Skin Care Tips: వర్షాకాలం స్టార్ట్ అయింది. ఈ సీజన్‌లో చర్మ సంరక్షణ ఎంతో అవసరం. చర్మంలోని మలినాలను బయటకు తప్పనిసరిగా పంపించాలి. లేదంటే పలు రకాల స్కిన్ ఎలర్జీలు వచ్చే అవకాశం ఉంది. అంతే కాదు వర్షాకాలంలో దీర్ఘ కాలిక వ్యాధులు అతివేగంగా వ్యాప్తిచెందే ప్రమాదం ఉంది . కాబట్టి మన ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. సరైన పోషకాహారం తీసుకోవాలి. అప్పుడే ఆరోగ్యంతో పాటు అందంగా కనిపిస్తారు. ముఖం అందంగా, కాంతివంతంగా మెరిసిపోవాలంటే.. సహజమైన ఫేస్ ప్యాక్స్ ట్రై చేయండి. మంచి రిజల్ట్ మీకు కనిపిస్తాయి. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
శెనగపిండి, తేనె, గ్రీన్ టీ ఫేస్ ప్యాక్
ముందుగా చిన్న గిన్నె తీసుకుని మూడు టేబుల్ స్పూన్ శెనగపిండి, టేబుల్ స్పూన్ తేనె, రెండు టేబుల్ స్పూన్ గ్రీన్ టీ, రోజ్ హిప్ ఆయిల్ ఐదు చుక్కలు కలిపి పేస్ట్ లాగా చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత.. గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా నెలకు మూడు సార్లు చేస్తే.. మంచి ఫలితం ఉంటుంది. గ్రీన్ టీ చర్మాన్ని పట్టులా మెరిసేలా చేస్తుంది. రోజ్ హిప్ ఆయిల్ చర్మాన్ని నిత్యం తేమగా ఉండేలా సహాయపడుతుంది. కాబట్టి మీరు కూడా ఓ సారి ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేయండి.
కీరా జ్యూస్, రోజ్ వాటర్ ఫేస్ ప్యాక్
ముందుగా కీరదోసను జ్యూస్ లాగా చేసుకుని.. అందులో రెండు టేబుల్ స్పూన్ రోజ్ వాటర్, గ్రీన్ టీ లీవ్స్ కొన్ని వేసి.. ఫ్రిజ్‌లో కాసేపు ఉంచి.. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 20 నిమిషాల తర్వాత.. సాధారణ నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే.. మంచి ఫలితం ఉంటుంది. కీరా చర్మంపై తలెత్తే ఇరిటేషన్‌ను తగ్గిస్తుంది. రోజ్ వాటర్ చర్మాన్ని కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది.
బంగాళదుంప, నిమ్మరసం, రోజ్ వాటర్ ఫేస్ ప్యాక్
బంగాళదుంపను మెత్తగా మిక్సీ పట్టీ.. రసం తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇందులో రెండు టీ స్పూన్లు నిమ్మరసం, రెండు టీస్పూన్లు రోజ్ వాటర్ కలిపి ముఖానికి పెట్టుకోవాలి. ఇలా రెండు రోజులకు ఒకసారి చేస్తే.. ముఖంపై మురికి, మృత కణాలు తొలగిపోయి కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది. వర్షాకాలంలో తలెత్తే మచ్చలు, దద్దుర్లు, యాక్నే లాంటి చర్మ సమస్యలను తొలగించడంలో బంగాళదుంప అద్భుతంగా పనిచేస్తుంది.
టమాటా, పాలు, పసుపు ఫేస్ ప్యాక్
ముందుగా చిన్న గిన్నె తీసుకుని.. అందులో రెండు టేబుల్ స్పూన్ పచ్చిపాలు, టీ స్పూన్ టమాటా జ్యూస్, చిటికెడు ఫేస్ ప్యాక్ వేసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 10 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా ప్రతిరోజు చేస్తే.. ముఖంపై ట్యాన్ తొలగిపోయి.. కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది.
Also Read: పసుపుతో ఇలా చేస్తే.. మెరిసే చర్మ సౌందర్యం మీ సొంతం..
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.