Skin Whitening at Home: ముఖం అందంగా, కాంతివంతంగా ఉండాలని.. ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఫేస్ తెల్లగా మార్చుకునేందుకు చేయని ప్రయత్నాలు అంటూ ఉండవు. కానీ ఫలితం మాత్రం సూన్యం. ఈ చిట్కాలు పాటించడం ద్వారా మీ చర్మం తెల్లగా, కాంతివంతంగా మారుతుంది. సహజ పదార్ధాలతో తయారైన ఈ రెమిడీస్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా.. ఆరోగ్యకరమైన గ్లో ఇస్తాయి. క్రమం తప్పకుండా ఈ టిప్స్ ఫాలో అవ్వారంటే మంచి ఫలితం ఉంటుంది. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పాలు, టమాటా ఫేస్ ప్యాక్
చిన్న గిన్నె తీసుకుని అందులో.. నాలుగు చెంచాలు పాలు, టమాటా గుజ్జు కలిపి ముఖానికి పెట్టుకోండి. 10-15 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోండి.. ముఖంపై మృతకణాలు, మలినాలు తొలగిపోయి ప్రకాశవంతంగా మెరుస్తుంది.
గుడ్డు, కలబంద ఫేస్ ప్యాక్
గుడ్డులోని తెల్లసొన చిన్న గిన్నెలోకి తీసుకుని.. అందులో కలబంద గుజ్జు వేసి బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లై చేసి అరగంట తర్వాత.. ఫేస్ వాష్‌తో శుభ్రం చేసుకోండి. ఇది యాంటీ ఏజింగ్‌గా పనిచేస్తుంది. ఇలా చేయడం ద్వారా ముఖంపై మొటిమలు, మచ్చలు తగ్గిపోయి.. కాంతివంతంగా మెరిసేలా చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది.
పెరుగు, ఓట్‌మీల్ ఫేస్ ప్యాక్
పెరుగు, ఓట్‌మీల్ పౌడర్ వేసి మెత్తగా పేస్ట్ లాగా సిద్ధం చేసుకోండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పెట్టుకుని అరగంట తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకుంటే.. చర్మానికి తేమను అందిస్తుంది. అలాగే ముఖం తాజాగా, కాంతివంతంగా మెరిసేలా చేయడంలో సహాయపడుతుంది.
తేనె, దాల్చిన చెక్క పొడి ఫేస్ ప్యాక్
టీ స్పూన్ తేనె, అర టీస్పూన్ దాల్చిన చెక్కపొడి తీసుకుని.. ముఖానికి అప్లై చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పెట్టుకుని అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా చేయడం ద్వారా ముఖంపై మొటిమలు, ముడతలు తగ్గిపోతాయి.
పెరుగు, నిమ్మరసం ఫేస్ ప్యాక్
చిన్న గిన్నె తీసుకుని రెండు టేబుల్ స్పూన్ పెరుగు, నిమ్మరసం టీ స్పూన్ కలిపి ముఖానికి పెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా చేయడం ద్వారా ముఖంపై జిడ్డు తొలగిపోయి.. కాంతివంతంగా మెరిసేలా చేయడంలో సహాయపడుతుంది.
కొబ్బరి నూనె, పసుపు ఫేస్ ప్యాక్
చిన్న బౌల్ తీసుకుని రెండు టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె, చిటికెడు పసుపు కలిపి ముఖానికి పెట్టుకుని.. అరగంట తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. తక్షణమే చర్మ నిగారింపు మీ సొంతం అవుతుంది.
తేనె, కాఫీ ఫేస్ మాస్క
ముందుగా చిన్న బౌల్ తీసుకుని.. అందులో రెండు చెంచాలు కాఫీ పొడి. చెంచా తేనె తీసుకుని బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పెట్టుకుని అరగంట తర్వాత.. గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోండి. చర్మాన్ని ఎక్స్ ఫోలియేట్ చేస్తుంది. కాంతివంతంగా మెరిసేలా చేయడంలో సహాయపడుతుంది.
Also Read: ఇంట్లోనే గోల్డ్ ఫేషియల్.. అందమైన చర్మం మీ సొంతం
రైస్ వాటర్, గోధుమ పిండి ఫేస్ ప్యాక్
రైస్ వాటర్‌లో టీ స్పూన్ గోధుమ పిండి కలిపి.. మెత్తగా పేస్ట్ లాగా చేసి ముఖానికి పెట్టుకోండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి అరగంట తర్వాత.. గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకుంటే.. మంచి ఫలితం ఉంటుంది. చర్మంపై మలినాలు తొలగిపోయి మిలమిల మెరుస్తుంది.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.