Drinks For Skin Glow: చలికాలంలో తగినంత తేమ లేకపోవడం వల్ల చర్మం గరుకుగా, పొడిగా మారుతుంది. దీని వల్ల ముఖం యొక్క రంగు మారడంతో పాటు, నిర్జీవంగా మారిపోతుంది. ఇలాంటి సమస్యల నుంచి బయటపడేందుకు ప్రజలు అనేక రకాల ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. వీటిని అధికంగా ఉపయోగించడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది.
ఇంట్లో సులభంగా తయారు చేసుకునే కొన్ని ఆరోగ్యకరమైన డ్రింక్స్ ఉన్నాయి. ఇవి మీ చర్మం యొక్క ఛాయను మెరుగుపరచడమే కాకుండా మీ చర్మానికి అవసరమైన పోషణను కూడా అందిస్తాయి.
1. నిమ్మ , తేనె నీరు:
చర్మం యొక్క ఛాయను మెరుగుపరచడానికి, నిమ్మ, తేనెతో నీరు త్రాగటం ప్రారంభించండి. నిమ్మకాయ విటమిన్ సి యొక్క మంచి మూలంగా పరిగణించబడుతుంది. ఈ డ్రింక్ తయారు చేయడానికి మీరు గోరువెచ్చని నీటిలో నిమ్మ రసంతో పాటు 1టీస్పూన్ తేనె కలిపి త్రాగండి. దీనిని తరుచుగా త్రాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ నీరు చర్మాన్ని హైడ్రేట్ చేయడమే కాకుండా చర్మానికి సహజమైన మెరుపును కూడా అందిస్తుంది.
2. కలబంద రసం:
శీతాకాలం లేదా వేసవి కాలం అనే కాదు ఏ సీజన్‌లో అయినా ఎప్పుడైనా కలబంద రసం తాగవచ్చు. ఇది చర్మపు రంగును మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా ముఖంపై ఉన్న మచ్చలను కూడా తొలగిస్తుంది. అంతే కాకుండా రోజూ కలబంద రసం తాగడం వల్ల అనేక ఆరోగ్య సంబంధిత వ్యాధులు కూడా నయమవుతాయి.
3. గ్రీన్ టీ త్రాగండి:
సాధారణ టీకి బదులుగా గ్రీన్ టీని ఆహారంలో చేర్చుకుంటే శరీరానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయి. ఇందులో తగినంత యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ఇవి చర్మాన్ని మెరుగుపరచడంతో పాటు, బరువు పెరిగే సమస్యలను కూడా తొలగిస్తుంది.
Also Read: బట్టతల రాకూడదంటే.. ఈ జాగ్రత్తలు పాటించండి
4. కొబ్బరి నీరు:
కొబ్బరి నీళ్లు తాగడం వల్ల మీ చర్మ సౌందర్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. చలికాలంలో కొబ్బరి నీరు త్రాగడం చాలా వరకు తగ్గిస్తారు. కానీ మీరు కొబ్బరి నీళ్లు త్రాగుతూ ఉంటే.. చర్మానికి అవసరమైన పోషకాలు అందడమే కాకుండా శరీరాన్ని శక్తితో నింపుతుంది.