Mitchell Owen – PSL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( IPL 2025 ) నేపథ్యంలో… పంజాబ్ కింగ్స్ జట్టు తీసుకున్న నిర్ణయంతో పాకిస్తాన్ కు ఎదురు దెబ్బ తగిలింది. పాకిస్తాన్ సూపర్ లీగ్ ఆడుతున్న ఓ స్టార్ ఆటగాడిని పంజాబ్ కింగ్స్ లాగేసుకుంది. దీంతో టోర్నమెంట్ మధ్యలోనే పాకిస్తాన్ కు ఎగనామం పెట్టి… ఓ స్టార్ ఆటగాడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్లో చేరిపోయాడు. ఆ ప్లేయర్ ఎవరో కాదు మిచెల్ ఓవెన్. ఈ ఆస్ట్రేలియన్ క్రికెటర్ మిచెల్ ఓవెన్.. మ్యాక్సీ మామ స్థానంలో పంజాబ్ కింగ్స్ జట్టులోకి వచ్చేసాడు.
పంజాబ్ కింగ్స్ జట్టులోకి వచ్చిన ఆస్ట్రేలియా డేంజర్ ఆటగాడు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో… పంజాబ్ కింగ్స్ జట్టుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. పంజాబ్ కింగ్స్ ఆల్ రౌండర్ అయిన మాక్సిమామ… టోర్నమెంట్ మధ్యలోనే ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు. తాజాగా అతడు గాయానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలోనే.. మాక్స్ వెల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నుంచి తప్పుకున్నాడు. వాస్తవానికి గత సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తరుపున మ్యాక్సీ మామ ఆడిన సంగతి తెలిసిందే. అక్కడ దారుణంగా ప్రదర్శన కనబరిచాడు. ఒక్క మ్యాచ్లో కూడా సరిగ్గా ఆడలేదు. దీంతో చాలా తెలివిగా వ్యవహరించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అతన్ని పక్కకు పెట్టింది.
ఇక ఆ మాక్సిమామను పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేయడం జరిగింది. పంజాబ్ కింగ్స్ ఈ సీజన్ లో శ్రేయస్ అయ్యర్ ఆధ్వర్యంలో ఆడుతున్న సంగతి తెలిసిందే. కానీ ఇప్పటి వరకు…. ఒక్క మ్యాచ్ లో కూడా పెద్దగా మెరువలేదు మ్యాక్స్ వెల్. ఇంతలోనే అతనికి గాయం కూడా అయింది. ఇంకేముంది అతని పక్కకు పెట్టిన పంజాబ్ కింగ్స్… కొత్త ప్లేయర్ ను రంగంలోకి దించింది. ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్ ఆడుతున్న… మిచెల్ ఓవెన్ ను రంగంలోకి దింపింది పంజాబ్ కింగ్స్. దీంతో పాకిస్తాన్ సూపర్ లీగ్ ను మధ్యలోనే వదిలేసి… ఇండియా ఫ్లైట్ ఎక్కాడు మిచెల్ ఓవెన్.
మొన్న శుక్రవారం వరకు… పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంటులో పేషవార్ జల్మీ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఇతను… ఆదివారం రోజున పంజాబ్ కింగ్స్ జట్టులో చేరిపోయాడు. దీంతో పాకిస్తాన్ పరువు గంగలో కలిసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ నుంచి ఆఫర్ రాగానే… మిచెల్ ఓవెన్ వెంటనే వచ్చేసాడని.. పాకిస్తాన్ పరువు తీస్తున్నారు క్రికెట్ అభిమానులు. అంటే పాకిస్తాన్ సూపర్ లీగ్ ( PSL 2025) అంటే ఐపీఎల్ లీగ్ 2025 టోర్నమెంటులో ( IPL 2025 ) ఎక్కువ డబ్బులు వస్తాయని మిచల్ ఓవెన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే పాకిస్తాన్ కు ఎదురుదెబ్బ తగలాలని స్కెచ్ వేసిన ప్రీతి జింటా… మిచెల్ ఓవెన్ ను రంగంలోకి దింపిందని అంటున్నారు. ఇది ఇలా ఉండగా… పాకిస్తాన్ సూపర్ లీగ్ ఆడుతున్న మిచెల్ ఓవెన్ కు మూడు కోట్ల రూపాయలు ఇచ్చిన ప్రీతి జింటా… జట్టులోకి చేర్చుకుంది. మూడు కోట్లు రావడంతో వెంటనే ఇండియన్ ఫ్లైట్ ఎక్కేసాడు ఈ ఆస్ట్రేలియన్ ప్లేయర్.
Mitchell Owen has replaced Glenn Maxwell in PBKS for IPL 2025 👏🏻
Friday – Mitch Owen played in the PSL for Peshawar Zalmi 🇵🇰
Sunday – Mitch Owen signed by Punjab Kings in the IPL 🇮🇳
~ Does the PSL have no value?🧐 What's your take on this 🤔 pic.twitter.com/RtfNojg7sq
— Richard Kettleborough (@RichKettle07) May 4, 2025