BigTV English

Award to Indian Alcohol: ఇండియన్ జిన్ కు విశ్వవ్యాప్త గుర్తింపు, లండన్ కాంపిటీషన్ లో గోల్డ్ మెడల్!

Award to Indian Alcohol: ఇండియన్ జిన్ కు విశ్వవ్యాప్త గుర్తింపు, లండన్ కాంపిటీషన్ లో గోల్డ్ మెడల్!

ఈ రోజుల్లో మద్యం అనేది నిత్యవసర సరుకుగా మారిపోయింది. రోజు రోజుకు మద్యం తాగేవారి సంఖ్య పెద్ద సంఖ్యలో పెరుగుతోంది. పురుషులతో పోల్చితే మద్యం తాగే మహిళల సంఖ్య ఎక్కువ అవుతోంది. బారసాల మొదలుకొని బర్త్ డే వరకు, పెళ్లి నుంచి దినం దాకా కార్యక్రమం ఏదైనా మద్యం ఉండాల్సిందే అన్నట్లుగా తయారయ్యింది పరిస్థితి. ఈ నేపథ్యంలోనే తాజాగా లండన్ స్పిరిట్స్ కాంపిటీషన్ 2025 జరిగింది. ఈ వేడుకలో అనేక భారతీయ బ్రాండ్లు సత్తా చాటాయి. ప్రపంచంలోనే అత్యుత్తమ బ్రాండ్ గా ఇండియన్ జిన్ నిలిచింది.


భారతీయ జిన్ కు గోల్డెన్ అవార్డు

లండన్ లో జరిగిన ప్రపంచ స్థాయి బెస్ట్ స్పిరిట్ పోటీల్లో ఏకంగా 30 దేశాలు పాల్గొన్నాయి. ఆయా దేశాలకు చెందిన సుమారు 500 బ్రాండ్లు పోటీ బెస్ట్ బ్రాండ్ కోసం పడ్డాయి. వాటన్నింటినీ వెనక్కి నెట్టి లండన్ స్పిరిట్స్ కాంపిటీషన్ 2025లో భారతీయ మద్యం సత్తా చాటింది. జిన్ జిజి అనే జిన్ ఏకంగా 98 పాయింట్లు సాధించి ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. ప్రపంచంలోనే అత్యంత బెస్ట్ మద్యంగా గోల్డెన్ అవార్డు దక్కించుకుంది. స్పిరిట్ ఆఫ్ ది ఇయర్ టైటిల్ ను అందుకుంది. ఇదే కంపెనీకి చెందిన జిన్ జిజి డార్జిలింగ్ 92 పాయింట్లు సాధించిన రెండో స్థానంలో నిలిచింది. సిల్వర్ మెడల్ దక్కించుకుంది. వీటితో పాటు పలు ఇండియన్ బ్రాండ్ లు టాప్ లిస్టులో నిలిచాయి.


ఈ జిన్ జిజి ప్రత్యేకత ఏంటి?

ప్రతి ఏటా లిక్కర్ ట్రేడ్ నెట్ వర్క్ ఈ పోటీలను నిర్వహిస్తుంది. బెస్ట్ స్పిరిట్ ఎంపిక అనేది చాలా అంశాలను పరిగణలోకి తీసుకుని నిర్ణయిస్తారు. ఆయా బ్రిండ్లకు సంబంధించిన నాణ్యత, మద్యం క్వాలిటీ, టేస్టీ, తయారీ విధానం, ప్యాకింగ్ సహా పలు అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. తాజాగా జిన్ జిజి అన్ని పరీక్షల్లో నెగ్గి ఏకంగా 100కు 98 పాయింట్లు సాధించింది. ఈ జిన్ ను పూర్తిగా సాంప్రదాయ పద్దతులలో తయారు చేస్తారు. ఇందుకోసం కొన్ని రకాల ఔషధ మొక్కలను వినియోగిస్తారు. ఈ జిన్ రుచి భారతీయ వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా ఉంటుంది. ఈ మద్యాన్ని పీక్ అనే స్పిరిట్స్ కంపెనీ తయారు చేస్తుంది. ఇప్పటికే తమ కంపెనీ మద్యం అనేక  అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్నట్లు సంస్థ సీఈవో ఆన్స్ ఖన్నా వెల్లడించారు. లండన్ లో స్పిరిట్స్ కాంపిటీషన్ టైటిల్ దక్కించుకోవడం సంతోషంగా ఉందన్నారు.

జిన్ జిజి ఏ మార్కెట్లలో అందుబాటులో ఉందంటే?

ఇండియన్ బ్రాండ్ జిజి జిన్ ప్రస్తుతం ప్రపంచంలోని పలు దేశాల మార్కెట్లో అందుబాటులో ఉంది. అమెరికా, యూరప్, ఆసియా పసిఫిక్ సహా పలు దేశాల్లోని మద్యం మార్కెట్లలో లభిస్తున్నది. తాజాగా గుర్తింపుతో ఈ మద్యం ప్రపంచంలోని మరిన్ని మార్కెట్లకు విస్తరించే అవకాశం ఉన్నట్లు స్పిరిట్ ఎక్స్ ఫర్ట్స్ వెల్లడిస్తున్నారు. జిజి జిన్ మద్యం విలువ మార్కెట్లో రూ. 2000 కంటే తక్కువే ఉండటం విశేషం.

Read Also: స్కూటీ నడిపిన ఎద్దు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్!

Related News

Viral CCTV Video: ఫ్యాక్టరీకి వచ్చిన సింహం.. ఎదురుగా మనిషి.. ట్విస్ట్ తెలిస్తే నవ్వులే.. వీడియో వైరల్!

Elephant video: ఈ పిల్ల ఏనుగు పడుకున్న వ్యక్తిని లేపీ మరీ..? నిజంగా ఇది అద్భుతం.. వీడియో వైరల్

Fight Viral Video: విద్యార్థుల ముష్టి యుద్ధం.. చొక్కాలు చినిగినా, వదల్లేదు.. వైరల్ వీడియో!

Jana Gana Mana: జాతీయ గీతాన్ని చిన్నారి ఎంత ముద్దుగా పాడిందో చూడండి.. వావ్ అనాల్సిందే..!

Burning pyre reel: స్మశానంలో కాలుతోన్న శవం పక్కన.. డ్యాన్స్ చేస్తూ రీల్స్ చేసిన అమ్మాయి, వీడియో వైరల్

Viral wedding: అందుకే ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం.. వింత వివాహంపై స్పందించిన అన్నదమ్ములు

Big Stories

×