BigTV English

Gangster Nayeem Assets: నయీమ్ భూములపై కబ్జాకోరుల కన్ను.. RDO బయటపెట్టిన అసలు నిజాలు

Gangster Nayeem Assets: నయీమ్ భూములపై కబ్జాకోరుల కన్ను.. RDO బయటపెట్టిన అసలు నిజాలు

Gangster Nayeem Assets: నయీమ్ ఎప్పుడో ఎన్‌కౌంటర్‌లో పోయాడు. కానీ.. అతను సంపాదించిన అక్రమాస్తులు అలాగే ఉన్నాయి. ఇప్పుడు.. నయీమ్ పేరుపై ఉన్న అక్రమ భూములపై కొందరి కన్నుపడింది. సిట్ విచారణతో.. నయీమ్‌కు సంబంధించిన భూముల్ని ప్రభుత్వం నిషేధిత జాబితాలో పెట్టింది. కానీ.. కొందరు బడాబాబులు అధికారులతో కలిసి.. ఆ భూముల్ని రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారుస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వెంచర్.. చౌటుప్పల్ మండలం తూప్రాన్‌పేటలోనిది. విజయ్ జేబీ ఇన్‌ఫ్రా పేరిట భారీ హోర్డింగులు పెట్టి.. 222 ఎకరాల లే అవుట్ అంటూ ప్రకటనలిస్తున్నారు. అయినా.. అధికారులు పట్టించుకోవట్లేదు.


1991లో ఎస్వీఎస్ రియల్ పేరుతో.. 108 ఎకరాల స్థలం ఇది. తర్వాత.. విజయ్ జేబీ ఇన్‌ఫ్రా వాళ్లు కొనుగోలు చేసి.. 222 ఎకరాల మెగా లేఅవుట్‌గా డెవలప్ చేశారు. ప్లాట్లు అమ్మేస్తున్నారు. అక్కడున్న పరిస్థితుల్ని తెలుసుకోగా.. కేవలం 108 ఎకరాల భూమి మాత్రమే లేఅవుట్‌కి సంబంధించింది. సర్వే నెంబర్ 12, 13, 14లో ఉన్న 56 ఎకరాలు నయీమ్ పేరిట ఉన్న భూములు. అదేవిధంగా సర్వే నెంబర్ 17, 18లో 26 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇలా.. మొత్తంగా 80 ఎకరాల భూముల్ని.. అక్రమంగా వెంచర్‌లోనే కలిపేశారు.

108 ఎకరాలున్న లేఅవుట్‌ని.. 222 ఎకరాలుగా చూపుతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని బిగ్ టీవీ వెలుగులోకి తీసుకురావడంతో.. హోర్డింగుల్లో 222 ఎకరాలు కనబడకుండా కవర్ చేశారు. విజయవాడ హైవే నుంచి వెంచర్‌లోకి వేసిన రోడ్డుకు.. 30 ఫీట్ల వరకే పర్మిషన్ ఉంది. అడ్డదారిలో.. 60 ఫీట్ల రోడ్డు కోసం పర్మిషన్ తెచ్చుకోవడం కూడా చర్చనీయాంశంగా మారింది.


విజయ్ జేబీ ఇన్‌ఫ్రా వెంచర్ వ్యవహారాన్ని.. బిగ్ టీవీ యాదాద్రి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లింది. దీనిపై సీరియస్‌గా స్పందించిన అధికార యంత్రాంగం.. ఆర్డీవోతో విచారణ జరిపిస్తున్నారు. కలెక్టర్ ఆదేశాలతో రంగంలోకి దిగిన చౌటుప్పల్ ఆర్డీవో శేఖర్ రెడ్డి.. లే అవుట్ కేవలం 108 ఎకరాలు మాత్రమేనని చెబుతున్నారు. జనాన్ని మోసం చేసేలా.. 222 ఎకరాలుగా చూపుతూ.. ప్రభుత్వ భూమిని కాజేయాలని చూసిన విజయ్ జేబీ ఇన్‌ఫ్రాపై చర్యలు తీసుకుంటామంటున్నారు.

Also Read: మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు.. 17 మంది ఇంజనీర్లపై ఇంజనీర్లపై క్రిమినల్ చర్యలు

నయీమ్ పేరిట ఉన్న భూములు నిషేధిత జాబితాలో ఉన్నప్పటికీ.. కొందరు బడా వ్యాపారులు రాజకీయ పలుకుబడితో, అధికారుల అండదండలతో కలిసి అక్రమంగా కబ్జా చేయాలని చూస్తున్నారని.. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Tags

Related News

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Rain Alert: ఓర్నాయనో.. ఇంకా 3 రోజులు వానలే వానలు.. ఈ జిల్లాల్లో పిడుగుల పడే అవకాశం

Telangana News: బీఆర్ఎస్‌లో కవితపై కుట్రలు.. ఆయన పనేనా?

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. విచారణకు కేంద్రమంత్రి సంజయ్, ఆ తర్వాత బాబు-పవన్?

Himayatsagar: నిండుకుండలా హిమాయత్ సాగర్.. గేటు ఎత్తి నీటి విడుదల, అధికారుల హెచ్చరిక

GHMC rain update: హైదరాబాద్‌లో భారీ వర్షం.. అక్కడ రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదు

Big Stories

×