E-Paper
Advertisement

Besan For Skin Glow: శనగపిండితో ఇలా చేస్తే.. ముఖం మెరిసిపోవడం ఖాయం

Besan For Skin Glow: శనగపిండితో  ఇలా చేస్తే.. ముఖం మెరిసిపోవడం ఖాయం
Advertisement

Besan For Skin Glow: ఈ రోజుల్లో మారుతున్న జీవనశైలి చర్మాన్ని నేరుగా ప్రభావితం చేస్తుంది. వాతావరణ కాలుష్యం, పోషకాహార లోపం ఇలా చర్మ సంబంధిత సమస్యలు రావడానికి అనేక కారణాలు ఉంటాయి. కానీ బిజీ లైఫ్‌ కారణంగా చర్మాన్ని సంరక్షించుకోలేకపోతున్నాం. దీంతో ముఖంపై నల్లటి మచ్చలు రావడం కూడా ప్రారంభం అవుతాయి.

ఈ డార్క్ స్పాట్స్ వల్ల మీ యొక్క అందం కూడా తగ్గిపోతుంది. అటువంటి పరిస్థితిలో, ఈ సమస్యను వదిలించుకోవడానికి శనగపిండితో పాటు కొన్ని రకాల పదార్థాలను అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

Advertisement

శనగపిండిని అప్లై చేయడం ద్వారా మీ ముఖాన్ని అందంగా మార్చుకోవచ్చు.

శనగపిండి వల్ల కలిగే ప్రయోజనాలు:
మీ ముఖం కోల్పోయిన మెరుపును తిరిగి పొందడానికి.. మీవంటగదిలో ఉన్న శనగపిండిని ఉపయోగించవచ్చు. శనగపిండిలో అనేక ప్రొటీన్లు ఉంటాయి. ఇది ఆరోగ్యంతో పాటు చర్మానికి కూడా చాలా మేలు చేస్తుంది. శనగపిండి సహాయంతో చర్మంపై ఉన్న నల్లదనాన్ని దూరం చేసుకోవచ్చు.

Advertisement

శనగపిండి ఫేస్ ప్యాక్ తయారీకి కావలసిన పదార్థాలు:

శనగపిండి – 2 టేబుల్ స్పూన్లు
పెరుగు -1 చెంచా
నిమ్మరసం -1 స్పూన్

ఫేస్ ప్యాక్ ఎలా ఉపయోగించాలి ?

ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో పైన చెప్పిన మోతాదుల్లో శనగపిండి, పెరుగు, నిమ్మరసం వేసుకుని బాగా కలపాలి. ఇలా తయారు చేసిన ఈ మిశ్రమాన్ని ఫేస్‌‌పై అప్లై చేసి 10 నిమిషాల తర్వాత ముఖం కడుక్కోవాలి. ఇలా చేయడం ద్వారా ముఖం అందంగా మారుతుంది.

2. శనగ పిండి, రోజ్ వాటర్ ఫేస్ ప్యాక్..

కావలసినవి: 
శనగ పిండి -2 టేబుల్ స్పూన్లు
రోజ్ వాటర్ -1 టేబుల్ స్పూన్
ఆవాల నూనె -1 టీస్పూన్

ఎలా ఉపయోగించాలి ?

పైన చెప్పిన పదార్థాలను ఒక బౌల్‌లో తీసుకుని మిక్స్ చేయాలి. ఇలా తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. ఆ తర్వాత 10- 15 నిమిషాల పాటు ఉంచి శుభ్రం చేసుకోండి. ఇలా చేయడం ద్వారా ముఖంపై ఉన్న మొటిమలు తగ్గుతాయి. అంతే కాకుండా ముఖం అందంగా కనిపిస్తుంది.

3. శనగ పిండి, పసుపు, పాలతో ఫేస్ ప్యాక్..

కావలసినవి: 
శనగ పిండి -2 టేబుల్ స్పూన్లు

పాలు- 1 టీ స్పూన్

పసుపు- 1 టీ స్పూన్

Also Read: ముల్తానీ మిట్టితో.. మొటిమలు మాయం

ఎలా ఉపయోగించాలి ?

ముందుగా శనగపిండి, పాలు, పసుపు వంటి పదార్థాలను పైన చెప్పిన మోతాదుల్లో తీసుకుని ఒక బౌల్‌లో వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత దీనిని ఫేస్ ప్యాక్ లాగా వేసుకోవాలి.  అనంతరం 15- 20 నిమిషాల తర్వాత  కడిగేయాలి. ఇలా చేయడం ద్వారా ముఖం అందంగా మారుతుంది. అంతే కాకుండా ముఖంపై ఉన్న మొటిమలు కూడా తగ్గుతాాయి.

శనగపిండితో రకరకాల ఫేస్ ప్యాక్ లను తయారు చేసుకుని వాడటం వల్ల ముఖం  అందంగా మారుతుంది. ఫేస్ గ్లో కూడా పెరుగుతుంది. ముఖంపై మొటిమలు, మచ్చలు ఉన్న వారు ఫేస్ ప్యాక్ వాడటం వల్ల ముఖం మెరిసిపోతుంది.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

తినడానికే బతుకుతుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఎప్పుడూ తిండిపైనే ధ్యాస

ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సాయం చేస్తారు.. ఈ తేదీల్లో పుట్టినవారు కష్టకాలంలో తోడుగా నిలుస్తారు

మరణం తర్వాత శరీరంలోని ఏ అవయవం ఎంతసేపు జీవించి ఉంటుంది? ఈ విషయాలు తెలుసా

జీవితంలో ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకోరు, మోసపోరు.. చాణక్యుడు చెప్పిన ఈ నీతి సూత్రాలు పాటిస్తే

తక్కువ స్థలంలో కిచెన్ గార్డెన్‌.. ఇంట్లోనే కూరగాయలు పండించడం మరింత సులభం

రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం త్వరగా లేస్తున్నారా? మీ శరీరానికి కలిగే నష్టాలివే

పిల్లలు రాత్రి ఏ సమయం కల్లా నిద్రపోవాలి? టైమ్‌కు నిద్రపోకపోతే మెదడుపై ప్రభావం

రక్తపోటు పెరగడానికి మౌత్ వాష్ కూడా ఒక కారణమేనా.. తాజా రీసెర్చ్ ఏం చెబుతోంది?

Big Stories

Advertisement
×