BigTV English

Beetroot Face Pack: బీట్ రూట్ ఫేస్ ప్యాక్‌తో.. మెరిసే చర్మం మీ సొంతం

Beetroot Face Pack: బీట్ రూట్ ఫేస్ ప్యాక్‌తో.. మెరిసే చర్మం మీ సొంతం

Beetroot Face Pack: మెరిసే, ప్రకాశవంతమైన చర్మాన్ని ఎవరు ఇష్టపడరు చెప్పండి. గ్లోయింగ్ స్కిన్ కోసం మనం రకరకాల స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వాడుతుంటాం. ఎందుకంటే ఇవి మన చర్మానికి కొత్త మెరుపును అందిస్తాయి. కొందరు గ్లోయింగ్ స్కిన్ కోసం రకరకాల కాస్మెటిక్స్ ఉపయోగిస్తుంటారు. కానీ వీటికి బదులుగా హోం రెమెడీస్ వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇదిలా ఉంటే బీట్ రూట్ గ్లోయింగ్ స్కిన్ కోసం చాలా బాగా ఉపయోగపడుతుంది. దీంతో తయారు చేసిన ఫేస్ ప్యాక్స్ చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేస్తాయి. బీట్ రూట్‌తో ఫేస్ ప్యాక్స్ ఎలా తయారు చేసుకుని వాడాలనే విషయాలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.


చర్మానికి బీట్‌రూట్ వల్ల కలిగే ప్రయోజనాలు:
బీట్‌రూట్ చర్మం, జుట్టుకు అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. దీనిలో విటమిన్ సి, ఫైబర్, ఐరన్, కెరోటినాయిడ్లు, పొటాషియం, విటమిన్ బి9 (ఫోలేట్), మాంగనీస్, ఎలక్ట్రోలైట్లతో పాటు ఇతర ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. బీట్‌రూట్‌లో లైకోపీన్ వంటి పదార్థాలు కూడా ఉంటాయి. ఇది చర్మ స్థితిస్థాపకతను మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా వీటిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ బెటాలైన్‌లను నివారిస్తుంది.

5 DIY బీట్‌రూట్ ఫేస్ మాస్క్‌లు:


1. బీట్‌రూట్, క్యారెట్ ఫేస్ మాస్క్:
ఈ ఫేస్ ప్యాక్ చర్మానకి మేలు చేస్తుంది. కొన్ని వారాల్లోనే మీ ముఖానికి గులాబీ రంగును ఇస్తుంది. బీట్‌రూట్ రసం, క్యారెట్ రసం సమాన మొత్తంలో తీసుకోండి. దీనిని కలిపి చిన్న ఐస్ క్యూబ్‌లుగా ఫ్రీజ్ చేయండి. ప్రతి రోజు ఉదయం చర్మంపై ఈ ఐస్ క్యూబ్‌ను రుద్దండి. 10-15 నిమిషాలు అలాగే ఉంచి.. గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. తరువాత మాయిశ్చరైజర్ రాయండి.

2.బీట్‌రూట్ , పెరుగు ఫేస్ మాస్క్:
ఈ ప్యాక్ చర్మాన్ని హైడ్రేట్ చేసి మృదువుగా ఉంచుతుంది. తురిమిన బీట్‌రూట్ తీసుకొని దానికి రెండు టీస్పూన్ల పెరుగు , కొన్ని చుక్కల బాదం నూనె కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడపై అప్లై చేసి బాగా మసాజ్ చేయండి. 15-20 నిమిషాలు అలాగే ఉంచి నీటితో శుభ్రం చేసుకోండి.

3.బీట్‌రూట్, క్రీమ్ ఫేస్ మాస్క్:
చర్మం నిస్తేజంగా మారడానికి ప్రధాన కారణాలలో ఒకటి టానింగ్. స్కిన్ టాన్ వదిలించుకోవడానికి ఈ ఫేస్ ప్యాక్ ఉపయోగించండి. మీరు చేయాల్సిందల్లా 1 టేబుల్ స్పూన్ తాజా బీట్‌రూట్ రసాన్ని 1 టేబుల్ స్పూన్ సోర్ క్రీంతో కలపండి. టాన్ అయిన చర్మంపై అప్లై చేసి 20 నిమిషాలు అలాగే ఉంచండి. గోరువెచ్చని నీటితో మీ ముఖాన్ని శుభ్రం చేయండి. వారానికి రెండుసార్లు ఈ ప్యాక్ ఉపయోగించండి.

Also Read: ముఖంపై మంగు మచ్చలా ? ఇలా చేస్తే.. ప్రాబ్లమ్ సాల్వ్

4. బీట్‌రూట్, పెరుగు ఫేస్ మాస్క్:
ఈ ఫేస్ మాస్క్ మీ చర్మాన్ని మృదువుగా చేస్తుంది. 4 టేబుల్ స్పూన్ల బీట్‌రూట్ రసాన్ని మూడు టేబుల్ స్పూన్ల పెరుగుతో కలిపి ముఖం, మెడపై అప్లై చేసి 15 నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయండి. ఇలా చేయడం వల్ల మీ చర్మం తక్కువ సమయంలోనే మెరిసిపోతుంది.

5. బీట్‌రూట్ , నారింజ తొక్కతో ఫేస్ మాస్క్:
మీ ముఖానికి తక్షణ, సహజమైన మెరుపును తీసుకురావడానికి ఈ ఫేస్ మాస్క్‌ను ప్రయత్నించండి. 2 టీస్పూన్ల నారింజ తొక్కల పొడి, 1 టీస్పూన్ బీట్‌రూట్ జ్యూస్‌ను బాగా కలపండి. ఈ మందపాటి పేస్ట్‌ను మీ ముఖం, మెడపై అప్లై చేసి ఆరిపోయే వరకు ఉంచండి. తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. తరచుగా దీనిని ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఉపయోగించే ముందు ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేసుకోండి.

Related News

Migraine: మైగ్రేన్ తగ్గాలంటే.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి చాలు !

Saggubiyyam Payasam: సగ్గుబియ్యం పాయసం.. ఇలా చేస్తే సూపర్ టేస్ట్ !

Cheese Pasta: అద్భుతమైన రుచితో ‘చీజ్ పాస్తా’, ఇలా తయారు చేస్తే.. లొట్టలేసుకుంటూ తింటారు !

Brain Boosting Foods: ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పెంచే ఫుడ్స్ ఏవో తెలుసా ?

Soaked Raisins: డైలీ ఉదయం నానబెట్టిన ఎండుద్రాక్ష తింటే.. ఇన్ని లాభాలా ?

Natural Honey: స్వచ్ఛమైన తేనె vs కల్తీ తేనె – ఇంట్లోనే తేడా తెలుసుకోండి!

Face Scrub: ఈ ఫేస్ స్క్రబ్స్ వాడితే.. ముఖం మెరిసిపోతుంది తెలుసా ?

Sleep Fast Tips: నిద్ర పట్టడం లేదా ? ఇలా చేస్తే.. ప్రాబ్లమ్ సాల్వ్

Big Stories

×