BigTV English

Tulsi Water: తులసి వాటర్ తాగితే.. వ్యాధులన్నీ పరార్ !

Tulsi Water: తులసి వాటర్ తాగితే.. వ్యాధులన్నీ పరార్ !

Tulsi Water: పురాతన కాలం నుండి నేటి వరకు తులసి మొక్కను పూజించే సాంప్రదాయం కొనసాగుతోంది.కానీ మీకు తెలుసా ? ఔషధ గుణాలతో సమృద్ధిగా ఉండే.. తులసి మొక్క ఆయుర్వేదంలో అద్భుతమైన ఔషధంగా ప్రసిద్ధి చెందింది. పురాతన కాలంలో తులసి ఆకులతో అనేక సమస్యలకు చికిత్స చేసేవారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. తులసి నీటిని తాగడం వల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. అంతే కాకుండా జీర్ణవ్యవస్థ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. తులసిలో విటమిన్లు , యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. తాజా తులసి ఆకులను నీటిలో మరిగించడం ద్వారా తులసి నీటిని తయారు చేయవచ్చు. ఈ నీటిని తాగడం ద్వారా మీరు అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.


తులసి నీళ్లు తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:

యాంటీఆక్సిడెంట్లు:
తులసి ఆకులలో ఫ్లేవనాయిడ్లు, పాలీఫెనాల్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరాన్ని ఫ్రీ రాడికల్ నష్టం నుండి అంటే కాలానుగుణ ఇన్ఫెక్షన్లు, వ్యాధుల బారి నుండి రక్షిస్తుంది. ఇలాంటి పరిస్థితిలో.. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. తులసి నీటిని తీసుకోవడం వల్ల అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. అంతే కాకుండా రోగనిరోధక శక్తి మెరుగ్గా ఉంటుంది.


రోగనిరోధక శక్తి:
జలుబు, దగ్గు, జ్వరం వంటి కాలానుగుణ వ్యాధులను ఎదుర్కునే వారు తులసి టీ తాగాలని చెబుతుంటారు. ఎందుకంటే తులసి అడాప్టోజెనిక్ లక్షణాలతో పాటు ఇమ్యునోమోడ్యులేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల శరీర రోగనిరోధక శక్తి మెరుగు పడుతుంది. అంతే కాకుండా శరీరం ఇన్ఫెక్షన్లు మొదలైన వాటితో పోరాడటానికి శక్తిని పొందుతుంది.

మెరుగైన జీర్ణక్రియ:
తులసిలో యాంటీ ఆక్సిడెంట్లు, కార్మినేటివ్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. తులసి ఆకులు తినడం వల్ల గ్యాస్ , ఉబ్బరం సమస్యకు దివ్యౌషధం లాంటిది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. తులసి నీటిని తాగడం వల్ల ప్రేగు ఆరోగ్యానికి చాలా మంచిది. అంతే కాకుండా ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయ పడుతుంది. మీరు గ్యాస్ , ఉబ్బరం సమస్యతో కూడా బాధపడుతుంటే.. తులసి నీటిలో సోంపు కలిపి హెర్బల్ టీ తీసుకోవచ్చు.

ఒత్తిడి:
తులసికి అడాప్టోజెనిక్ లక్షణాలు ఉన్నాయి. అందుకే తులసి నీటిని తాగడం వల్ల ఒత్తిడి నుండి బయటపడవచ్చు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. తులసి నీరు తాగడం వల్ల ఆరోగ్యానికి ప్రమాదకరమైన దీర్ఘకాలిక ఒత్తిడిని నిర్వహించడంలో సహాయపడుతుంది. అనవసర కారణాల వల్ల మీరు ఒత్తిడికి గురైతే.. మీరు కూడా తులసి నీటిని తాగవచ్చు.

Also Read: PCOS వల్ల బరువు పెరుగుతారా ? ఇందులో నిజమెంత ?

శ్వాసకోశ సమస్యలు:
పురాతన కాలం నుండి.. దగ్గు, గొంతు నొప్పి, జలుబు, ఉబ్బసం వంటి శ్వాస కోశ సమస్యలకు తులసిని తినమని చెప్తుంటారు. తులసిలో ఇమ్యునోమోడ్యులేటరీ లక్షణాలు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి శ్వాస కోశ సమస్యలు, నొప్పిని తగ్గించడం ద్వారా ఉపశమనం కలిగించడంలో సహాయ పడుతుంది.

Related News

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Big Stories

×