BigTV English

Beer Expiry Date: చల్ల చల్లగా ఉందని బీర్ బాటిల్ ఎత్తేస్తున్నారా.. ఎక్స్పైరీ డేట్ చెక్ చేశారా లేదా..?

Beer Expiry Date: చల్ల చల్లగా ఉందని బీర్ బాటిల్ ఎత్తేస్తున్నారా.. ఎక్స్పైరీ డేట్ చెక్ చేశారా లేదా..?

Beer Expiry Date: వేసవికాలంలో ఎండలు మండిపోతున్నాయి. విపరీతమైన ఉక్కపోత కారణంగా జనాలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ తరుణంలో చల్లచల్లగా ఏదైనా తాగితే బాగుంటుందని అనుకుంటారు. ఈ క్రమంలో కూల్ డ్రింక్స్, జ్యూస్‌లు, వంటి చల్ల చల్లనివి తాగుతూ ఉంటూ కాస్త సేద తీరుతుంటారు. అయితే వేసవికాలంలో ఎక్కువగా ఇవే కాకుండా రాత్రి అయింది అంటే చాలు అబ్బాయిలు చల్లచల్లని బీర్లు తాగాలని చూస్తుంటారు. ఈ క్రమంలో బీరు చల్లగా ఉంటే చాలని మాత్రమే ఆలోచిస్తారు. కానీ బీరు ఎలా ఉంది, దాని ఎక్స్పైరీ డేట్ ఉందా, అయిపోయిందా అని మాత్రం ఆలోచించరు.


ఏ ఆహార పదార్థాలకు అయినా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. సూర్యుడు, గాలి, ఉష్ణోగ్రత ఎక్కువగా లేని చోట ఉంచడం వల్ల వాటి గడువు ముగుస్తుంది. అయితే ప్రతీ బీరు బాటిల్ కు కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. బీర్లు దాదాపు ఆరు నెలల పాటు ఉంటుంది. అందువల్ల బీర్ ను కొనుగోలు చేసేటప్పుడు దాని గడువు తేదీని తెలుసుకోవాలి. చాలా మంది పొరపాటుగా గడువు ఉందా లేదా అని కూడా చెక్ చేయకుండా కొనుగోలు చేస్తుంటారు. ఇలా గడువు ముగిసిన బీర్లను కొనుగోలు చేసి తాగడం వల్ల అనారోగ్యానికి గురవుతారు.

బీర్ గడువు తేదీ ముగిస్తే వాటిని అస్సలు కొనుగోలు చేయవద్దు. అయితే వైన్ పాడవదు కానీ బీర్లు మాత్రం త్వరగా పాడవుతాయి. బీరులో కేవలం 6 నుంచి 8 శాతం ఆల్కహాల్ మాత్రమే ఉంటుంది. అందువల్ల బీర్‌ను కొనుగోలు చేస్తే అనారోగ్య సమస్యలు ఎదురవుతాయట. దీనికి గల కారణం ఏంటంటే బీర్లను తయారు చేయడానికి గింజలను ఉపయోగిస్తారు. అందువల్ల బీర్లు కొంతకాలం తర్వాత పాడవుతాయి.


Tags

Related News

Pneumonia causes: న్యుమోనియా రావడానికి అసలు కారణాలివే !

Pineapple Benefits: ఖాళీ కడుపుతో పైనాపిల్ తింటే.. ఇన్ని లాభాలా ?

Night Shift Workers: నైట్ షిప్ట్ చేస్తున్నారా ? ఈ టిప్స్ మీకోసమే !

Late Sleep: రాత్రి 11 తర్వాత నిద్రపోతున్నారా ? ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు !

Japanese Interval Walking: జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్.. ప్రయోజనాలు తెలిస్తే ఈ రోజు నుంచి మొదలెడతారు !

Momos side effects: మొమోస్ తింటున్నారా? అయితే ఈ నిజం తప్పక తెలుసుకోండి..

Big Stories

×