E-Paper
Advertisement

మెడికల్‌ డివైజ్‌ పార్క్‌లో మంటల బీభత్సం.. పరుగులు తీసిన కార్మికులు

మెడికల్‌ డివైజ్‌ పార్క్‌లో మంటల బీభత్సం.. పరుగులు తీసిన కార్మికులు
Advertisement

Sultanpur: సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ పరిధిలోని సుల్తాన్‌పూర్‌ మెడికల్‌ డివైజ్‌ పార్క్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఇక్కడి ‘యాష్‌’ (Sahajanand Medical Technologies – SMT) అనే వైద్య పరికరాల తయారీ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

ప్రమాదం జరిగిన సమయంలో కంపెనీలో దాదాపు 2,000 మంది కార్మికులు విధుల్లో ఉన్నారు. లోపల మంటలు వేగంగా వ్యాపించడంతో పాటు, దట్టమైన పొగ కమ్ముకోవడంతో కార్మికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ప్రాణభయంతో అందరూ ఒకేసారి బయటకు పరుగులు తీయడంతో అక్కడ కాసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. కంపెనీ ప్రాంగణమంతా నల్లటి పొగతో నిండిపోయి కిలోమీటర్ల దూరం వరకు కనిపిస్తుండటం ప్రమాద తీవ్రతకు అద్దం పడుతోంది.

Advertisement

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే లోపల ప్లాస్టిక్ , ఇతర రసాయన పదార్థాలు ఉండటంతో మంటలు త్వరగా వ్యాపిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, కార్మికులందరూ సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: మహిళా బిల్లుపై మోదీది మోసం.. ఆ మెలిక వెనుక అసలు గుట్టు ఇదే.. మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు!

Advertisement

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×