BigTV English

Kannappa film: కన్నప్ప బ్రహ్మణ వివాదం… మూవీలో కీలక సీన్స్ కట్!

Kannappa film: కన్నప్ప బ్రహ్మణ వివాదం… మూవీలో కీలక సీన్స్ కట్!

Kannappa film:ప్రముఖ సీనియర్ స్టార్ హీరో మోహన్ బాబు (Mohan Babu) వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు మంచు విష్ణు(Manchu Vishnu). గత కొన్ని సంవత్సరాలుగా సినిమాలు చేస్తున్నారు కానీ స్టార్ స్టేటస్ ను అయితే సొంతం చేసుకోలేకపోయారు. ఇప్పుడు ఒకవైపు మా (MAA) కి ప్రెసిడెంట్గా వ్యవహరిస్తూనే.. మరొకవైపు సినిమాలలో కూడా కొనసాగుతున్నారు. అందులో భాగంగానే భారీ బడ్జెట్ తో.. పాన్ ఇండియా స్టార్స్ ను ఒకే చోట మిళితం చేస్తూ చేస్తున్న సినిమా కన్నప్ప. భారీ అంచనాల మధ్య జూన్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించి టీజర్, ట్రైలర్,ఫస్ట్ లుక్ పోస్టర్స్, గ్లింప్స్ అన్నీ కూడా విడుదల చేశారు. అయితే ఇందులో ప్రభాస్ (Prabhas)లుక్ తప్ప ఏ ఒక్కటి కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. దీనికి తోడు ఇప్పుడు బ్రాహ్మణ వివాదం కూడా అడ్డుగా మారింది.


బ్రాహ్మణ సంఘం కేసులో చిత్ర బృందానికి రివిజన్ కమిటీ రిపోర్ట్ షాక్..

ఈ సినిమాలో బ్రహ్మానందం(Brahmanandam), సప్తగిరి(Saptagiri ) బ్రాహ్మణులు పాత్రలలో నటించారు. పైగా వీరు చేసిన పాత్రలు, చెప్పిన డైలాగ్స్ బ్రాహ్మణ సంఘాన్ని అవమానపరిచేలా ఉన్నాయని, వీరి పాత్రలను రివీల్ చేసిన రోజు నుంచి పెద్ద ఎత్తున వివాదం జరుగుతున్న విషయం తెలిసిందే. అంతేకాదు బ్రహ్మానందం, సప్తగిరి, మోహన్ బాబు, మంచు విష్ణు పై కోర్టులో కేసు వేసిన విషయం కూడా తెలిసిందే. అయితే ఇప్పుడు విడుదలకు కేవలం నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో.. ఏకంగా ఈ సినిమాలో కీలకమైన సన్నివేశాలను కట్ చేయాలని రివిజన్ కమిటీ రిపోర్ట్ ఇవ్వడంతో చిత్ర బృందానికి ఊహించని షాక్ తగిలిందని చెప్పవచ్చు


సినిమా నుండి 13 సన్నివేశాలు తొలగించాల్సిందే..

అసలు విషయంలోకెళితే.. కన్నప్ప సినిమాలో 13 సన్నివేశాలు తొలగించమని రివిజన్ కమిటీ రిపోర్టు ఇచ్చింది. అంతే కాదు తొలగించిన సన్నివేశాలు, సినిమా కాపీ ఇచ్చిన తర్వాతనే సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇస్తామని కూడా రీజనల్ ఆఫీసర్ ప్రతిపాదించారట. సనాతన ధర్మాన్ని, సాంప్రదాయాలను కించపరచడం, దేవీ దేవతలను పిలక, గిలక పాత్రలతో బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని, కోయ కులాన్ని కించపరిచేలా తీసిన మొత్తం 13 సన్నివేశాలు తొలగించాల్సిందే అని.. 11 మందితో కూడిన రివిజన్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది.

హైకోర్టులో వీరంతా తమ వాదనలు వినిపించాల్సిందే..

ఇదిలా ఉండగా మరొకవైపు కన్నప్ప సినిమాపై బ్రాహ్మణ చైతన్య వేదిక.. రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రిట్ పిటిషన్ నంబర్ 6236/2025 కేస్ పెండింగ్ లో భాగంగా ప్రతి వాదులకు రీజనల్ ఆఫీసర్, సెన్సార్ బోర్డు, సినిమా నిర్మాత మంచు మోహన్ బాబు, బ్రహ్మానందం, సప్తగిరిలు ఈ కేసులో తమ వాదనలు కూడా వినిపించాల్సి ఉంది.

సినిమా చూసిన రివిజన్ కమిటీ సభ్యులు..

మరొకవైపు కన్నప్ప సినిమా విడుదలకు ముందు నుంచే సినిమాలో సనాతన ధర్మాన్ని కించపరచడం, దేవీ దేవతలను కించపరచడం, బ్రాహ్మణ సంస్కృతి సాంప్రదాయాన్ని కించపరచడం వంటి సన్నివేశాలు ఉన్నాయని బ్రాహ్మణ చైతన్య వేదిక చెబుతూనే వచ్చింది. కానీ ఎవరూ పట్టించుకోలేదు. అయితే.. జూన్ 15వ తేదీ ఆదివారం సాయంత్రం 11మంది రివిజన్ కమిటీ సభ్యులతో పాటు మంచు విష్ణు కూడా కలిసి సినిమా చూశారు. ఆ సినిమా చూసిన తర్వాతనే రివిజన్ కమిటీ ఇప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకుంది. రివిజన్ కమిటీ తీసుకున్న నిర్ణయానికి బ్రాహ్మణ సంఘం సంతోషం వ్యక్తం చేస్తున్నా.. చిత్ర బృందం దీనిపై ఎలాంటి వివరణ ఇస్తుందో చూడాలి.

13 సన్నివేశాలలో ఆ 3సన్నివేశాలు ఇవే..

రివిజన్ కమిటీ ఇచ్చిన రిపోర్టులో ఆ 13 సన్నివేశాలలో మూడు సన్నివేశాలను బయటకి తెలియజేశారు. అందులో
బ్రహ్మానందం డైలాగ్స్ కట్ చేశారు.
రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పు లేదు. పైగా
సెన్సార్ U/A రాబోతుంది అని సమాచారం.

Related News

Bollywood: రజనీకాంత్ హీరోయిన్ హుమా ఖురేషి తమ్ముడు హత్య!

Radhika Apte: ప్రెగ్నెన్సీలో కూడా వదలని నిర్మాత.. నీచుడు అంటూ రాధిక ఎమోషనల్!

Tollywood Movies :భార్యల గొప్పతనం తెలిపే సూపర్ హిట్ మూవీస్.. ఆ రెండు చూస్తే కన్నీళ్లు ఆగవు..

Theater Movies: నేడు థియేటర్లలోకి రాబోతున్న సినిమాలు.. భయంతో వణికిపోవాల్సిందే..!

Lokesh Kanagaraj: డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన నటుడు ప్రస్తుతం కోలుకుంటున్నాడు

Lokesh Kanagaraj: నేను కూలీ సినిమా కథను మొదట ఆ దర్శకుడు కి చెప్పాను

Big Stories

×