BigTV English

Hair Fall: బట్టతల రాకూడదంటే.. ఈ జాగ్రత్తలు పాటించండి

Hair Fall: బట్టతల రాకూడదంటే.. ఈ జాగ్రత్తలు పాటించండి

Hair Fall: జుట్టు రాలే సమస్య సర్వసాధారణమైపోయింది. ప్రస్తుతం చాలా మంది జుట్టు రాలే సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా పురుషులు బట్టతలతో సతమతం అవుతున్నారు. 30 ఏళ్లు రాకముందే బట్టతల రావడంతో వారిలో ఆత్మవిశ్వాసం కూడా తగ్గుతోంది. అందుకే బట్టతల రాలకుండా ఉండాలంటే ముందుగానే జుట్టు రాలడానికి కారణాలను తెలుసుకుని జాగ్రత్తపడటం ఎంతైనా అవసరం.


ఇదిలా ఉంటే.. జుట్టు రాలడానికి అనేక కారణాలు ఉంటాయి. కానీ ప్రధాన కారణాలలో ఒకటి పోషకాహార లోపం. శరీరంలో కొన్ని విటమిన్ల లోపం వల్ల కూడా హెయిర్ ఫాల్ జరుగుతుంది. ఇలాంటి సమయంలోనే కొన్ని ప్రత్యేక విటమిన్లు జుట్టును బలోపేతం చేస్తాయి. అంతే కాకుండా జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. అందుకే జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి, దాని లోపాన్ని తీర్చడం చాలా ముఖ్యం. జుట్టు రాలడాన్ని తగ్గించడంలో సహాయపడే ఆ 5 విటమిన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

జుట్టు రాలడానికి చాలా కారణాలు ఉన్నా.. వాటిలో పోషకాహార లోపం ముఖ్యమైనది. శరీరంలోని కొన్ని విటమిన్ల లోపం వల్ల జుట్టు బలహీనమై రాలడం మొదలవుతుంది. అందువల్ల జుట్టు ఆరోగ్యంగా, దృఢంగా ఉండటానికి ఎలాంటి విటమిన్లు ఉపయోగపడాయో ఇప్పుడు తెలుసుకుందాం.


విటమిన్ డి లోపం:
జుట్టు కుదుళ్లను బలోపేతం చేయడంలో , కొత్త జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో విటమిన్ డి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. సూర్యరశ్మి వల్ల విటమిన్ డి లభిస్తుంది. ఇదే కాకుండా.. విటమిన్ డి చేపలు, గుడ్లు, పాలు, పెరుగు వంటి ఆహార పదార్థాల నుంచి కూడా విటమిన్ డి లభిస్తుంది.

బయోటిన్ (విటమిన్ B7):
బయోటిన్‌ని హెయిర్ విటమిన్ అని కూడా అంటారు. ఇది జుట్టును బలపరుస్తుంది. అంతే కాకుండా జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. గుడ్లు,విత్తనాలు, పప్పులు బయోటిన్ యొక్క మంచి వనరులు. వీటిని తరుచుగా తినడం వల్ల జుట్టు రాలే సమస్య చాలా వరకు తగ్గుతుంది.

విటమిన్-ఇ:
విటమిన్ ఇ ఒక యాంటీఆక్సిడెంట్. ఇది జుట్టును ఫ్రీ రాడికల్స్ నుండి దెబ్బతినకుండా కాపాడుతుంది. అంతే కాకుండా జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. బాదం,అవకాడోతో పాటు పొద్దుతిరుగుడు విత్తనాలు విటమిన్ ఇ యొక్క మంచి వనరులు.

విటమిన్ సి:
విటమిన్ సి జుట్టును బలోపేతం చేయడానికి అవసరమైన కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. నారింజ, నిమ్మకాయలు, స్ట్రాబెర్రీలు విటమిన్ సి యొక్క మంచి వనరులు.

ఐరన్:
ఐరన్ శరీర భాగాలకు ఆక్సిజన్‌ను చేరవేస్తుంది. ఇది జుట్టు పెరుగుదలకు అవసరం. ఐరన్ లోపం వల్ల జుట్టు రాలడం ప్రారంభమవుతుంది. బచ్చలికూర, బీట్‌రూట్, రెడ్ మీట్ లో ఐరల్ పుష్కలంగా ఉంటుంది.

ఆహారం ద్వారా ఈ విటమిన్లను తీసుకోవడంతో పాటు, మీ వైద్యుడిని సంప్రదించిన తర్వాత మీరు విటమిన్ సప్లిమెంట్లను కూడా తీసుకోవచ్చు.

జుట్టు రాలడానికి ఇతర గల కారణాలు:

టెన్షన్
హార్మోన్ల అసమతుల్యత
మందుల వాడకం
ఆరోగ్య సమస్యలు

Also Read: ఈ టిప్స్ పాటిస్తే.. జన్మలో జుట్టు రాలదు

జుట్టు రాలడం ఆపడానికి ఇంకా ఏం చేయాలి ?

ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి.
క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి
పుష్కలంగా నిద్రపోండి
ఒత్తిడిని తగ్గించుకోండి
కెమికల్స్ లేని షాంపూ, కండీషనర్ ఉపయోగించండి
జుట్టు దువ్వేటప్పుడు, నెమ్మదిగా దువ్వండి
జుట్టును తడిగా ఉంచుకోవద్దు.

డాక్టర్‌ని ఎప్పుడు సంప్రదించాలి ?
మీకు ఎక్కువగా జుట్టు రాలుతున్నట్లు అనిపిస్తే, మీరు వైద్యుడిని తప్పకుండా సంప్రదించండి. డాక్టర్ మీ జుట్టు రాలడానికి కారణాన్ని కనుగొని చికిత్స అందిస్తారు.

Related News

Pneumonia causes: న్యుమోనియా రావడానికి అసలు కారణాలివే !

Pineapple Benefits: ఖాళీ కడుపుతో పైనాపిల్ తింటే.. ఇన్ని లాభాలా ?

Night Shift Workers: నైట్ షిప్ట్ చేస్తున్నారా ? ఈ టిప్స్ మీకోసమే !

Late Sleep: రాత్రి 11 తర్వాత నిద్రపోతున్నారా ? ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు !

Japanese Interval Walking: జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్.. ప్రయోజనాలు తెలిస్తే ఈ రోజు నుంచి మొదలెడతారు !

Momos side effects: మొమోస్ తింటున్నారా? అయితే ఈ నిజం తప్పక తెలుసుకోండి..

Big Stories

×