E-Paper
Advertisement

భోజనం తర్వాత అందరూ చేసే తప్పులు ఇవే.. మీ జీర్ణక్రియకు హాని చేస్తాయి

భోజనం తర్వాత అందరూ చేసే తప్పులు ఇవే.. మీ జీర్ణక్రియకు హాని చేస్తాయి
Advertisement

Eating mistakes Harm digestion| ఇటీవల చాలా మంది ఆరోగ్యంగా ఉండేందుకు మంచి పోషకాహారం తీసుకుంటున్నారు. కానీ తిన్న భోజనం జీర్ణం అయ్యేందుకు సరైన అలవాట్లు పాటించరు. భోజనం తరువాత మీరు చేసే చర్యలు మీ జీర్ణక్రియ, ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతాయి. మీరు చేసే చిన్న చిన్న తప్పుల వల్ల జీర్ణక్రియ నెమ్మదించి, అసౌకర్యాన్ని కలిగిస్తాయి. దీర్ఘకాలంలో ఈ సమస్య మరింత పెరిగిపోవచ్చు. ఈ తప్పులను అర్థం చేసుకుంటే మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

భోజనం తర్వాత అలవాట్లు ఎందుకు ముఖ్యం?

భోజనం పూర్తి అయిన వెంటనే శరీరం జీర్ణక్రియ ప్రారంభమవుతుంది. ఆహారాన్ని సరిగ్గా జీర్ణం చేయడానికి శరీరానికి సమయం, శక్తి అవసరం. తప్పుడు అలవాట్లు ఈ సహజ ప్రక్రియను దెబ్బతీస్తాయి. దీని వల్ల గ్యాస్, యాసిడిటీ, ప్రేగుల్లో వాపు వంటి సమస్యలు వస్తాయి.

భోజనం తర్వాత ఎక్కువ నీరు తాగడం

Advertisement

భోజనం అయిన వెంటనే ఎక్కువ నీరు తాగడం మంచిది కాదు. దీని వల్ల ప్రేగుల్లో జీర్ణ రసాలు పలుచగా చేసి జీర్ణక్రియను నెమ్మది చేస్తుంది. దీని వల్ల కడుపులో భారం, అసౌకర్యం ఏర్పడుతుంది. అవసరమైతే చిన్న మొత్తాల్లో తాగండి.

భోజనం తర్వాత వెంటనే పడుకోవడం

చాలా మంది భోజనం అయిన తర్వాత వెంటనే పడుకుంటారు లేదా నిద్రపోతారు. ఈ అలవాటు యాసిడిటీ, జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. ఆహారం జీర్ణ వ్యవస్థలో సరిగ్గా కదలదు. భోజనం తర్వాత కనీసం 30 నిమిషాలు నిటారుగా కూర్చోండి లేదా నడవండి.

భోజనం తర్వాత వెంటనే స్నానం చేయడం

Advertisement

భోజనం అయిన వెంటనే స్నానం చేయడం తప్పు. దీంతో రక్తప్రసరణ దెబ్బతింటుంది. కడుపుకు రక్తప్రవాహం తగ్గి జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. ఇది అసౌకర్యం, జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. కనీసం 30 నుంచి 45 నిమిషాలు వేచి స్నానం చేయండి.

భోజనం తర్వాత సిగరెట్ కాల్చడం

భోజనం తర్వాత సిగరెట్ కాల్చడం జీర్ణక్రియకు, మొత్తం ఆరోగ్యానికి హానికరం. ఇది యాసిడిటీని పెంచి జీర్ణ వ్యవస్థను దెబ్బతీస్తుంది. పోషకాల వ్యవస్థను గ్రహించే పద్ధతిని ప్రభావితం చేస్తుంది. మంచి ఆరోగ్యం కోసం సిగరెట్ పూర్తిగా మానేస్తే మంచిది.

భోజనం తర్వాత వెంటనే పండ్లు తినడం

పండ్లు సాధారణ ఆహారం కంటే త్వరగా జీర్ణమవుతాయి. భోజనం తర్వాత వెంటనే తినడం వల్ల పులియడం జరిగి గ్యాస్, ప్రేగుల్లో వాపు వస్తాయి. భోజనం తర్వాత కనీసం ఒక గంట తర్వాత పండ్లు తినాలి.

భోజనం తర్వాత వెంటనే టీ లేదా కాఫీ తాగడం

టీ, కాఫీలో ఉండే కాంపౌండ్స్ జీర్ణక్రియను ప్రభావితం చేస్తాయి. ఆహారం నుంచి పోషకాల శోషణను తగ్గిస్తాయి. భోజనం తర్వాత వెంటనే తాగితే యాసిడిటే సమస్య పెరుగుతుంది. కనీసం 30 నిమిషాలు వేచి తాగండి.

భోజనం తర్వాత టైట్ బట్టలు వేసుకోవడం

టైట్ బట్టలు కడుపుపై ఒత్తిడి తెస్తాయి. ఇది జీర్ణక్రియను దెబ్బతీసి అసౌకర్యాన్ని కలిగిస్తుంది. గ్యాస్ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. భోజనం తర్వాత కాస్త సౌకర్యవంతమైన బట్టలు వేసుకోండి.

భోజనం తర్వాత భారీ వ్యాయామం చేయడం

భోజనం తర్వాత భారీ వ్యాయామం జీర్ణక్రియకు హాని చేస్తుంది. శరీరానికి ఆహారాన్ని జీర్ణం చేయడానికి శక్తి అవసరం. వ్యాయామం రక్తప్రవాహాన్ని కడుపు నుంచి మరల్చేస్తుంది. తీవ్రమైన వ్యాయామం చేయడానికి కనీసం ఒక గంట వేచి ఉండండి.

Also Read: మీ పక్కనే ఉంటూ తన స్వార్థం కోసం ఉపయోగించుకునే స్నేహితులు వీరే.. ఈ సంకేతాలతో గుర్తుపట్టండి

మంచి జీర్ణక్రియ కోసం చిట్కాలు

భోజనం తర్వాత కాసేపు నడవండి. ఆహారాన్ని నెమ్మదిగా, బాగా నమిలి తినాలి. సమతుల్య ఆహారం, సరైన సమయాల్లో భోజనం చేయండి. ఆరోగ్యకరమైన అలవాట్లను క్రమం తప్పకుండా అనుసరించండి.

 

Related News

హెవీ ఇయర్‌రింగ్స్‌తో చెవి నొప్పి వస్తుందా? చెవి రంధ్రాలు సాగకుండా ఈ సింపుల్ ట్రిక్ పాటించండి

ఒక్క పన్ను పీకడానికి రూ.2.25 లక్షలా.. అదే ఇండియాలో అయితే?

డెస్క్ జాబ్ చేస్తున్నారా? ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వచ్చే సమస్యలు ఇవే

తగ్గేదెలే.. ఈ తేదీల్లో పుట్టినవారు ఆత్మగౌరవం విషయంలో అసలు రాజీపడరు

స్కూల్‌కు వెళ్లే సమయం అయినా పిల్లలు నిద్రలేవడం లేదా? ఈ 5 టిప్స్‌తో మార్నింగ్ రొటీన్ మార్చండి

గుండెపోటు ముప్పును 30 శాతం తగ్గించగల పిల్.. తాజా అధ్యయనంలో అద్భుత ఫలితాలు

వర్షాకాలంలో తరచూ అనారోగ్యానికి గురవుతున్నారా? రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి ఈ పుడ్స్

రక్తంలో చక్కెర పెరగకుండా ఉండాలంటే ఆపిల్ తినాలా? పియర్ తినాలా?

Big Stories

Advertisement
×