BigTV English

Bigg Boss 8 Telugu : నామినేషన్స్ లో అందరి టార్గెట్ కన్నడ బ్యాచ్..శేఖర్ భాష అన్నంతపని చేశాడు..?

Bigg Boss 8 Telugu : నామినేషన్స్ లో  అందరి టార్గెట్ కన్నడ బ్యాచ్..శేఖర్ భాష అన్నంతపని చేశాడు..?

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ 8 తెలుగు హౌస్ లో 12 వారం నామినేషన్స్ ఆసక్తిగా సాగుతున్నాయి. ఎప్పటిలాగే నామినేషన్స్ జరుగుతాయని అందరు అనుకున్నారు. కానీ ఈ సారి బిగ్ బాస్ భారీ ట్విస్ట్ ఇచ్చాడు. ఆడియన్స్ ఊహలకు అందని విధంగా నామినేషన్స్ జరుగుతున్నాయి. బిగ్ బాస్ ఎండింగ్ కు వచ్చిన నేపథ్యంలో స్ట్రాంగ్ కంటెస్టెంట్ ను ఫైనల్ కు పంపించే పనిలో బిగ్ బాస్ ఉన్నాడు. నిన్నటి ఎపిసోడ్ లో నామినేషన్స్ సరికొత్తగా సాగాయి. గత వారాల్లో బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు రీఎంట్రీ ఇవ్వడం చూశారు కానీ నామినేషన్స్‌కి రప్పించడం మాత్రం ఇదే ఫస్ట్ టైమ్. మరి ఈ ఆలోచన ఎవరికొచ్చిందో తెలీదు కానీ రిజల్ట్ మాత్రం బంపర్ హిట్ అయింది. ఎందుకంటే వాళ్లు ఉన్నంతవరకూ ఒకలా ఉన్న హౌస్‌మేట్స్ వాళ్లు ఎలిమినేట్ అయిన తర్వాత హౌస్‌లో ఎలా బిహేవ్ చేస్తున్నారు.. వాళ్ల గురించి ఏం మాట్లాడారు ఇలాంటి విషయాలన్నీ పక్కాగా లెక్కలేసుకొని మరీ నామినేషన్స్ వేసే ఛాన్స్ ఎక్స్ కంటెస్టెంట్స్‌కి ఇచ్చాడు బిగ్‌బాస్.


ఈ ఛాన్స్ ను బిగ్ బాస్ మాజీ హౌస్ మేట్స్ అందరు వాడేసుకున్నారు. ముందుగా సోనియా నిఖిల్ ను చెడుగుడు ఆడుకుంది. యష్మీ, నిఖిల్ కు మధ్య పెద్ద బాంబ్ వేసింది. ఇక శేఖర్ బాషా కూడా తన పాయింట్లతో యష్మీ-ప్రేరణలను గట్టిగానే ఇరికించేశాడు. మీది గ్రూప్ గేమ్ అన్నట్లుగా అందరి ముందూ చూపించాడు. అసలు ఎపిసోడ్ మొత్తంలో ఏమి జరిగిందో ఒకసారి తెలుసుకుందాం..

బిగ్ బాస్ హౌస్ లో నిన్నటి నామినేషన్స్ లో హౌస్ లోకి వచ్చిన పాత కంటెస్టెంట్స్ అందరు కూడా కన్నడ బ్యాచ్ నే టార్గెట్ చేశారు. ముందుగా హౌస్‌లోకి వచ్చిన సోనియా.. ప్రేరణ, నిఖిల్‌ను నామినేట్ చేసింది. ఆ తర్వాత శేఖర్ బాషా ఎంట్రీ ఇచ్చి అందరినీ నవ్వుతూ పలకరించాడు. ఇక సింహాసనం మీద కూర్చొని.. నాకు బాధగా ఉంది నామినేట్ చేయడానికి కానీ తప్పదు… తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అంటూ ప్రేరణ, యష్మీ అంటూ ముందే చెప్పి మరి నామినేట్ చేశారు. నీవల్ల సీతకు గాయం అయ్యింది మర్చిపోయావు.. దీని తర్వాత పానిపట్ గేమ్‌లో నిఖిల్ మీ ఇద్దరినీ రఫ్‌గా హ్యాండిల్ చేశాడని.. నువ్వు బూతు కూడా వాడావ్.. నిజానికి నాకు అలా ఏం అనిపించలేదు.. కానీ మీరు అంతలా అరిచారు కాబట్టి.. మరి అంత బ్యాడ్ అనిపించినప్పుడు.. నిఖిల్‌ని నువ్వు ఎందుకు నామినేట్ చేయలేదు.


ఇక యష్మీని కూడా శేఖర్ భాష నామినేట్ చేసాడు. నీలో గ్రూపిజం అనేది కనిపిస్తుంది. దీనికి ఉదాహరణ చెప్తా.. అవినాష్ రోహిణిని సేవ్ చేసి నిఖిల్‌ని నామినేట్ చేశాడు. అప్పడు నిఖిల్ కూడా లైట్ తీసుకున్నాడు. కానీ నీకెందుకు పెయిన్ అయింది.. అవినాష్‌ని దీని గురించి అడిగావ్.. మరి అంత ఉన్నప్పుడు అవినాష్‌తో అప్పుడే ఎందుకు చెప్పలేదు. ప్రేరణను నామినేట్ చేస్తాను అన్నావు కానీ నామినేషన్స్ టైం లో ఏదోకటి చెప్పి తప్పించుకున్నావు. ఇలా ఒక్కో కారణం చెబుతూ యష్మీ, ప్రేరణకు గట్టి షాక్ ఇచ్చాడు. ఇక హౌస్ లో నిన్న జరిగిన నామినేషన్స్ మొత్తం కన్నడ బ్యాచ్ కు వ్యతిరేకంగానే ఉన్నాయి. మరి ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అని వార్తలు వినిపిస్తున్నాయి. చూద్దాం ఎవరు బయటకు వెళ్తారో..

Tags

Related News

Bigg Boss 9 Telugu: డబుల్ హౌస్.. డబుల్ డోస్..బిగ్ ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్

Monal Gajjar : బిగ్ బాస్ బ్యూటీ మోనాల్ గుర్తుందా.? ఇప్పుడేం చేస్తుందో తెలుసా..?

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Big Stories

×