Skin Brighting Mask: ముఖ చర్మం తెల్లగా, కాంతివంతంగా మెరుస్తూ కనిపించాలని.. ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అందులోనూ ఏదైనా ఫంక్షన్ లేదా పెళ్లి ఉందంటే ముఖాన్ని వైట్‌గా, బ్రైట్‌గా మార్చుకునేందుకు వారం రోజుల ముందు నుంచే ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు బ్యూటీ పార్లర్‌కి వెళ్లి.. వేలకు వేలు ఖర్చు చేసి ఫేసియల్స్ చేపించుకుంటారు. కానీ ఇప్పుడు చెప్పబోయే రెమిడీని పాటిస్తే ఫేసియల్ అక్కర్లేదు. కేవలం ఒక్క రాత్రిలోనే మీ ముఖాన్ని తెల్లగా, కాంతివంతంగా మార్చుకోవచ్చు. మరి ఇంతకీ ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కొబ్బరి నూనె, పసుపు, ముల్తానీ మిట్టి ఫేస్ ప్యాక్
చిన్న బౌల్ తీసుకుని.. అందులో రెండు టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె, పసుపు చిటికెడు, ముల్తానీ మిట్టి టీ స్పూన్ వీలుంటే పచ్చిపాలు లేదా, రోజ్ వాటర్ కలిపి మెత్తగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి.. 15-20 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోండి. అద్భుతమైన రిజల్ట్ మీకు కనిపిస్తాయి. డార్క్ సర్కిల్స్ అన్ని తగ్గిపోతాయి. చర్మం కాంతివంతంగా, మెరిసేలా చేయడంలో సహాయపడుతుంది.
పసుపు, కాఫీ పొడి, పెరుగు, తేనె ఫేస్ ప్యాక్
ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని.. టీ స్పూన్ పసుపు వేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి. ఈ మిశ్రమాన్ని వేరే గిన్నెలోకి తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ కాఫీ పొడి, పెరుగు, తేనె కలిపి బాగా కలపండి. ఈ ఫేస్ ప్యాక్ ముఖానికి పెట్టుకుని అరగంట తర్వాత.. గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా రెగ్యులర్‌గా చేయడం ద్వారా.. ముఖంపై నల్లమచ్చలు, ట్యాన్ తొలగిపోయి.. చర్మం కాంతివంతంగా మారుతుంది.
అలోవెరాజెల్, తేనె, రోజ్ వాటర్, గ్లిజర్న్ ఫేస్ ప్యాక్
చిన్న గిన్నెతీసుకుని.. చెంచా అలోవెరా జెల్, టీ స్పూన్ తేనె, టీ స్పూన్ గ్లిజరిన్, రెండు టేబుల్ స్పూన్ కొబ్బరి పాలు వేసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి కొద్దిసేపటి వరకు మసాజ్ చేయండి. ఆ తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేసుకోండి. ముఖాన్ని తాజాగా ఉంచడంతో పాటు.. నలుపుదనాన్ని తగ్గించి చర్మం తెల్లగా మారేలా సహాయపడుతుంది.
శెనగపిండి, పటికపొడి, పాలు, తేనె, గ్లిజరిన్ ఫేస్ ప్యాక్
చిన్న బౌల్ తీసుకుని.. అందులో టీ స్పూన్ శెనగపిండి, టీ స్పూన్ పటిక పొడి, పాలు, తేనె, గ్లిజరిన్ సమపాళ్లలో తీసుకుని బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పెట్టుకుని అరగంట తర్వాత చల్లిటి నీటితో క్లీన్ చేసుకోండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే.. ముఖంపై మొటిమలు, మచ్చలు తగ్గించి.. తెల్లగా, కాంతివంతంగా మారేలా సహాయపడుతుంది.
Also Read: చర్మాన్ని తెల్లగా మార్చే టిప్స్.. ఇలా చేస్తే అప్సరసంత అందం మీ సొంతం..!
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.