Beetroot For Skin: బీట్‌రూట్ తినడం వల్ల శరీరానికి గొప్ప ప్రయోజనాలు ఉన్నాయి. అదేవిధంగా, బీట్‌రూట్‌తో చేసిన ఫేస్ ప్యాక్‌ను ముఖానికి అప్లై చేయడం వల్ల కూడా చర్మానికి అద్భుత ప్రయోజనాలు లభిస్తాయి. బీట్‌రూట్‌తో తయారు చేసిన ఫేస్ ప్యాక్ మీ ముఖం యొక్క పాత గ్లో తిరిగి రావడానికి సహాయపడుతుంది.ఈ ఫేస్ ప్యాక్‌లను సహజసిద్ధమైన వస్తువులతో తయారు చేసుకోవచ్చు . బీట్‌రూట్‌తో తయారుచేసిన ఫేస్ ప్యాక్ ముఖంలోని తేమను నిలుపుకుని, మృదువుగా, ఆరోగ్యంగా మార్చడంలో సహాయపడుతుంది.
బీట్‌రూట్‌లో విటమిన్ సి, నైట్రేట్లు , యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి మీ చర్మాన్ని ఆరోగ్యంగా మార్చడంతో పాటు మెరుసేలా చేస్తాయి. బీట్‌రూట్ నుండి 5 రకాల ఫేస్ ప్యాక్‌లను ఎలా తయారు చేయాలో ఇప్పుడు గురించి తెలుసుకుందాం.
బీట్‌రూట్ తోఫేస్ ప్యాక్స్:
1.బీట్‌రూట్ ,పెరుగు ఫేస్ ప్యాక్
కావలసినవి:
బీట్‌రూట్ రసం – 2 టీస్పూన్లు
పెరుగు – 1 టీస్పూన్
తయారీ విధానం:పైన చెప్పిన మోతాదుల్లో బీట్‌రూట్ రసం, పెరుగును బాగా కలపండి. ఈ పేస్ట్‌ను ముఖం, మెడపై రాయండి. 15-20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో వాష్ చేయండి.
2.బీట్‌రూట్, తేనె ఫేస్ ప్యాక్:
కావలసినవి:
బీట్‌రూట్ రసం – 2 టీస్పూన్లు
తేనె – 1 టీస్పూన్
తయారీ విధానం: బీట్‌రూట్ రసం, తేనెను పైన చెప్పిన మోతాదుల్లో బౌల్ లో వేసుకుని బాగా కలపండి. తర్వాత ఈ పేస్ట్‌ను ముఖం, మెడపై రాయండి.తనంతరం 15-20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి.
3. బీట్‌రూట్ , శనగపిండితో ఫేస్ ప్యాక్:
కావలసినవి:
బీట్‌రూట్ రసం – 2 టీస్పూన్లు
శనగపిండి – 2 టీస్పూన్లు
పసుపు పొడి – చిటికెడు
తయారీ విధానం: అన్ని పదార్థాలను ఒక బౌల్‌లో వేసి బాగా కలపండి. తర్వాత పేస్ట్ లాగా చేయండి. ఈ పేస్ట్‌ను ముఖం, మెడపై రాయండి. 20-25 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి.
4. బీట్‌రూట్, ఓట్స్ ఫేస్ ప్యాక్:
కావలసినవి:
బీట్‌రూట్ రసం – 2 స్పూన్లు
ఓట్స్ పౌడర్ – 2 స్పూన్లు
పాలు – 1 tsp
తయారీ విధానం: పైన పేర్కొన్న అన్ని పదార్థాలను కలపండి. తర్వాత పేస్ట్ లాగా చేయండి. ఈ పేస్ట్‌ను ముఖం, మెడపై రాయండి. 20-25 నిమిషాల తర్వాత చల్లటి నీటితో వాష్ చేయండి.
5. బీట్‌రూట్ ,టమాటో ఫేస్ ప్యాక్:
కావలసినవి:
బీట్‌రూట్ రసం – 2 టీస్పూన్లు
టమాటో రసం – 2 స్పూన్లు
నిమ్మరసం – 1/2 tsp
తయారీ విధానం: అన్ని పదార్థాలను ఒక బౌల్ లో వేసి కలపండి . తర్వాత పేస్ట్ లాగా తయారు చేయండి. ఈ పేస్ట్‌ను ముఖానికి అప్లై చేయండి. 15-20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో వాష్ చేయండి.
కొన్ని ముఖ్యమైన విషయాలు:
బీట్‌రూట్ ఫేస్ ప్యాక్ వేసుకునే ముందు ప్యాచ్ టెస్ట్ చేయండి.
మీకు బీట్‌రూట్‌కు అలెర్జీ ఉంటే.. ఈ ఫఏస్ ప్యాక్ ఉపయోగించకండి.
ఈ ఫేస్ ప్యాక్‌ని వారానికి 2-3 సార్లు అప్లై చేయండి.
మంచి ఫలితాల కోసం ఈ ఫేస్ ప్యాక్‌ను రెగ్యులర్‌గా ఉపయోగించండి.
Also Read: మీ ముఖం చందమామలా మెరిసిపోవాలా ? అయితే ఇలా చేయండి
బీట్‌రూట్ ఫేస్ ప్యాక్ వల్ల కలిగే ప్రయోజనాలు:
బీట్‌రూట్‌లో ఉండే బీటా కెరోటిన్ చర్మానికి సహజమైన కాంతిని ఇస్తుంది.
చర్మాన్ని బిగుతుగా చేస్తుంది: ఇది చర్మాన్ని బిగుతుగా ఉంచడం ద్వారా ముడతలు, ఫైన్ లైన్లను తగ్గించడంలో సహాయపడుతుంది.
చర్మానికి పోషణనిస్తుంది: బీట్‌రూట్‌లో ఉండే విటమిన్లు, మినరల్స్ చర్మానికి పోషణనిచ్చి ఆరోగ్యంగా ఉంచుతాయి.
చర్మాన్ని మృదువుగా చేస్తుంది: ఇది చర్మాన్ని మృదువుగా చేస్తుంది.
చర్మాన్ని డిటాక్సిఫై చేస్తుంది: బీట్‌రూట్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని నిర్విషీకరణ చేయడం ద్వారా మొటిమలను తగ్గించడంలో సహాయపడతాయి.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.