్యాయి. ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే కియతోపాటు ఈ ప్రాంతంలో 25 అనుబంధ పరిశ్రమలు ఉన్నాయి. అలాగే ప్రధాన పరిశ్రమలో రోజుకు 450 కార్ల ఉత్పత్తి జరుగుతుంది. వీటికి అవసరమైన పరికరాలు అనుబంధ పరిశ్రమల నుంచి వస్తుంటాయి. ఈ క్రమంలో దాదాపు 900 ఇంజిన్లు కనిపించడం లేదని కియా యాజమాన్యం మార్చి 19న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముందుగా ఫిర్యాదు లేకుండా దర్యాప్తు చేపట్టాలని యాజమాన్యం కోరగా.. పోలీసులు నిరాకరించారు.
అయితే, ఫిర్యాదు లేకుండా చర్యలు తీసుకోవడం సాధ్యం కాదని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో కియా ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టారు. ఈ నేపత్యంలో విచారణ కోసం ప్రత్యేక బృందాన్ని పోలీసు ఉన్నతాధికారులను నియామించారు.
Also Read: ఇవే తగ్గించుకొంటే మంచిది.. వైసీపీ లీడర్లకు క్లాస్!
కియా సంస్థకు అవసరమైన విడి భాగాలు విభిన్న ప్రాంతాల నుండి సరఫరా అవుతాయి. అయితే కారు ఇంజీన్లు తమిళనాడు నుండి వస్తుండగా మార్గమధ్యంలో చోరీ అయ్యాయా? లేదా కియా పరిశ్రమకు వచ్చాక దొంగిలించబడ్డారా? దీని వెనుక గతంలో కియలో పనిచేసి వెళ్లిన ఉద్యోగుల ప్రమేయం ఉందా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. కేసు విచారణ ఇప్పటికే దాదాపుగా పూర్తయినట్టు సమాచారం. విలైనంత త్వరలో మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించే అవకాశముంది.