BigTV English

Banana Storage Trick : పెన్నుతో అరటిపండ్లను నిల్వ ఉంచే ఈ ట్రిక్ మీకు తెలుసా ?

Banana Storage Trick : పెన్నుతో అరటిపండ్లను నిల్వ ఉంచే ఈ ట్రిక్ మీకు తెలుసా ?

Tips for Banana Storage : అరటి పండ్లు ఇంట్లో నిల్వ చేయడం చాలా కష్టం. కొనేటపుడు నిగనిగలాడుతూ కనిపించే అరటిపండ్లు.. ఇంట్లో మహా అయితే మూడురోజులు నిల్వ ఉంటాయి. వీటిని ఫ్రిడ్జ్ లో అసలే నిల్వ ఉంచకూడదు. ఉంచితే ఫ్రిడ్జ్ మొత్తం వాటి వాసనే వస్తుంటుంది. పెన్నును ఉపయోగించి.. అరటిపండ్లను ఎక్కువరోజులు నిల్వ ఉంచుకోవచ్చు. పెన్నును రాసేందుకే కాదు.. ఇలా కూడా ఉపయోగించవచ్చని చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు.


నిజానికి పెన్ను – అరటిపండు.. ఒకదానితో ఒకటి సంబంధం లేదు. ఈ రెండింటినీ కలిపి వాడితే అరటిపండు త్వరగా పాడవకుండా ఎక్కువరోజులు నిల్వ ఉంటుంది. ఒక్కసారి ఈ ట్రిక్ ట్రై చేశారంటే.. మళ్లీ మళ్లీ ఈ చిట్కాను మీరే ఫాలో అవుతారు. మరి పెన్నుతో అరటిపండ్లను ఎలా నిల్వ చేయొచ్చో తెలుసుకుందాం.

Read More : సమ్మర్.. మీ పిల్లల హెల్త్ ఇలా కాపాడండి..!


మొదటగా అరటిపండ్లను, పెన్ను తీసుకుని.. రెండు అరటిపండ్ల మధ్య ఉంచాలి. అరటిపండ్లలో మధ్యలో ఉండే భాగంలో పెన్నును పెట్టి.. దానికి దారం కట్టి ఇంట్లో ఎక్కడైనా వేలాడదీయొచ్చు. ఇలా చేయడం వల్ల అరటిపండ్లపై ఒత్తిడి పడకుండా ఉంటుంది. ఫలితంగా త్వరగా చెడిపోదు. మనం అరటిపండ్లను కొన్నరోజు నుంచి రోజులు గడిచేకొద్దీ.. పాడవుతుంటాయి. దీంతో బయటపారేస్తాం. అలా పాడవ్వడానికి కారణంగా.. వాటిపై పడే ఒత్తిడి. ఇలా పెన్ను ట్రిక్ ను ట్రై చేస్తే.. అరటిపండ్లు త్వరగా పాడవ్వకుండా ఉంటాయి.

అలాగే అరటిపండ్లు నల్లగా మారకుండా ఉండేందుకు.. తీగతో వేలాడదీయాలి. ఇలా వేలాడదీస్తే.. పాడవ్వకుండా నలుపు రాకుండా ఉంటుంది. అలాగే ప్లాస్టిక్ సంచిలోనూ చుట్టి ఉంచవచ్చు. అరటిపండ్లు తాజాగా ఉండాలంటే ఒక గిన్నెలో వెనిగర్ వేసి.. అందులో అరటిపండ్లు వేసి విడిగా వేలాడదీయాలి. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటించడం ద్వారా అరటిపండ్లను ఎక్కువరోజులు నిల్వ చేసుకోవచ్చు.

Read More :  డయాబెటీస్.. బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ మిస్టేక్స్ చేయకండి..!

అరటిపండును చిన్నపిల్లల నుంచి పెద్దల వరకూ.. అందరూ ఇష్టపడతారు. కానీ.. రాత్రివేళ అరటిపండును తింటే బరువు పెరుగుతారని చెబుతారు. అరటిపండులో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. శరీరానికి రోగనిరోధక శక్తినిస్తుంది. ఇందులో ఐరన్, పీచు, యాంటీ ఆక్సిడెంట్లు లభ్యమవుతాయి. జీర్ణ వ్యవస్థ, మూత్రపిండాలు, గుండెకు సంబంధించిన వ్యాధుల బారిన పడకుండా రక్షిస్తుంది.

సుమారు 80 గ్రాముల అరటిపండులో.. 65 కిలో క్యాలరీల ఎనర్జీ, 1 గ్రాము ప్రొటీన్, ఫ్యాట్ 0.1 శాతం, ఫైబర్ 1.1 గ్రాము, పొటాషియం 264 మిల్లీగ్రాములు ఉంటాయి. ఇందులో ఉంటే కార్బొహైడ్రేట్లు త్వరగా జీర్ణంకాని ఆహార పదార్థాలను కూడా త్వరగా జీర్ణమయ్యేలా చేస్తుంది. పేగులో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పెరుగుదలకు సహకరిస్తుంది. అరటిపండులో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమినో యాసిడ్.. మెదడును ప్రశాంతంగా ఉంచేందుకు సహాయపడే సెరొటోనిన్ గా మార్చుకుంటుంది.

Related News

Bald Head Regrowth: బట్టతల సమస్యకు చెక్.. ఇలా చేస్తే జుట్టు పెరగడం ఖాయం

Munagaku Benefits: మునగాకుతో మామూలుగా ఉండదు.. దీని బెనిఫిట్స్ తెలిస్తే..

Fenugreek Seeds Sprouts: మొలకెత్తిన మెంతులు తింటే.. ఈ సమస్యలు దూరం !

Avocado For Hair: అవకాడోతో మ్యాజిక్.. ఇలా వాడితే ఒత్తైన జుట్టు

Priyanka Tare: ఘనంగా SK మిస్సెస్ ఇండియా యూనివర్స్ ఇంటర్నేషనల్ అందాల పోటీలు.. విజేత ఎవరంటే?

Chia Seeds: నానబెట్టిన చియా సీడ్స్ తింటే.. ఇన్ని లాభాలా ?

Big Stories

×