BigTV English

OTT Movie : దిమ్మ తిరిగే ట్విస్టులున్న సస్పెన్స్ థ్రిల్లర్… దొంగతో కలిసి క్లాస్ అమ్మాయి ఊర మాస్ పనులు

OTT Movie : దిమ్మ తిరిగే ట్విస్టులున్న సస్పెన్స్ థ్రిల్లర్… దొంగతో కలిసి క్లాస్ అమ్మాయి ఊర మాస్ పనులు

OTT Movie : యూత్ ని ఎంటర్టైన్ చేసే మూవీస్ ఓటిటి ప్లాట్ ఫామ్ లో చాలానే ఉన్నాయి. వాటిలో కొన్ని సినిమాలు మాత్రమే మెమొరబుల్ గా ఉండిపోతాయి. అటువంటి ఒక ఫీల్ గుడ్ మూవీ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ పేరేమిటి ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.


నెట్ఫ్లిక్స్‌లో… 

ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ పేరు “ది ఛేజ్‘ (The Chase). ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీలో హీరోకి తను చేయని తప్పుకు జైలు శిక్ష పడుతుంది. పోలీసుల నుంచి తప్పించుకొని పారిపోయే క్రమంలో హీరో ఒక అమ్మాయిని కిడ్నాప్ చేస్తాడు. స్టోరీ వీళ్లిద్దరి మధ్య నడుస్తుంది. ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీ ఓటిటి ఫ్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే…

జాక్ అనే వ్యక్తికి ఒక బ్యాంకు రాబరీ కేసులో 20 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది. ఈ క్రమంలో అతడు పోలీసుల నుంచి తప్పించుకుని పరిపోతాడు. ఒకచోట సూపర్ మార్కెట్లో జాక్ ఉండటంతో పోలీసులు అక్కడికి వస్తారు. హీరోయిన్ కూడా అందులో షాపింగ్ చేస్తూ ఉంటుంది. పోలీసులను చూసిన జాక్, హీరోయిన్ తో నాదగ్గర గన్ ఉందంటూ బెదిరిస్తాడు. పోలీసులకు చిక్కకుండా ఆమెను కిడ్నాప్ చేసి కారులో తీసుకువెళ్తాడు. పోలీసులు జాక్ ను వెంబడిస్తారు. నిజానికి జాక్ ఆ దొంగతనం కేసులో అనవసరంగా ఇరుక్కుని ఉంటాడు. జాక్ కిడ్నాప్ చేసిన అమ్మాయి ఒక ధనవంతుడి కూతురు. ఆ విషయం తెలిసి జాక్ కి కాస్త టెన్షన్ పట్టుకుంటుంది. హీరోయిన్ తండ్రి జాక్ కి ఫోన్ చేసి డబ్బులు ఇస్తాను, నా కూతుర్ని వదిలిపెట్టు అని చెప్తాడు. జాక్ అందుకు ఒప్పుకోడు, ఎందుకంటే ఆమెను వదిలేస్తే పోలీసులు అతనిని పట్టుకుంటారని జాక్ భయపడతాడు. అలా కారులో వెళుతూ ఉండగా హీరోయిన్ కు జాక్ మంచివాడని తెలుస్తుంది.

జాక్ అందంగా ఉండటంతో అతనికి గర్ల్ ఫ్రెండ్ లేరని తెలుసుకొంటుంది. మనం ఎక్కడికైనా పారిపోయి పెళ్లిచేసుకుందాం అని జాక్ తో హీరోయిన్ అంటుంది. ఈ షాక్ నుంచి హీరో తెరుకొనేలోగా, వీళ్లు అలా వెళుతున్న క్రమంలో పోలీసులు రౌండప్ చేస్తారు. అనవసరంగా నిన్ను ఈ ప్రమాదం లోకి తీసుకొచ్చాను అంటూ హీరోయిన్ ను కారులో నుంచి వెళ్లిపొమ్మంటాడు. కారులో నుంచి దిగిన హీరోయిన్ గన్ తీసుకొని రిపోర్టర్ కి గురిపెడుతుంది. ఆమె అలా చేయడంతో అక్కడ ఉన్న వారంతా షాక్ కు గురవుతారు. జాక్ ను తీసుకొని హీరోయిన్ అక్కడున్న హెలికాప్టర్ లో నుంచి వేరే కంట్రీ కి వెళ్ళిపోతుంది. చివరికి వీళ్లిద్దరిని పోలీసులు అరెస్ట్ చేస్తారా? వేరే దేశానికి వెళ్లిన వీళ్లు కొత్త లైఫ్ ని స్టార్ట్ చేస్తారా? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే నెట్ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతున్న “ది ఛేజ్’ (The Chase) అనే ఈ  యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీని తప్పకుండా చూడండి.

Related News

OTT Movie : ఓటీటీలో దూసుకుపోతున్న సరికొత్త లవ్ స్టోరీ … సత్యదేవ్ వన్ మ్యాన్ షో … ఇందులో అంతగా ఏముందంటే ?

OTT Movie : ఈయన అలాంటి ఇలాంటి డాక్టర్ కాదులే … చేయిపడితే బెడ్ మీద గుర్రం సకిలించాల్సిందే …

OTT Movie : ‘జంబలకడి పంబ’ ను గుర్తు చేసే వెబ్ సిరీస్ … పొట్టచెక్కలయ్యే కామెడీ … ఫ్రీగానే చూడొచ్చు

OTT Movie : బాస్ తో హద్దులు మీరే యవ్వారం … పెళ్లి బట్టలతో కూడా వదలకుండా … ఒంటరిగా చూడాల్సిన సినిమా

OTT Movie : 70 ఏళ్ల వృద్ధుడికి థాయ్ మసాజ్ … రష్యన్ అమ్మాయితో రంగీలా డాన్స్ …

OTT Movie : ఫ్యామిలీ కోసం అడల్ట్ సైట్‌లోకి ఎంట్రీ … CA టాపర్ కూడా అలాంటి పనులు … ఈ సిరీస్ ను ఒక్కసారి చూడటం స్టార్ట్ చేస్తే

Big Stories

×