Trump Tiktok Ban | అమెరికా తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడూ అసాధారణంగా వ్యాఖ్యలు చేస్తుంటారు. తాజాగా మరోసారి ఆయన అందరినీ ఆశ్చర్యపరిచారు. అమెరికాలో చైనా సోషల్ మీడియా యాప్ టిక్ టాక్ పై నిషేధం విధిస్తూ తీసుకువచ్చిన చట్టాంపై విధించాలని కోరుతూ ట్రంప్ సుప్రీం కోర్టులో పిటీషన్ వేశారు. జనవరి 20న తాను అధ్యక్ష పదవి చేపట్టేంతవరకు టిక్ టాక్ మాతృక సంస్థ బైట్ డాన్స్ ని చైనా విక్రయించకపోతే దాన్నినిషేధించకుండా స్టే విధించాలని ఆయన లీగల్ టీమ్ కోర్టును కోరింది.
“ఈ కేసులో కొన్ని కొత్త కోణాలు, క్లిష్ట పరిణామలు చోటుచేసుకున్నాయి. వీటిని పరిగణిస్తూ.. నిషేధం గడువుపై స్టే విధించాలని.. తద్వారా తదుపరి కార్యాచరణకు తగిన లభిస్తుందని కోర్టుని కోరుతున్నాం” అని ట్రంప్ తరపున లాయర్లు పిటీషన్ లో పేర్కొన్నారు.
టిక్ టాక్ యాప్ పై తాను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ట్రంప్ స్వయంగా నిషేధం విధించాలని తెగ ప్రయత్నాలు చేశారు. టిక్ టాక్ వల్ల అమెరికా జాతీయ భద్రత సమస్యలు తలెత్తే ప్రమాదముందని ఆయన కారణాలు చూపుతూ 2016-20 సమయంలో ట్రంప్ అధ్యక్ష హయాంలో టిక్ టాక్ నిషేధంపై చర్చలు కూడా జరిగాయి.
అమెరికాలో రెండు ప్రధాన రాజకీయ పార్టీలు రిపబ్లికన్స్, డెమోక్రాట్స్.. కూడా టిక్ టాక్ యూజర్లు అమెరికన్లు కాబట్టి వారి డేటాను చైనా ప్రభుత్వం చేజిక్కించుకొని దుర్వినియోగం చేసే అవాకాశాలున్నాయని తీవ్ర ఆరోపణలు చేశారు.
Also Read: 2025 ప్రపంచంలో మృత్యు తాండవం.. సిరియా పతనమే పునాది.. బాబా వంగా జోస్యం
అమెరికాలోని యువత టిక్ టాక్ ఎక్కువగా ఉపయోగించడంపై అక్కడి అమెరికా ప్రభుత్వాధికారులు కూడా ఇదే సమస్యను ఎత్తిచూపారు. టిక్ టాక్ పేరెంట్ కంపెనీ బైట్ డాన్స్ చైనా కోసం మాత్రమే విశ్వసనీయంగా పనిచేస్తోందని, ఈ కారణంగానే నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. కానీ ఈ ఆరోపణలన్నీ నిరాధారమని అప్పట్లో టిక్ టాక్ యజమాన్యం, చైనా ప్రభుత్వం ప్రకటించింది.
ఆ తరువాత అప్పటి అధ్యక్షుడు ట్రంప్ ఒక అమెరికా కంపెనీ టిక్ టాక్‌ని కొనుగోలు చేయాలని.. కావాలంటే ప్రభుత్వం కూడా వాటా కొనుగోలు చేస్తుందని సూచించారు. కానీ అలా జరగలేదు. ట్రంప్ 2020 అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి చెందిన తరువాత డెమొక్రాట్స అభ్యర్థి జో బైడెన్ ప్రెసిడెంట్ పదవి చేపట్టారు. అయితే ఆయన ట్రంప్ కంటే ఒక అడుగు ముందుకేసి టిక్ టాక్ యాప్ ను నిషేధిస్తూ ఒక చట్టం తీసుకువచ్చేశారు. అయితే ఈ చట్టానికి వ్యతిరేకంగా టిక్ టాక్ పేరెంట్ కంపెనీ అమెరికా సుప్రీం కోర్టులో పిటీషన్ వేసింది. ఈ పిటీషన్ విచారణ చాలాకాలంగా కొనసాగుతూనే ఉంది.
అయితే ఇప్పుడు అనూహ్యంగా ట్రంప్ తన మునుపటి నిర్ణయానికి తానే వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టుకు చేరారు. అమెరికాలో ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ యాప్ లకు పోటీ లేకుండా పోతుందని.. అందుకే టిక్ టాక్ ఉండాల్సిందేనని ఆయన బ్లూంబర్గ్ ఇంటర్‌వ్యూలో అన్నారు.
ఇక్కడ మరో విషయమేమిటంటే.. ట్రంప్ 2020 ఎన్నికల్లో ఓడిపోయాక ఆయన అనుచరులు 2021 జనవరి 6న అమెరికా క్యాపిటోల్ భవనంపై దాడులు చేశారు. ఈ చర్యలకు ట్రంప్ కారణమని చూపుతూ.. ఫెస్ బుక్ , ఇన్‌స్టాగ్రామ్ కంపెనీల అన్ని సోషల్ మీడియా యాప్ లు ట్రంప్ పై నిషేధం విధించాయి. ట్రంప్ అనుచరులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా హింసను ప్రేరేపించే పోస్టు చేస్తున్నందుకే వారిని బ్యాన్ చేశామని ఫెస్ బుక్ గ్రూప్ ప్రతినిధులు తెలిపారు. కానీ కొంత సమయం తరువాత ఆ నిషేధాన్ని తొలగించేశారు.
ఈ నేపథ్యంలో జనవరి 19, 2025 లోపు అమెరికాలోని టిక్ టాక్ కంపెనీ ఆస్తులన్నీ ఇతర కంపెనీలకు విక్రయించేయాలిన డెడ్ లైన్ ఉంది. ఈ డెడ్ లైన్ పై స్టే విధించాలని ట్రంప్ తాజాగా సుప్రీం కోర్టుని కోరారు.