BigTV English

Potato Stuffed Egg Bonda: పొటాటో స్టఫ్డ్ ఎగ్ బోండా రెసిపీ, ఇంట్లోనే పిల్లల కోసం సింపుల్ స్నాక్

Potato Stuffed Egg Bonda: పొటాటో స్టఫ్డ్ ఎగ్ బోండా రెసిపీ, ఇంట్లోనే పిల్లల కోసం సింపుల్ స్నాక్

Potato Stuffed Egg bonda: ఎగ్ బోండా అనగానే శెనగపిండిలో ముంచి నూనెలో వేయించేది అనుకోకండి, ఇక్కడ మేము ఎగ్‌లో స్టఫ్ట్ బంగాళాదుంప పెట్టి ఎగ్ బోండా ఎలా చేయాలో ఇచ్చాము. ఇది చాలా రుచిగా ఉంటుంది. సాయంత్రం పూట స్కూల్ నుంచి వచ్చాక పిల్లలకు బయట ఆహారాన్ని పెట్టే కన్నా ఇలా ఇంట్లోనే తాజాగా, ఆరోగ్యకరమైన పద్ధతిలో వండిన స్నాక్స్ పెట్టేందుకు ప్రయత్నించండి. నాలుగు గుడ్లతో ఎగ్ బోండా చాలా సింపుల్గా చేసేయొచ్చు. గుడ్డు లోపల ఇక్కడ మేము బంగాళదుంపతో చేసిన కూరను పెట్టాము. అందుకే దీని రుచి అదిరిపోతుంది.


పొటాటో స్టఫ్డ్ ఎగ్ బోండా రెసిపీ

గుడ్లు – నాలుగు
శెనగపిండి – ఒక కప్పు
బియ్యప్పిండి – రెండు స్పూన్లు
బంగాళదుంప – ఒకటి
ఉల్లిపాయ – ఒకటి
పచ్చిమిర్చి – రెండు
కారం – ఒక స్పూను
ఉప్పు – రుచికి సరిపడా
జీలకర్ర పొడి – అర స్పూను
అయిజ్వాన్ – పావు స్పూను
బేకింగ్ సోడా – చిటికెడు
పసుపు – అర స్పూను
మిరియాల పొడి -చిటికెడు
చాట్ మసాలా – అర స్పూను


Also Read: విలేజ్ స్టైల్లో నాటుకోడి కర్రీ వండారంటే రుచి మామూలుగా ఉండదు, ట్రై చేయండి

తయారీ

నాలుగు గుడ్లను ముందే ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. వాటిని నిలువుగా కట్ చేసి అందులోంచి పచ్చసొనను తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో శెనగపిండి, బియ్యప్పిండి, మిరియాల పొడి, ఉప్పు, జీలకర్ర పొడి, బేకింగ్ సోడా, పసుపు వేసి బాగా కలపాలి. తగినంత నీరును కూడా వేసి ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. ఒక బంగాళదుంపను బాగా ఉడికించి పైన పొట్టు తీసి ఒక గిన్నెలో వేసి చేతితోనే మెదుపుకోవాలి. ఆ బంగాళదుంపలోనే పచ్చసొన కూడా వేసి ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి తరుగు, కారం, ఉప్పు, చిటికెడు మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. చాట్ మసాలాను కూడా వేసి బాగా కలపాలి. అంతే పొటాటో స్టఫ్డ్ ఎగ్ బోండా రెడీ అయిపోయింది. ఇప్పుడు కోడిగుడ్డును తీసుకొని రెండు ముక్కల మధ్యలో బంగాళదుంప మిశ్రమాన్ని పెట్టి ఆ రెండు కోడిగుడ్డు ముక్కలను గట్టిగా నొక్కి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనె వేయాలి. నూనె వేడెక్కాక కోడి గుడ్డును ముందు కలిపి పెట్టుకున్న శెనగపిండి మిశ్రమంలో ముంచి నూనెలో వేసుకోవాలి. అది విడిపోకుండా అలాగే వేగుతుంది. అన్ని వైపులా ఎర్రగా కాగాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దాన్ని మధ్యకి ముక్కలు చేస్తే లోపల బంగాళదుంప మిశ్రమం కూడా టేస్టీగా ఉడికి తినేందుకు రెడీగా ఉంటుంది. ఇది పిల్లలకు ఎంతో నచ్చుతుంది.

Related News

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Big Stories

×