Gayatri Hazarika: గాయత్రి హజారికా అస్సామీ సంగీత రంగంలో ప్రముఖ గాయనిగా గుర్తింపు పొందిన భారతీయ ప్లేబ్యాక్ సింగర్. లైవ్ పెర్ఫార్మెన్స్, ఆమె సోలో గాత్రంతో, భావోద్వేగాల కట్టిపడేసే పాటలతో, అస్సామీ సంగీత ప్రేమికుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఆమె అత్యంత ప్రసిద్ధ పాట“సరా పాటే పాటే ఫాగున్ నామే” అస్సామీ సంగీతంలో ఒక ఐకానిక్ క్లాసికల్ గా నిలిచింది. ఇంత ప్రసిద్ధి చెందిన గాయత్రి ఈరోజు మే 16న గౌహతిలోని నేమ్ కేర్ హాస్పిటల్ లో కోలం క్యాన్సర్ తో పోరాడుతూ 44 సంవత్సరాల వయసులో మృత్యుతో పోరాడి తుది శ్వాస విడిచింది.
స్టార్ సింగర్ కన్నుమూత..
ప్రముఖ అస్సామీ గాయని గాయత్రి హజారికా (44) కన్నుమూశారు. గత కొంతకాలంగా కోలన్ క్యాన్సర్ తో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో, శుక్రవారం గౌహతిలోని నేమ్ కేర్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ, ఈ శుక్రవారం మధ్యాహ్నం 2:15 నిమిషాలకు తుది శ్వాస విడిచారు. సారా పాటే పాటే ఫాగున్ నామే, జోనల్ నాసిక్ బనత్, ఆబెలిర్ హేంగోలి ఆకాసే,వంటి గీతాలతో అస్సామీ సంగీత రంగంలో తనదైన ముద్రవేశారు. ఆమె కంఠం అస్సామీ సాంస్కృతిక వారసత్వానికి ఐకానిక్ గా నిలిచింది. గాయత్రి సంగీత ప్రియులు హృదయాలను గెలుచుకుంది. అకాల మరణంతో అస్సామీ సంగీత ప్రియులకు తీరని లోటు. అక్కడి ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వాశర్మ తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు. గాయత్రీ హజారికా మరణం పట్ల పలువురు సినీ, ప్రముఖులు అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.